అల్లరి నరేశ్ కామెడీ సినిమాలు చేసి ఎంత పాపులర్ అయ్యాడో, అవే రొటీన్ కామెడీ కంటెంట్‌తో అంతే ఫెయిల్యూర్‌ను చూశాడు. ఇక కామెడీ సినిమాలను పక్కనబెట్టి సీరియస్ పాత్రలు చేస్తూ తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్న ఈ యంగ్ హీరో.. నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకున్నాడు.
Video Advertisement
ఇప్పుడు ఇదే కోవలో మరో సీరియస్ కంటెంట్ మూవీతో మన ముందుకు రాబోతున్నాడు ఈ హీరో. ‘ఉగ్రం’ అనే పవర్‌ఫుల్ కాప్ డ్రామా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన అల్లరి నరేశ్, ఈ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్.. ‘ఉగ్రం’ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.
నాంది’ సినిమాను తెరకెక్కించిన విజయ్ కనకమేడల ఉగ్రం మూవీని కూడా తెరకెక్కిస్తుండటంతో మరోసారి ఈ కాంబినేషన్ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు. ఈ మూవీ మే 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది టీం.
తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసారు. సీరియస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 2 నిమిషాలకు ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. మరో వైపు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ సినిమాకు అద్భుతమైన రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ మూవీ లో అల్లరి నరేష్ ఇంటెన్స్ నటన తో అబ్బుర పరిచాడని తెలుస్తోంది.
అలాగే తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని కూడా ప్రశంసలు వస్తున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానేర్ పై హరీష్ పెడ్డి, సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో అందాల భామ మిర్నా హీరోయిన్‌గా నటిస్తోండగా శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు.
Also read: అల్లరి నరేష్ “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” సినిమా… ఆ “ఫేమస్” సినిమాని చూసి రీమేక్ చేశారా..?