ప్రేమించి కడుపు చేసినప్పుడు ఆ విషయం గుర్తు రాలేదా..? పాపం ప్రమీల…!

ప్రేమించి కడుపు చేసినప్పుడు ఆ విషయం గుర్తు రాలేదా..? పాపం ప్రమీల…!

by Anudeep

ఒకే రైలులో ప్రయాణిస్తున్న వారిద్దరి చూపులు కలిసి పరిచయం పెరిగి గమ్యం చేరేలోపు ప్రేమలో పడ్డారు . వయసులో ఉన్నారు తొందర పడ్డారు . చేసిన తప్పుకు ఫలితంగా అమ్మాయి గర్బవతి అయింది . దానికి  పెళ్లే పరిష్కారం అనుకున్నారు . తీరా పెళ్లి చేసుకున్నాక గర్భం తీసేయించుకోమని ఒత్తిడి , ఎంతైన తల్లి ప్రేమ కడుపులో బిడ్డని చంపుకోవడానికి అంగీకరించలేదు . దాంతో కులాన్ని సాకుగా చూపి తల్లిబిడ్డల్ని ఒదిలేయాలని నిర్ణయించుకున్నాడు ఓ ప్రభుద్దుడు . దీంతో రైల్వేస్టేషన్లో ప్రారంభమైన కథ పోలీసు స్టేషన్ వరకు చేరుకుంది.
టెక్కలి మండలం నౌపడ ఆర్ఎస్ గ్రామానికి చెందిన ముడాదాన ప్రమీల ఒక రోజు రైలులో కోచింగ్ నిమిత్తం విజయనగరం వెళుతోంది. అదే రైలులో ప్రయాణిస్తున్న కొంకి వెంకటేష్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతడిది వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడ గ్రామం. వెంకటేశ్ దిగాల్సిన స్టేషన్ రావడంతో ట్రెయిన్ దిగిపోయాడు. కానీ వెళ్తూ వెళ్తూ తన ఆర్ఆర్‌బీ కోచింగ్ సెంటర్‌కు సంబంధించిన ఐడీ కార్డును అక్కడే మర్చిపోయి వెళ్లిపోయాడు.

Video Advertisement

ఆ కార్డు ప్రమీల కంటపడడంతో, అతడికి అవసరమవుతుందని ఆలోచించి దానిపై ఉన్న ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసింది. అయితే,ఇక్కడే కథ ప్రారంభమయింది.  తాను కావాలనే ఐడీ కార్డు వదిలివెళ్లానని,నిన్ను ప్రేమిస్తున్నానని ప్రమీలకి చెప్పాడు వెంకటేష్.ప్రస్తుతం నేను  రాజమండ్రిలో ఉన్నందున ఐడీ కార్డు కోసం తర్వాత వస్తానని చెప్పాడు.

ప్రమీల ఫోన్ నంబర్ తెలియడంతో రోజూ ఫోన్స్ చేశేవాడు. పరిచయం పెరిగింది. నెల రోజుల తర్వాత ప్రమీల కూడా రాజమండ్రి బీఈడీ కోచింగ్ సెంటర్‌కు వెళ్లింది. తరచూ కలుసుకోవడంతో వీరిద్దరిమధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ సాన్నిహిత్యం వారిని శారీరకంగా దగ్గర చేసింది. దీంతో ప్రమీల గర్భవతి అయ్యింది. విషయం వెంకటేశ్ కి చెప్పింది. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ రావడంతో ఇద్దరూ కంగారు పడ్డారు . పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం చర్చిలో పెళ్లి చేసుకున్నారు.

కొత్త కాపురం మొదలు పెట్టారు . పదిహేను రోజుల బాగానే కాపురం చేసిన వెంకటేశ్ , వాళ్లింటికి వెళ్లొస్తానని ఒకరోజు వెళ్లాడు .ఇంటి నుండి వచ్చిన  నాటినుండి ప్రమీలను గర్భం తీయించేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఇందుకు ప్రమీల ఒప్పుకోలేదు . దాంతో ఇంటికి రావడం మానేసి , ప్రమీలకి పూర్తిగా ముఖం చాటేశాడు.

ప్రమీల ఎన్నిసార్లు కలవాలని ప్రయత్నించినా కలవకపోగా , కలిసినప్పుడు  తక్కువ కులం దానివంటూ దూషించడం మొదలుపెట్టాడు. చేసేదేం లేక , బాధితురాలు తన తల్లితో కలిసి టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది. తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాలు అల్లకల్లోలం కావడం తప్ప ఫలితం ఉండదు . ఇద్దరూ చదువుకుంటున్నవాళ్లు , వీరిద్దరే తల్లిదండ్రులపై ఆధారాపడాల్సిన పరిస్థితి . ఇప్పుడు కడుపులో బిడ్డ  భవిష్యత్ ఏంటి??

 


You may also like