కొన్నిసార్లు మనకు యాదృచ్చికంగా 111 లేదా 11:11 వంటి రిపిటెడ్ అంకెలు కనిపిస్తుంటాయి. అయితే ఆ నంబర్ కనపడడం యదృచ్చికం కాకపోవచ్చు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. న్యూమరాలజీ  ప్రకారం రిపిటెడ్ గా వచ్చే నంబర్లను ఎంజెల్ నంబర్లు అని పిలుస్తారట.

Video Advertisement

ఎంజెల్ నంబర్లు అనేవి ఎప్పుడైనా, ఎక్కడైనా కనిపించవచ్చని చెబుతున్నారు. మరి అసలు ఎంజెల్ నంబర్లు అంటే ఏమిటో? ఇవి కనిపించడంలో వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
న్యూమరాలజీ ప్రకారం, యూనివర్స్ లోని సూపర్ పవర్ సందేశాన్నితెలియజేయడానికి యాదృచ్ఛికంగా కనిపించే మూడు లేదా నాలుగు సంఖ్యల రిపిటెడ్ అంకెలను ఎంజెల్ నంబర్లు అంటారు. నంబర్లు మాత్రమే కాకుండా రీపిటెడ్  గా ఒకేవరుసలో కనిపించేది ఏడి అయినా దానిని యూనివర్స్ నుండి వచ్చే సందేశంగా భావించాలని చెబుతున్నారు.  ఉదాహారణకు 3 నల్లపురంగులో ఉండే పిల్లులు ఒకే వరుసలో కనిపించినా కూడా, అది ఫుచర్ లో కచ్చితంగా లైఫ్ లో  జరిగే మార్పుకు సూచనగా భావించాలట. ఇలా కనిపించిన ప్రతిసారీ అది యూనివర్స్ అందించే మెసేజ్ కాకపోవచ్చట. అయితే కొన్నిసార్లు పూర్వికులు నుండే సందేశం కూడా కావచ్చు. మరి కొన్నిసార్లు ఆధ్యాత్మిక వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్ కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎంజెల్ నంబర్లు ప్రతి రోజూ మనకు కనిపించకపోవచ్చు. అయితే ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ ఎంజెల్ నంబర్స్ కనిపించి మెసేజ్ అందించవచ్చట.
111 లేదా 11:11 అర్ధం.. 

ఒకటి ఇలా వరుస క్రమంలో కనిపిస్తే దాని అర్ధం కొత్త అవకాశాలు వస్తున్నాయని చెప్పడానికి సూచన. లేదా కొత్తగా  మొదలయ్యే సమయం కూడా కావచ్చు. లేక మీరు కొత్తగా దేని గురించి ప్లాన్ లేదా ఆలోచిస్తున్న విషయాలు ఫలించబోతున్నాయని చెప్పడానికి సూచన కావచ్చు. ఇలా 1 సీరీస్ అంకె కనిపించడానికి అర్ధం మీ ఆలోచనల పైన దృష్టి పెట్టమని సూచించడం కూడా కావచ్చు. 1 సీరీస్ అంకె కనిపించినపుడు మీ ఆలోచనలు, ప్రణాళికలు, లక్ష్యాల వంటి వాటి పై శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: ఫోన్ కవర్‌లో డబ్బులు పెడుతున్నారా..? అయితే ఇది తప్పక తెలుసుకోండి..!