సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ పరాజయం పొందింది.32 తేడాతో ఓటమి మూటగట్టుకుంది. ఇటు బౌలింగ్ అటు బ్యాటింగ్ లో కూడా భారత టీమ్ మొత్తం విఫలం అయ్యింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
కెప్టెన్ రోహిత్ శర్మ పైన ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ నాయకత్వంలో మరింత బలపడిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

అయితే ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మరోసారి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను తీసుకోవాలని సూచించాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీ రికార్డు చాలా బాగుందని, కెప్టెన్ లో ఎన్నో చరిత్ర ఆత్మకు విజయాలు అందించిన కోహ్లీ మరోసారి జట్టు పగ్గాలు ఎందుకు చేపట్టకూడదని అన్నాడు. వ్యక్తి గత ప్రదర్శన కూడా అద్భుతంగా ఉన్న కోహ్లీ దీనిపైన పునరాలోచించాలని సూచించాడు. టెస్ట్ క్రికెట్లో కోహ్లీతో రోహిత్ ను పోల్చకూడదని అన్నాడు.

టెస్టుల్లో రోహిత్ కంటే కోహ్లీ మెరుగైన ఆటగాడని విదేశాల్లో రోహిత్ ఇప్పటివరకు తనని తాను నిరూపించుకోలేకపోయాడని, అటువంటి వ్యక్తికి ఏకంగా టెస్ట్ క్రికెట్ బాధితులు అప్పగించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ తన యూట్యూబ్ ఛానల్ లో వీడియో ద్వారా చెప్పుకొచ్చాడు. 2022లో దక్షిణ ఆఫ్రికా తో టెస్టు సిరీస్ ఓడిపోయిన అనంతరం కోహ్లీ టెస్ట్ కెప్టెన్సికి రాజీనామా చేశాడు. అనంతరం బీసీసీఐ రోహిత్ ను కెప్టెన్ గా ప్రకటించింది. రోహిత్ సారధ్యంలో పది టెస్టులు అడగ ఐదిట్లో నెగ్గి రెండు డ్రా చేసుకుంది. మూడు మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది





బబుల్ గమ్ మూవీతో యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో తెలుగు అమ్మాయి మానస చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో హీరో హీరోయిన్ కన్నా ఎక్కువ పాపులర్ అయ్యింది హీరో తండ్రి చికెన్ కొట్టు యాదగిరి. ఈ పాత్రలో నటించిన యాక్టర్ పేరు చైతు జొన్నలగడ్డ.
ఈ పేరు వినగానే గుర్తొచ్చేది డిజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ. ఆయన అన్నయే చైతు జొన్నలగడ్డ.హీరోకి తండ్రిగా చైతు జొన్నలగడ్డ ఆకట్టుకున్నాడు. హైదరాబాదీ యాసలో చికెన్ కొట్టు యాదగిరి అద రగొట్టాడు. ఈ మూవీలో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు యువతను అలరిస్తాయి. హీరోయిన్ ఇంటికొచ్చినపుడు ఈ హీరో, హీరో తండ్రి మధ్య జరిగే సంభాషణ ఆకట్టుకుంది.
ఈ మూవీలో తండ్రిగా నటించినా, చైతు జొన్నలగడ్డని స్క్రీన్ పై మొదటిసారి చూసినపుడు హీరో అన్నయ్యలా అనిపిస్తారు. చైతు జొన్నలగడ్డ ఎక్స్ప్రెషన్స్, స్లాంగ్, డైలాగ్ డెలివరీ ఇలా అన్ని హీరో సిద్దు జొన్నలగడ్డను గుర్తొచ్చేలా చేస్తాయి. ఈ మూవీ చైతు జొన్నలగడ్డ మొదటి చిత్రం, అయినప్పటికీ ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ లా నటించారు.





