ఓటిటి లోకి వచ్చేసిన హర్రర్ మూవీ… స్ట్రీమింగ్ ఎందులో అంటే…!

ఓటిటి లోకి వచ్చేసిన హర్రర్ మూవీ… స్ట్రీమింగ్ ఎందులో అంటే…!

by Mounika Singaluri

Ads

ప్రస్తుతం సినిమాలు సూపర్ హిట్ అయితే రెండు నెలల తర్వాత ఓటిటి లోకి వస్తున్నాయి. అదే సినిమా సరిగ్గా ఆడకపోయినా ఫ్లాపైన 15 రోజులు తిరగకుండానే ఓటిటి లో ప్రత్యక్షమైపోతున్నాయి.

Video Advertisement

ఇటీవల థియేటర్లో విడుదలైన ఒక హర్రర్ మూవీ ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకట్టుకుంది. ప్రోమోల తోటి ప్రమోషన్ తోటి మంచి హైప్ కూడా తెచ్చుకుంది. ఆ మూవీ పేరు పిండం.ది స్కేరియస్ట్ ఫిల్మ్ అనేది ఉప శీర్షిక. అంటే చాలా భయపెట్టే సినిమా అని. హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన ఈ సినిమాకు సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించారు. సలార్ ఫేమ్ ఈశ్వరి రావు, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషించారు.

థియేటర్లో విడుదలైన ఈ సినిమాకి మిక్స్ డ్ రివ్యూలు వచ్చాయి కొంతమందికి ఈ సినిమా నచ్చగా మరి కొంతమందికి సినిమా ఆశించిన స్థాయిలో లేదని కామెంట్లు చేశారు.ఇదిలా ఉంటే ఈ హారర్ మూవీ పిండం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమయింది. పిండం మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. పిండం మూవీనీ న్యూ ఇయర్ కానుకగా వచ్చే ఏడాది అంటే 2024 జనవరి మొదటి వారంలోనే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.

పిండం ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు దాదాపు కన్ఫర్మ్ అయ్యిందని,అందుకు తగిన డీల్, ఏర్పాట్లు జరిగాయని సమాచారం. అంటే, 2023లో బాగా భయపెట్టిన చిత్రంగా వచ్చిన పిండం మూవీ 2024లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే పిండం మూవీని ప్రస్తుతంతోపాటు 1990, 1930 లలో.. ఇలా మూడు కాలక్రమాలలో జరిగిన కథగా తెరకెక్కించారు


End of Article

You may also like