హైదరాబాద్ లో ఎలాంటి లక్షణాలు లేకుండా వస్తోన్న మధుమేహం..? అసలు కారణం ఏంటంటే..?

హైదరాబాద్ లో ఎలాంటి లక్షణాలు లేకుండా వస్తోన్న మధుమేహం..? అసలు కారణం ఏంటంటే..?

by Anudeep

కరోనా మహమ్మారి కారణం గా ఎన్నోరకాల మానసిక ఇబ్బందులు కూడా తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇది కాక.. బయటకు వెళ్లే అవకాశం లేకపోవడం, అపరిమితమైన ఆహరం, సరైన వ్యాయామం లేని కారణంగా చాలా మందిలో లక్షణాలు లేని మధుమేహ వ్యాధి కనిపిస్తోందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలం లో హైదరాబాద్ లో ఎక్కువ గా ఇలాంటి కేసులు వెలుగు చూస్తున్నాయట.

Video Advertisement

diabetis 2

సాధారణం గా మధుమేహ వ్యాధిగ్రస్తులకు వచ్చే తరచుగా మూత్రవిసర్జన, అలసట, అధిక దాహం లేదా ఆకలి, బరువు తగ్గడం మరియు అస్పష్టమైన దృష్టి వంటి లక్షణాలేవీ వీరిలో కనిపించడం లేదట. ఇటీవల ఇటువంటి కేసులు పెరుగుతున్నాయని పోషకాహార నిపుణులు మరియు డయాబెటాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

diabetis 4

గత ఏడాదిన్నర కాలం గా.. ఆహరం తీసుకోవడం మార్పులు చోటు చేసుకోవడం, సరైన వ్యాయామం లేని కారణం గా ఈ ఇబ్బందులు తలెత్తాయని చెబుతున్నారు. ఆహరం లో తీసుకునే క్యాలరీల సంఖ్య తగ్గించకుండా.. కనీసం ఉన్న క్యాలరీలు కరగడానికి కూడా శ్రమపడాల్సిన అవసరం లేకపోవడం తో చాల మందిలో శరీరం లో చక్కర శాతం పెరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

diabetis 5

కొందరు క్రమం తప్పకుండా చెకప్ చేయించుకుంటున్న వారిలో ఇలా లక్షణాలు లేని మధుమేహం బయటపడిందని యశోద హాస్పిటల్స్ చీఫ్ డైటీషియన్ కె.సునీత ప్రేమలత అన్నారు. ఈ రోగుల్లో సంవత్సరం వ్యవధిలోనే ఆరు నుంచి ఎనిమిది కేజీల బరువు పెరిగిపోవడం కనిపిస్తోంది. మరోవైపు ఎక్కువ గా ఒత్తిడి కి గురి అయ్యేవారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.

diabetis

అయితే.. ఈ లక్షణాలు లేని మధుమేహం సోకిన వారిలో చాలా మందికి డిప్రెషన్, చికాకు, మగత, నిద్రలేమి మరియు లైంగిక హార్మోన్స్ పనిచేయకపోవడం వంటి లక్షణాలు ఉంటున్నాయి. కేవలం ఈ లక్షణాలు కనిపించినంత మాత్రాన అది లక్షణాలు లేని మధుమేహం (అసింప్టోమాటిక్ డయాబెటిస్) అని చెప్పలేము. కానీ.. వైద్యులను సంప్రదించి టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.


You may also like