మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలలో ‘వేట’ మూవీ కూడా ఒకటి. 1986లో తెరకెక్కిన ఈ సినిమాకి  దర్శకుడు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చిరంజీవి నటన, మణిశర్మ అందించిన సంగీతం హైలెట్ గా నిలిచాయి.

Video Advertisement

ఈ చిత్రంలో హీరో తప్పు చేయనప్పటికీ అతడి ఫ్రెండ్, న్యాయాధికారి, బాంక్ అధికారి కలిసి పోలీసులకు పట్టించడం,  వాళ్ళు హీరోని అత్యంత క్రూరంగా చెప్పుకునే అండమాన్ జైల్లో పడేస్తారు. అక్కడ చిరంజీవి చాలా కష్టాలు పడుతాడు. ఈ అండమాన్ జైలు గురించి కోరాలో అడుగగా ఒక యూజర్ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం.. “అండమాన్ జైలు’ చిరంజీవి గారి ‘వేట’ సినిమాలో చూపించినంత భయంకరంగా ఉంటుందా?” అని కోరాలో అడిగిన ప్రశ్నకు రాజేష్ అనే యూజర్ ఏం చెప్పారంటే, అవును చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ శిక్షలు కూడా అలానే ఉంటాయి. అప్పట్లో అమలు చేసిన శిక్షలు మన స్వాతంత్ర సమరయోధులు పడిన కష్టాలకి ఇప్పటికీ అక్కడ ఉన్న జైలు గోడలు మరియు ఒక రావి చెట్టు మౌన సాక్షాలు. పోయిన ఏడాది మా విహారయాత్రలో బాగంగా అండమాన్ దీవులకు వెళ్ళాం. ముఖ్యంగా అక్కడ జైలు నిర్మించడానికి కారణం అది ఒక ద్వీపం.
అప్పట్లో అక్కడికి వెళ్ళడానికి సముద్ర మార్గం ఒక్కటే. అక్కడ జైలు నిర్మాణం కూడా చాలా భయంకరంగా ఉంటుంది.  మొత్తం జైలులో ఉన్న ఖైదీలు ఒకరికి ఒకరు కనపడని విధంగా ఉంటుంది. ఇకపోతే అక్కడ శిక్షలు చాలా చాలా భయానకంగా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని గోనె సంచితో తయారు చేసిన చొక్కా ప్యాంట్ ను వేసి ఎండలో నిలబెట్టి శిక్షించడం. సరైన పనిముట్లు ఇవ్వకుండా చేతులతో ఎండిన కొబ్బరికాయల పీచు ఒలువడం, కొబ్బరి పీచుతో తాడు తయారుచేయటం. మిగిలిన కొబ్బరి నుంచి గానుగ ద్వారా ఒక ఎద్దు లేదా ఆవు ఒక రోజులో తియ్యగలిగే నూనె కంటే 3 రెట్లు తీపించటం, ఎదిరిస్తే కొట్టడం, మరీ తిరగబడితే గోనె సంచి చొక్కా వేసి ఇనుప కడ్డీలతో కట్టేసి ఎండలో నిలబెట్టడం. పారిపోవాలని ప్రయత్నించి పట్టుబడిన వారిని ముగ్గుర్ని కలిపి ఒకేసారి ఉరి తీయడానికి అవసరమైన ఉరి కంబం. జైలు నిర్మాణానికి ముందు తయారుచేసిన నమూనా. ఖైదీలు తప్పించుకునే అవకాశం లేకుండా తలుపులను ఇనుముతో గట్టిగా తయారు చేశారు. ఖైదీలను ఇనుప తాళ్లతో కట్టివేసే వాళ్లు ఇక్కడ.
ఈ జైల్లో ఉన్న కిటీకీల గురించి వివరంగా చెప్పాలి. ఖైదీలను ఉంచే ప్రతి గదికి ఒక చిన్న కిటికీ ఉంటుంది. అయితే అవి అందరికీ తెలిసిన కిటికీల లాంటివి కాదు. చాలా ప్రత్యేకంగా కట్టినవి. ఎలా అంటే, గది లోపలున్న ఖైదీలు కిటికీ నుంచి బయటకు చూస్తే వాళ్లకు కేవలం కిటికీకి ఎదురుగా ఉన్న కొద్ది ప్రదేశం మాత్రమే కనిపిస్తుంది. బయట ఏం జరుగుతుందో తెలియదు. కానీ, బయటి నుంచి కిటికీ గుండా లోపలికి చూస్తేమాత్రం, గదిలోని ప్రతి భాగం పూర్తిగా కనిపిస్తుంది. ఖైదీలు లోపల ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అన్నీ చూడొచు.
ఇప్పటికీ ఈ కిటికీల నిర్మాణం అంతు చిక్కని రహస్యమే. ఆ కిటికీ నా వెనక మీరు గమనించవచ్చు. జైలుకి వేయబడే తాళం, ఇది ఎంత పెద్దది అంటే కనీసం 10*10 అంగుళాల సైజులో ఉంది. శిక్ష అనుభవించిన ఖైదీలు రాసుకున్న కొన్ని విషయాలు. అక్కడి బాధలు, జైలు జీవితం గురించి చివరిగా అన్ని పోరాటాల తర్వాత, 1943 డిసెంబర్ 30న పోర్ట్ బ్లెయిర్ లోని జింఖానా గ్రౌండ్ లో నేతాజీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొందిన తొలి భారత భూభాగం అండామాన్ దీవులే అని ఆ రోజు నేతాజీ ప్రకటించారు” అని చెప్పుకొచ్చారు .

Also Read: ఎవరు ఈ యశ్వంత్ ఘడ్గే..? ఇతనంటే ఇటలీ వాళ్ళకి ఎందుకు అంత అభిమానం..?