సీనియర్ డైరెక్టర్ వంశీ డైరెక్షన్ లో రవితేజ హీరోగా, కళ్యాణి హీరోయిన్ గా వచ్చిన చిత్రం ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చక్రి సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికీ కూడా అలరిస్తూ ఉంటాయి. ఈ చిత్రం ద్వారా నీకు కమెడియన్ కృష్ణ భగవాన్, కొండవలస పరిచయమయ్యారు.
అయితే ఈ చిత్రానికి ముందు వంశీ వరుస పెట్టి ఫ్లాపుల్లో ఉన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో ఈ సినిమా ఆఫర్ వచ్చింది. ఈ సినిమాకి ముందు వంశీ వేరే సినిమా అనుకోవడం ఆ సినిమా నిర్మాత అమెరికా వెళ్ళిపోవడంతో ఆయన డైలమాలో పడ్డారు.

మరోవైపు మహర్షి మూవీకి మేనేజర్ గా పనిచేసిన వల్లూరిపల్లి రమేష్ బాబు నిర్మాతగా మారాలి అనుకోవడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. రవితేజ హీరోగా తీసుకోవడం, కళ్యాణి హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కళ్యాణి ఆమె కట్టుకున్న చీరల పట్ల ఎంతో మక్కువ చూపించింది. పైగా అవన్నీ కాటన్ చీరలు. ఈ సినిమాల్లో కళ్యాణి లుక్ కి మంచి పేరు వచ్చింది. కళ్యాణి ఇష్టపడిందని చెప్పి మూవీ టీం చీరలన్నీ ఆమెకి చేశారు. ఆమె ఆ చీరలను పట్టుచీరల్లాగా భావించి ఎంతో ఇష్టపడి పట్టుకుని వెళ్లిపోయింది. అనుకున్నట్టుగానే ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా బ్లాక్ బస్టర్ అయింది. వంశీ మళ్లీ ఇండస్ట్రీలో కొనసాగారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది.









తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కీలక ఆఫీసర్ల మార్పులు జరుగుతున్నాయి. పలువురు ఆఫీసర్లను ఇప్పటికే బదిలీ చేస్తూ, ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఈ క్రమంలో సీఎంపేషీలో కొత్త ఆఫీసర్లు వచ్చేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డికి ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి వస్తున్నట్లు తెలుస్తోంది.
ఆమ్రపాలి కాట 1982లో ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నంలో వెంకట్ రెడ్డి కాటా, పద్మావతి దంపతులకు నవంబరు 4న జన్మించారు. ఆమెకు ఒక తోబుట్టువు ఉన్నారు. విశాఖపట్నంలో సాయి సత్య మందిర్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె జేఈఈ లో ఉత్తీర్ణత సాధించి, చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి ఎంబీఏ పూర్తి చేసింది. ఆమ్రపాలి 2010 లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో 39 వ ర్యాంక్ సాధించి, ఐఏఎస్ అధికారిణి అయింది. ఐఏఎస్ కు ఎంపికయిన అతి తక్కువ వయస్కులలో ఒకరిగా ఆమ్రపాలి నిలిచారు.
2013లో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా నియమితులైన ఆమె, 2014లో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. మరుసటి ఏడాది తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా పనిచేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2016లో ఆమ్రపాలి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన తొలి మహిళ ఐఏఎస్ ఆఫీసర్. “యంగ్ డైనమిక్ ఆఫీసర్” గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో పీఎం కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న ఆమ్రపాలి తెలంగాణలో సీఎంఓలోకి రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
2009, 2010 సంవత్సరాల సమయంలో చిన్నారి శాంభవి ఐదేళ్ల వయసులో బాల సన్యాసినిగా ఫేమస్ అయ్యింది. నంద్యాలలో కొంతకాలం నివసించిన శాంభవి, బ్రహ్మం గారి గురించి, భవిష్యత్తు గురించి మాట్లాడేది. శాంభవి మీడియా ముందు చెప్పే మాటలు జనాలను ఎంతగానో ఆకర్షించాయి. ఆమె మాట్లాడుతూ, “తాను, దలైలామా పూర్వ జన్మలో బౌద్ధులమని, మంచి స్నేహితులమంటూ చెప్పి సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి ఆమెకు పూజలు చేశారు. అంతేకాక టిబెటన్ ప్రజల స్వాతంత్ర్యం కోసం పోరాడడమే లక్ష్యమని శాంభవి పేర్కొంది.
ఆ తర్వాత పలు కారణాల వల్ల చిన్నారి శాంభవి నంద్యాల నుండి హిమాలయాలకు వెళ్లిపోయారు. 13 ఏళ్ళ తరువాత యోగిని శాంభవి మళ్లీ నంద్యాలలోని కనిపించారు. కార్తీక మాసం సందర్బంగా సూర్యనంది, నంద్యాల బస్టాండ్ వద్ద ఉన్న శివాలయంలో శాంభవి ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో యోగిని శాంభవి మీడియాతో మాట్లాడుతూ “బ్రహ్మంగారు వీరభోగ వసంతరాయలుగా జన్మిస్తారని, బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలన్ని జరిగాయని, ఇంకా జరుగుతున్నాయని పేర్కొన్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని హిందీ, ఇంగ్లీషులో ట్రాన్స్‌లేట్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటూ, సంస్కృతం వేదాలు నేర్చుకున్నట్లుగా తెలిపారు.
బ్రహ్మంగారి అనుగ్రహం వల్లే గతంలో సూర్యనందికి వచ్చామని, ఆయన అనుగ్రహంతో సూర్యనంది నుండి హిమాలయాలకు వెళ్లామని అన్నారు. ఇక్కడ బ్రహ్మంగారికి ఆశ్రమం, గుడి కట్టాలనే సంకల్పం ఉందని అన్నారు. ఇక్కడి నుండే ధర్మ సంస్థాపన ప్రారంభిస్తానని వరం ఇచ్చారని, బ్రహ్మంగారికి నిలయంగా ఒక గుడి ఉండాలనే సంకల్పం ఉందని, త్వరలోనే దానిని మొదలుపెట్టబోతున్నామని, ఆ కారణంగానే సూర్యనందికి వచ్చానని తెలిపారు. మళ్లీ శాంభవి నంద్యాలకు రావడం, బ్రహ్మంగారి గురించి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.