సాక్స్ లేకుండా షూస్ వేసుకుంటున్నారా.? అయితే జాగ్రత్త…ఈ జబ్బు వచ్చే ప్రమాదం ఉంది.?

సాక్స్ లేకుండా షూస్ వేసుకుంటున్నారా.? అయితే జాగ్రత్త…ఈ జబ్బు వచ్చే ప్రమాదం ఉంది.?

by Anudeep

Ads

మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. షూస్ వేసుకోవడం సర్వసాధారణమే అయినా.. కొందరు మాత్రం సాక్సులు వేసుకోకుండానే షూస్ ధరిస్తుంటారు. అయితే, ఇలా వేసుకోవడం వలన అనారోగ్యం వస్తుందట. పరుగులతో కూడిన మన జీవితాలలో ఆరోగ్యం పై శ్రద్ధ వహించేది చాలా తక్కువే. కానీ, ఈరోజు మనం ఆరోగ్యం గురించి పట్టించుకోకపోతే తరువాత బాధ పడాల్సి వస్తుంది.

Video Advertisement

shoe

చర్మవ్యాధి నిపుణుడు ఎమ్మా స్టీఫెన్‌సన్ సాక్సులు ధరించకుండా షూస్ వేసుకోవడం గురించి ఏమి చెప్పారంటే, 18 నుండి 25 సంవత్సరాల వయస్సు గల పురుషులలో చర్మ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ గా ఉందని తెలిపారు. సాధారణంగా రోజుకు 300 మిల్లీలీటర్ల చెమట పడుతుందట. చెమట మరియు వేడి కారణంగా విడుదలయ్యే తేమ ఫంగల్ ఇన్ ఫెక్షన్లకు కారణమవుతుంది. ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచం లో ఇది ట్రెండింగ్ లో ఉన్నా, చర్మాన్ని కాపాడుకోవాల్సినప్పుడు మాత్రం సాక్సులను ధరించడమే ఉత్తమం. ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటె వెంటనే చర్మ వ్యాధుల నిపుణుడిని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


End of Article

You may also like