Ads
ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధ వాతావరణం ముదురుతున్న సంగతి తెలిసిందే. రష్యా దాడికి తెగబడడంతో ఉక్రెయిన్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ప్రాణాలు అరచేత పట్టుకుని అక్కడి ప్రజలు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు.
Video Advertisement
రష్యా అధ్యక్షుడు పశ్చిమ మరియు ఉక్రెయిన్ లు నాటోలో చేరబోమని మరియు ఉక్రెయిన్ సైనికరహితం చేసి తటస్థ రాజ్యంగా మారాలని హామీలు కోరుతున్నారు. ఈ విషయమై ఉక్రెయిన్ వెనక్కి తగ్గడంతో ఇరు ప్రాంతాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
వాస్తవానికి యుద్ధం రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్యే అయినా.. ఆ ప్రభావం మాత్రం ప్రపంచ దేశాలపైనా పడుతోంది. ఈ విషయమై ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఆనంద్ మహీంద్రా స్పందించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఆయన ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు. స్టాక్ మార్కెట్లు కుప్ప కూలడం మరోవైపు చమురు ధరలు పెరగడం లాంటి ప్రభావాలు ఇతర దేశాల్లో కనిపిస్తున్నాయన్నారు. ఈ యుద్ధాన్ని 21 వ శతాబ్దపు ప్రపంచ యుద్ధంగా ఆయన అభివర్ణించారు.
ప్రస్తుత సమయంలో జరుగుతున్న పరిణామాలను చూసి ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని.. భౌతికంగా యుద్ధం ఒక దేశంలోనే జరుగుతున్నా.. దాని ప్రభావం మాత్రం ప్రపంచ దేశాలపై పడుతోందని ఆయన పేర్కొన్నారు. 21 వ శతాబ్దపు ప్రపంచ యుద్ధానికి స్వాగతం అని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు. చమురు బ్యారెల్ ధర 130 డాలర్లకు చేరుకోగా.. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. రూపాయి కనిష్ట విలువకి పడిపోయింది. ఎక్కడో జరుగుతున్న యుద్ధం.. మన దేశ పరిస్థితులను కూడా ప్రభావితం చేస్తోంది. అందుకే మహేంద్రా ఈ ట్వీట్ ను చేసారు.
End of Article