ఇటీవల కాలంలో చాలామంది స్మార్ట్ ఫోన్ కవర్ లో కరెన్స్ నోట్లు పెడుతున్న విషయం తెలిసిందే. ఇది సాధారణంగా జరుగుతున్న విషయమే. ఇలా ఫోన్ కవర్‌లో పెట్టిన కరెన్సీ నోట్లు అత్యవసర సమయంలో ఉపయోగపడుతాయని చాలామంది భావిస్తుంటారు.
Video Advertisement
కానీ ఇలా చేయడం వల్ల ఉపయోగం కన్నా ప్రమాదమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయం తెలియనివారు కరెన్సీ నోట్లను ఫోన్ కవర్ లో పెడుతున్నారు. అయితే ఫోన్ కవర్‌లో కరెన్సీ నోట్లను ఉంచడం వల్ల ఏం ప్రమాదం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..
ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించినపుడు మొబైల్ వేడిగా అవడం అందరూ గమనించే ఉంటారు. ఫోన్ వేడి కాగానే దాని ఎఫెక్ట్ ఫోన్ వెనుక భాగంలో వెంటనే కనిపిస్తుంది. అటువంటి కండిషన్ లో ఫోన్ కవర్ లోపలివైపు కరెన్సీ నోట్లు ఉన్నట్లయితే, ఆ సమయంలో ఫోన్ నుండి వేడి బయటకు రిలీజ్ కాలేదు. దాని వల్ల బాగా వేడి అయిన ఫోను పేలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.
అందువల్లనే మొబైల్ కు బిగుతుగా ఉండే కవర్లను వాడకూడదని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే బిగుతుగా ఉండే కవర్ ఫోన్ పేలిపోయేలా చేస్తుందని చెబుతున్నారు. ఇక కరెన్సీ నోట్లను తయారీ చేయడం కోసం కాగితంను ఉపయోగిస్తారు. అంతేకాకుండా అనేక రకాలైన కెమికల్స్ ను కరెన్సీ నోట్ల తయారీలో ఉపయోగిస్తారు. ఎక్కువసేపు ఫోన్ వాడినపుడు ఫోన్ వేడెక్కుతుంది. ఆ సమయంలో అది బయటకు రాకుండా రసాయినాలతో తయారుచేసిన కరెన్సీ నోట్లు అడ్డు పడడం వల్ల ఆ పోన్ పేలిపోవడానికి ఎక్కువ అవకాశం కలుగుతుంది.
అందువల్ల ఎవరు పొరపాటున అయినా సరే ఫోన్ కవర్‌లో కరెన్సీ నోట్లను పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఫోన్ కవర్ బిగుతుగా ఉన్నకూడా ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఫోన్ కవర్ కొనుగోలు చేసేటపుడు జగ్రత్తగా మొబైల్‌కు గాలి తగిలేలా ఉండే కవర్‌ను ఎంపిక చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.