Ads
చెమట పట్టడం అనేది సర్వ సాధారణం. అయితే.. మాములుగా పట్టే చెమటల కంటే ఎక్కువగా మితిమీరి చెమటలు పడుతుంటే మాత్రం కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. చిన్నపిల్లలు, పెద్ద వాళ్ళ సంగతి పక్కన పెడితే.. ముఖ్యంగా టీనేజ్ లో ఉన్నవారికి ఎక్కువగా చెమటలు పట్టడం మనం గమనించవచ్చు.
Video Advertisement
చాలా మంది టీనేజర్లలో వారు వేసుకున్న దుస్తులు తడిచిపోయేలా చెమటలు పడుతూ ఉంటాయి. కొంతమంది చెమట పట్టడం ఆరోగ్యానికి మంచిదే అని భావించి అంతగా పట్టించుకోరు. కానీ, విపరీతంగా చెమటలు పడుతుంటే మాత్రం శరీరం మనకు ఏమైనా సంకేతాలను పంపిస్తోందేమో గమనించుకోవాలి.
ఏమీ కష్టపడకపోయినప్పటికీ అధికంగా చెమట పడుతోంది అంటే.. అది అనారోగ్య సూచకమని గుర్తించాలి. దీనిని హైపర్ హైడ్రోసిస్ అని పిలుస్తారు. ఈ పరిస్థితి కారణంగా మీరు ఎక్కువగా శరీరంలోని నీటిని కోల్పోతారు. HIV ఇన్ఫెక్షన్, ఎముకలకు సంబంధించి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, గుండె కవాటాలు వాచినపుడు ఇలా ఎక్కువ మొత్తంలో చెమట పడుతుంటుంది. కొన్నిసార్లు ఒత్తిడి కారణంగా అధికంగా చెమట పడుతుంటుంది. ఎక్కువ మొత్తంలో చెమట పడుతూ ఉంటె దానిని గుండె జబ్బులకు సంకేతంగా భావించాలి.
చెమట ఎక్కువగా పడుతున్న వారు ముందు తాము తీసుకునే ఆహారంపై శ్రద్ద వహించాలి. ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. మద్యానికి దూరంగా ఉండాలి. ఆహారంలో పుష్కలంగా విటమిన్లు ఉండేవిధంగా చూసుకోవాలి. గర్భవతిగా ఉన్నవారికి ఎక్కువగా చెమటలు పడుతుంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ఇక మామూలు వ్యక్తులకు చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటె.. వారు మంచి నీరు ఎక్కువగా తాగాలి.
శరీరం ఎక్కువ వేడికి గురి అవ్వకుండా ఉండడానికి కాటన్ దుస్తులను ధరించాలి. తరచుగా నిమ్మరసం తాగడం మంచిది. శరీరాన్ని చాలాబార్చుకోవాలి. అందుకోసం ఎక్కువ నీరు తాగాలి. పురుషులు కనీసం మూడున్నర లీటర్లు, స్త్రీలు కనీసం రెండున్నర లీటర్ల నీటిని తీసుకోవాలి.
End of Article