ప్రతి ఊరు రైల్వే స్టేషన్ కి కూడా బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మీద ఊరు పేరుని మూడు భాషల్లో వ్రాస్తారు. అలానే ఊరు పేరు రాసిన తర్వాత కిందన సముద్రమట్టానికి ఆ ఊరు ఎంత ఎత్తులో వుంది అన్నది కూడా రాస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీకు సందేహం కలిగిందా..? ఎందుకు మనం సముద్రమట్టానికి ఊరు ఎంత దూరంలో ఉంది అనేది రాయాలి అని..

Video Advertisement

అయితే మరి దానికి గల సమాధానం ఇప్పుడు చూద్దాం. నీటిమట్టాన్ని కొలతగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచంలో అంతో ఇంతో పెద్దగా తేడాలు లేకుండా ఒకే ఉపరితల మట్టానికి నీరే ఉంటుంది కాబట్టి.

ఉపగ్రహాలు జీపీఎస్ ద్వారా మరియు మరి కొన్ని పద్ధతుల ద్వారా కనుగొనడం జరుగుతుంది. మన దేశానికి సముద్ర మట్టం నుండి సగటు ఎత్తు 160 మీటర్లుగా భారతీయ సర్వే సంస్థ చెబుతోంది. అయితే వీటిని కొలచి సముద్రమట్టానికి స్థిరపరచి.. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే రైల్వే స్టేషన్స్ మరియు పోస్ట్ ఆఫీసుల్లో రాయాలన్నారు.

Also Read:   చిరు కూతురుతో ఉదయ్ కిరణ్ పెళ్లి ఆగిపోవడానికి అసలు రీజన్ అదేనట వైరల్ గా మారిన అతని కామెంట్స్

అలానే ముఖ్యమైన కట్టడాలలో కూడా రాయాలని చెప్పారు. అదే విధంగా బేస్లలో కూడా రాస్తారు. ఇలా రాయడం వల్ల ఏమవుతుంది అంటే మామూలు ప్రజలకు మరియు వీటి కొలతలతో నిర్మాణాలు చేపట్టే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది.

ఇలా రాయడం వల్ల పెద్ద పెద్ద నిర్మాణాలు, వాయు, హెలికాప్టర్ సర్వీస్, పొడుగైన టవర్లు కట్టేటప్పుడు ఇంజినీర్లకు మార్గదర్శకంగా ఉంటుంది. ఇలా దీని వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి రైల్వే స్టేషన్ బోర్డు మీద రాస్తారు. రైలు నడిపే వాళ్ళకి, రైలు మార్గంలో నిర్మాణాలు చేసే వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది. మామూలు ప్రజలు అయితే దీనిని చూసి ఇది కొండ ప్రాంతమా సముద్ర ప్రాంతమా అనేది తెలుసుకోవచ్చు.

Also Read:  ఈ రెండు ఫోటోల మధ్య రెండు తేడాలు ఉన్నాయి…అవి ఏంటో కనిపెట్టగలరా.?