ఆదిపురుష్‌.. సెన్సార్‌ బోర్డు పై మండిపడ్డ అలహాబాద్‌ హైకోర్టు..

ఆదిపురుష్‌.. సెన్సార్‌ బోర్డు పై మండిపడ్డ అలహాబాద్‌ హైకోర్టు..

by kavitha

Ads

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓ రౌత్‌ దర్శకత్వం వహించిన సినిమా ఆదిపురుష్‌. ఈ  చిత్రానికి ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన వచ్చింది. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ మూవీలో రాముడిగా ప్రభాస్‌, సీతాదేవిగా కృతీసనన్‌ నటించారు.

Video Advertisement

ఈ మూవీ రిలీజ్ కు ముందు నుండి విమర్శలను, వివాదాలను ఎదుర్కొంటుంది. హనుమంతుడి డైలాగ్స్, రావణాసురుడి పాత్రను మలిచిన తీరు పై వివాదాలు ఈ మూవీని చుట్టుముట్టాయి. ఈ సినిమాను నిలిపివేయాలని, కొన్ని డైలాగ్స్‌ ను తొలగించాలని పలు కోర్టులలో పిటిషన్స్‌ దాఖలయ్యాయి. వీటిలో తాజాగా అలహాబాద్‌ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..  ఇప్పటివరకు ఎన్నో సినిమాలు రామాయణం ఆధారంగా వచ్చాయి. కానీ ఆదిపురుష్ సినిమా పై వచ్చినన్ని విమర్శలు, వివాదాలు ఏ సినిమా పై రాలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి షో నుండే విమర్శల పాలవుతూ వస్తోంది. ఈమూవీలోని పాత్రల వేషధారణ, హనుమంతుడి డైలాగ్స్, ముఖ్యంగా రావణుడి పాత్ర తీరు పై ఆడియెన్స్ నుండి ప్రముఖుల వరకు విమర్శించారు. కొన్ని సీన్స్ ను రామాయణానికి విరుద్ధంగా తీశారనే విమర్శలు కూడా వచ్చాయి.adipurush banదాంతో ఈ మూవీని నిలిపివేయాలని పలువురు కోర్టులో పిటిషన్స్‌ కూడా దాఖలయ్యాయి. ఈ మూవీలోని కొన్ని డైలాగ్స్‌ని తొలగించాలని అలహాబాద్‌ హైకోర్టులో కూడా పిటిషన్‌ దాఖలు కాగా, దానిపై ఈరోజు విచారణ జరిగింది. ఈ విచారణలో హైకోర్టు సెన్సార్‌ బోర్డుని తప్పు బట్టింది. మూవీని సెన్సార్‌కు పంపించిన టైంలో ఇలాంటి సంభాషణలు ఎందుకు సమర్థించారని సెన్సార్‌ బోర్డుని ప్రశ్నించింది.ఇటువంటి సంభాషణలతో భవిష్యతు తరాలకు ఎటువంటి సందేశాలను ఇవ్వాలనుకుంటున్నారని మండిపడింది. ఆదిపురుష్ దర్శకుడు, నిర్మాత విచారణకు కోర్టులో హాజరుకాకపోవడం పై అలహాబాద్‌ హైకోర్టు అసహనం తెలిపింది.  ఈ మూవీలోని కొన్ని డైలాగ్స్  అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శలు రావడంతో మూవీ యూనిట్ ఆ డైలాగ్స్ ని తొలగించింది.

Also Read: “ఆదిపురుష్” సినిమాకి ఒక 8 ఏళ్ళ అబ్బాయి రియాక్షన్ చూస్తే నవ్వాగదు..!


End of Article

You may also like