న్యూజిలాండ్ మెన్స్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ మనందరికీ సుపరిచితుడే. బ్యాట్ పట్టుకుంటే బాదడమే కాదు ఓటమి ఎదురైనా నిగ్రహం గా ఎదుర్కోగల సమర్ధుడు మన కేన్ మామ. అతని నాయకత్వ పటిమ, టీం కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న టైం లో అతని నిలకడ ను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది.

విలియమ్సన్ 303 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 15,107 పరుగులు చేశాడు. రాస్ టేలర్ (17996) మరియు స్టీఫెన్ ఫ్లెమింగ్ (15289) తర్వాత అతను తన జట్టుకు అత్యధిక పరుగులు చేసిన మూడవవాడు గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ లో మొత్తం 37 సెంచరీలు, 84 అర్ధ సెంచరీలు కొట్టి రికార్డు సృష్టించుకున్నాడు. కేవలం ప్రతిభ మాత్రమే కాదు.. కేన్ ఎంత ఒత్తిడి లో అయినా ప్రశాంతత ను చూపించగలడు. 2019 ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి సమయం లో కూడా కేన్ మామ తన ముఖం పై చిరునవ్వును చెరగనివ్వలేదు.

అందుకే అతనికి ప్రపంచ వ్యాప్తం గా అభిమానులున్నారు. కేన్ విలియమ్సన్ కు ఇప్పుడు ముప్పై ఏళ్ళు. తన భార్య సారా రహీం తో కలిసి జీవిస్తున్నాడు. గతేడాది డిసెంబర్ లోనే సారా పండంటి ఆడబిడ్డను ప్రసవించారు. కేన్ విలియమ్సన్ లానే, సారా కూడా సోషల్ మీడియా లో లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తారు. చాలా నిలకడ గా ఉంటారు. ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ కూడా ప్రైవేట్ లో ఉంటుంది. ఆమెకి కేవలం 200 ల ఫాలోయర్స్ మాత్రమే ఉన్నారు.

అసలు వీరి లవ్ స్టోరీ నే చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. సారా ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్ లో జన్మించారు. ఆ తరువాత ఆమె న్యూజిలాండ్ కు షిఫ్ట్ అయ్యారు. ఆమె నర్స్ గా పని చేసేవారు. తాను పని చేస్తున్న ఆసుపత్రికి ఓ సారి కేన్ విలియమ్సన్ చికిత్స కోసం వచ్చారు. ఆ సమయం లోనే వారిద్దరూ తోలి చూపులోనే ప్రేమలో పడ్డారు. ఆ తరువాత ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకుని, డేటింగ్ కూడా చేసారు.





4) Divya Shree Sakshi tv
5) Divya Shree Wirally



10)Kristen Ravali
11) Pilli Deepika
13) Nayani Pavani
14) Uppal Balu



















#2
#3
#4
#5
#6
#7






టెక్కలి మండలం నౌపడ ఆర్ఎస్ గ్రామానికి చెందిన ముడాదాన ప్రమీల ఒక రోజు రైలులో కోచింగ్ నిమిత్తం విజయనగరం వెళుతోంది. అదే రైలులో ప్రయాణిస్తున్న కొంకి వెంకటేష్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతడిది వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడ గ్రామం. వెంకటేశ్ దిగాల్సిన స్టేషన్ రావడంతో ట్రెయిన్ దిగిపోయాడు. కానీ వెళ్తూ వెళ్తూ తన ఆర్ఆర్బీ కోచింగ్ సెంటర్‌కు సంబంధించిన ఐడీ కార్డును అక్కడే మర్చిపోయి వెళ్లిపోయాడు.
ఆ కార్డు ప్రమీల కంటపడడంతో, అతడికి అవసరమవుతుందని ఆలోచించి దానిపై ఉన్న ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసింది. అయితే,ఇక్కడే కథ ప్రారంభమయింది. తాను కావాలనే ఐడీ కార్డు వదిలివెళ్లానని,నిన్ను ప్రేమిస్తున్నానని ప్రమీలకి చెప్పాడు వెంకటేష్.ప్రస్తుతం నేను రాజమండ్రిలో ఉన్నందున ఐడీ కార్డు కోసం తర్వాత వస్తానని చెప్పాడు.
కొత్త కాపురం మొదలు పెట్టారు . పదిహేను రోజుల బాగానే కాపురం చేసిన వెంకటేశ్ , వాళ్లింటికి వెళ్లొస్తానని ఒకరోజు వెళ్లాడు .ఇంటి నుండి వచ్చిన నాటినుండి ప్రమీలను గర్భం తీయించేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఇందుకు ప్రమీల ఒప్పుకోలేదు . దాంతో ఇంటికి రావడం మానేసి , ప్రమీలకి పూర్తిగా ముఖం చాటేశాడు.
ప్రమీల ఎన్నిసార్లు కలవాలని ప్రయత్నించినా కలవకపోగా , కలిసినప్పుడు తక్కువ కులం దానివంటూ దూషించడం మొదలుపెట్టాడు. చేసేదేం లేక , బాధితురాలు తన తల్లితో కలిసి టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది. తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాలు అల్లకల్లోలం కావడం తప్ప ఫలితం ఉండదు . ఇద్దరూ చదువుకుంటున్నవాళ్లు , వీరిద్దరే తల్లిదండ్రులపై ఆధారాపడాల్సిన పరిస్థితి . ఇప్పుడు కడుపులో బిడ్డ భవిష్యత్ ఏంటి??