మీకు ఎక్కువగా గోళ్ళు కొరికే అలవాటు ఉందా..! అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

మీకు ఎక్కువగా గోళ్ళు కొరికే అలవాటు ఉందా..! అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

by Anudeep

Ads

ప్రతి మనిషిలోనూ కొన్ని మంచి అలవాట్లు ఉంటాయి. కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. కానీ మనకు ఉన్న చెడు అలవాట్లను కొన్ని మనం అదుపులో పెట్టుకోగలం. కానీ మరి కొన్ని చెడు అలవాట్లను ఎంత మానుకున్నా మన అదుపు చేసుకోలేకపోతాం. అందులో మొదటగా ఉండే అలవాటు చేతి గోళ్ళు కొరకడం.

Video Advertisement

అవును.. మీరు చాలా మంది గమనించే ఉంటారు.. అలవాటు అన్నది చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా అయితే పిల్లల్లో మరీ ఎక్కువగా ఉంటుంది. మనం చిన్నప్పుడు నుంచి చేసే ఈ గోళ్ళు కొరకడం వలన మనకు ఒక వ్యసనంగా మారిపోతోంది. ఈ చెడు అలవాటే మన మానసిక పరిస్థితిపై ప్రభావితం చూపిస్తుంది. అదేవిధంగా ఆ చెడు అలవాటే మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఏంటి ఇలా చెప్తున్నాను అనుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

మనకు బాగా ఆలోచన ఎక్కువ అయినప్పుడు లేదా సైకలాజికల్ డిజార్డర్ వల్ల మనం ఎక్కువగా గోళ్ళు కొరుకుతుంటాం. గోళ్లలో సార్మేనేలా, క్లేబ్సిల్లా అనే హానికరమైన బ్యాక్టీరియా మన చేతి గోళ్ళలో ఉంటాయి అని పరిశోధనల్లో తేలింది. ఇవి మన కడుపులోకి వెళ్లడం వలన డయేరియా, ఫుడ్ పాయిజన్, ఆస్తమా వంటి అనారోగ్య సమస్యల బారిన పడతామని  తెలుపుతున్నారు.

అంతేకాకుండా గోళ్ళు కొరకడం వెనక ఒక లాజిక్ కూడా ఉంది. మన గోళ్ళు చివరన నెగటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది మన గోళ్ల ద్వారా బయటకు పోతుంది. ఎప్పుడైతే మన గోళ్ళు కొరకడం కోసం మన నోట్లో పెడతామో. అప్పుడు  ఆ నెగటివ్ ఎనర్జీ అనేది తిరిగి మళ్ళీ మన శరీరంలోకి వస్తుంది. అంతేకాకుండా మన చేతి గోళ్ళలో మట్టి వంటిది పేరుకుపోతుంటుంది. ఈ మట్టిలో అనేక సూక్ష్మ జీవులు ఉంటాయి. అందుకే మన పెద్దలు గోళ్లు కొరకవద్దు అని అంటారు.

కొన్ని పరిశోధన ప్రకారం గోళ్ళు కొరకడం అనేది ఆరోగ్యానికి మంచిదని తెలిసింది. ఎందుకంటే గోళ్ళు కొరకడం వల్ల మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందట. మన శరీరంలో ఉండే బ్యాక్టీరియాను సక్రమంగా పని చేయడానికి గోళ్ళు కొరికే అలవాటు మంచిదే అంటున్నారు పరిశోధకులు. కానీ అదేపనిగా గోళ్లు కొరకడం అనేది చెడు అలవాటు.


End of Article

You may also like