భారత కిచెన్ లో జీలకర్ర లేని వంటకాలు తక్కువే. మసాలా దినుసు గా జీలకర్ర కు చాలానే ప్రత్యేకత ఉంది. అయితే.. ఇది అందించే లాభాలు కూడా ఎక్కువ గానే ఉన్నాయండోయ్. మన జీర్ణవ్యవస్థను మెరుగు పరచాలంటే జీలకర్ర రోజు కొద్దీ పరిమాణం లో తీసుకుంటే చాలు. జీలకర్రను నములుతూ ఉంటె మన నోరు ఫ్రెష్ గా ఉండడమే కాదు.. జీర్ణవ్యవస్థ కూడా చురుకుగా పనిచేస్తుంది. అంతే కాదు బరువు తగ్గించడం లో కూడా ఇది ఎంత గానో ఉపయోగపడుతుంది.

jeelakarra

జీలకర్ర లో ధైమోల్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది క్లోమం నుంచి పిత్తాన్ని విడుదల చేయించి కొవ్వులు, కార్బోహైడ్రేట్లు కరగడానికి సహాయపడుతుంది. అలాగే.. వేగం గా బరువు తగ్గే విధం గా జీవక్రియను ప్రభావితం చేస్తుంది. అలాగే.. ఎక్కువ గా ఆకలి వేయకుండా దోహదం చేస్తుంది. ముందు రోజు రాత్రి జీలకర్రను నీటిలో నానబెట్టి.. ఉదయాన్నే అందులో కొద్దీ గా దాల్చిన చెక్క నీటిని కలిపి తీసుకోవడం వలన వేగం గా బరువు తగ్గుతారు. అలాగే జీలకర్ర నానబెట్టిన నీటిలో నిమ్మరసం వేసుకుని తాగడం వలన కూడా త్వరగా తగ్గుతారు.