ANANT AMBANI: “అనంత్ అంబానీ” బరువు గురించి కామెంట్ చేస్తున్నారు…కానీ ఆయన జర్నీ గురించి తెలుసా?

ANANT AMBANI: “అనంత్ అంబానీ” బరువు గురించి కామెంట్ చేస్తున్నారు…కానీ ఆయన జర్నీ గురించి తెలుసా?

by Harika

Ads

ప్రస్తుతం భారతదేశం అంతా కూడా ఒకవైపు మాత్రమే చూస్తోంది. అదే ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలు అయ్యాయి. అంబానీ ఇళ్లలో చిన్న చిన్న ఫంక్షన్స్ కి చాలా ఘనంగా సెలబ్రేషన్స్ జరుగుతాయి.

Video Advertisement

అలాంటిది వాళ్ళింట్లో ఇలాంటి పెద్ద వేడుకకి ఇంకా ఎంత ఎత్తున సెలబ్రేషన్స్ జరగాలి. అందుకే, హాలీవుడ్ పాప్ సింగర్స్ కూడా ఈ వేడుకలో పాల్గొని పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. బాలీవుడ్ టాప్ హీరోలు, హీరోయిన్లు, సింగర్స్ కూడా ఇందులో పాల్గొని అలరించబోతున్నారు. కొంత మంది రిహార్సల్స్ కూడా చేస్తున్నారు.

why did anant ambani gain weight

బాలీవుడ్ ప్రముఖులు అందరూ కూడా అంబానీ ఇంట్లో జరిగే ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నారు. ఎంతో మంది వ్యాపారవేత్తలు కూడా వస్తున్నారు. రాజకీయ నాయకులు, ఇంకా క్రీడారంగానికి చెందిన ఎంతో మంది ప్రముఖులు కూడా ఈవెంట్ జరగబోతున్న జాంనగర్ కి వెళ్తున్నారు. ప్రముఖ డిజైనర్లు అంబానీ కుటుంబం కోసం ప్రత్యేకంగా దుస్తులు తయారు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, అనంత్ అంబానీ తన తండ్రి ముఖేష్ అంబానీ స్థాపించిన సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సఫలం అయ్యారు.

why did anant ambani gain weight

తండ్రికి తగ్గ కొడుకు అనే మాట వింటూ ఉంటాం. కానీ దాన్ని నిజం చేసి చూపించారు. అనంత్ అంబానీ ఎన్నో సార్లు మీడియా ముందుకి వచ్చారు. అయితే, అంతకుముందు బరువుగా ఉండే అనంత్ అంబానీ, తర్వాత బరువు తగ్గారు. మళ్లీ బరువు పెరిగారు. 2013 సమయంలో ఐపీఎల్ మ్యాచ్ లకి వచ్చినప్పుడు బరువుగా ఉన్న అనంత్ అంబానీ, 2016 లో బరువు తగ్గారు. అంతకుముందు 208 కిలోలు ఉండేవారు. దాని నుండి 100 కేజీలకి చేరారు. తర్వాత మళ్లీ బరువు పెరిగారు.

why did anant ambani gain weight

దీనికి కారణాన్ని నీతా అంబానీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అనంత్ అంబానీకి ఆస్తమా ఉంది. దాన్ని కంట్రోల్ చేయాలి అంటే స్టెరాయిడ్స్ వాడాలి. వీటి వల్ల అనంత్ బరువు పెరుగుతున్నట్టు 2017 లో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా తన కొడుకు లాగానే బరువు పెరగడం అనే విషయంతో డీల్ చేస్తున్న చాలా మంది ఉంటారు అని, వారందరిని గౌరవించాలి అని నీతా అంబానీ చెప్పారు. ఆస్తమా వంటి సమస్య ఉన్నవారికి వైద్యులు సాధారణంగా స్టెరాయిడ్స్ తీసుకోమని సూచన ఇస్తారు. ఇలా చేయడం వల్ల శ్వాసకోశాల్లో వాపు తగ్గుతుంది. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదు.

why did anant ambani gain weight

కానీ ఇవి తీసుకోవడం వల్ల ఆకలి ఎక్కువగా ఉంటుంది. వ్యాయామాలు చేయడానికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఈ కారణంగానే బరువు పెరుగుతారు. ఇదే విషయాన్ని క్లుప్తంగా అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ని పెళ్లి చేసుకోబోతున్నారు. వీరిద్దరూ గత కొంత కాలం నుండి ప్రేమలో ఉన్నారు. గత సంవత్సరం వీరి నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు పెళ్లికి ముందు జరుగుతున్న ఈ సెలబ్రేషన్స్ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ALSO READ: రామ్ చరణ్ ని అందరి ముందు షారుఖ్ ఖాన్ ఇలా అవమానించారా..? అసలు ఏం జరిగిందంటే..?


End of Article

You may also like