Ads
చాలా మంది ములక్కాయలను ఇష్టంగానే తింటారు. కానీ మునగ చెట్టు ఆకులను మాత్రం పట్టించుకోరు. మునగ ఆకులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొంతమంది ఈ ఆకుతో పప్పు లాంటి పదార్ధాలను చేసుకుంటూ ఉంటారు. కానీ.. చాలా మంది అసలు దీనిని తినడానికే ఇష్టపడరు.
Video Advertisement
మునగాకులో క్యాల్షియం, పొటాషియం, విటమిన్ ఏ, ఫైబర్, విటమిన్ సి,ప్రోటీన్, ఐరన్, మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. మునగాకుని అన్నంలో తినడం ఇష్టం లేని వారు స్మూతీని తయారు చేసుకుని తాగితే ఎన్నో లాభాలు కలుగుతాయి.
ముందుగా గుప్పెడు మునగాకుని తీసుకుని శుభ్రంగా కడిగిపెట్టుకోండి. ఆ తరువాత ఒక ఆపిల్ ను తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. నాలుగు ఖర్జురాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. మిక్సీ జార్ లో ఈ మునగాకు, ఖర్జురాలు, ఆపిల్ ముక్కలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక గ్లాసున్నర కొబ్బరి పాలు, వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ స్మూతీని వారంలో మూడు సార్లు తాగితే మీకు ఉన్న అధిక బరువు సమస్య తగ్గిపోతుంది. శరీరంలో పేరుకున్న కొవ్వుని తొలగించడంలో ఈ స్మూతీ కీలకపాత్ర పోషిస్తుంది. రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. బిపిని అదుపులో ఉంచుతుంది. గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది.
End of Article