బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ అనిమల్ మూవీ ఇప్పుడు రికార్డులు తిరగరాస్తుంది. ఫస్ట్ వీక్ పూర్తి అయ్యేసరికి 500 కోట్ల కలెక్షన్స్ సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ ఒక డిఫరెంట్ ఫిలింగా గుర్తింపు పొందింది. తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ నీ ప్రేమని ప్రధానాంశంగా ఈ సినిమాలో చూపించారు.

అయితే మితిమీరిన వైలెన్స్ కారణంగా ఈ సినిమాకి A సర్టిఫికెట్ వచ్చింది. అయినా కూడా ఆడియన్స్ యానిమల్ సినిమాకి పట్టం కడుతున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది .రష్మికకు కూడా మంచి పాత్ర దక్కింది. స్పెషల్ రోల్ లో నటించిన త్రిప్తీ అయితే మూవీకే స్పెషల్ ఎట్రాక్షన్ అయిపోయింది.

ఇక యానిమల్ సినిమాలో రణబీర్ నటనకు ఫిదా అయిపోతున్నారు ఆడియన్స్. అయితే యానిమల్ సినిమాలు ఒక స్పెషల్ సీన్ లో ఇంట్లో యాగం చేసే సన్నివేశం ఉంటుంది. రణబీర్ కపూర్ కి ఆయుష్ హోమం చేయిస్తారు. ఈ ఒక్క సీను కోసం యానిమల్ సినిమా టీం చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఈ సీన్ లో చాలామంది వేద పండితులు పూజలు చేసి వేదమంత్రాలు వల్లిస్తున్నట్లు కనబడుతుంది. అయితే ఇందుకోసం వైజాగ్ నుండి పండితుల బృందాన్ని సినిమా షూటింగ్ కి తీసుకు వెళ్లారట.

నిజమైన పండితులైతేనే ఆ సీన్ కి ఫీల్ ఉంటుందని యానిమల్ టీం భావించి వారిని నటింపజేసింది. ఈ సీన్ చూస్తున్నంత సేపు చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. అలాగే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఈ పండితుల బృందం సినిమా టీం అందరినీ వేద మంత్రాలతో ఆశీర్వదించింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఒక్క సీన్ కోసం ఎంత కేర్ తీసుకున్నారా అంటూ ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. సందీప్ రెడ్డి ప్రతి సీని తనకి నచ్చిన విధంగా తర్కెక్కిస్తారు. సీన్ వచ్చేంతవరకు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కారు. అందుకే ఈరోజు యానిమల్ ఈ రేంజ్ హిట్ అయింది.































ఇతర రంగులతో పోల్చినపుడు పసుపు రంగు ఎక్కువగా ఆకర్షణీయంగా ఉంటుంది. రిఫ్లెక్షన్ ఎక్కువగా వచ్చే పసుపు రంగు ఇతరుల దృష్టిని కూడా వెంటనే ఆకర్షిస్తుంది. ఆ కారణం వల్లనే రైల్వేస్టేషన్లో ఉండే బోర్డులకి పసుపు రంగును ఉపయోగిస్తారు. పసుపు రంగు నేమ్ బోర్డులను దూరం నుండి కూడా ప్రయాణికులు సులభంగా రాబోయే స్టేషన్ పేరును గుర్తించగలరు. పసుపు రంగు బోర్డు పైన నలుపు రంగులో స్టేషన్ పేరుని రాస్తారు. ప్రయాణించే సమయంలో ఇతర రంగులు, వస్తువుల కంటే పసుపు రంగువాటి పైనే దృష్టి వెంటనే పడుతుంది. ఆ కారణంతోనే పసుపు రంగు బోర్డు, నలుపు రంగు అక్షరాలను రైల్వే శాఖ ఉపయోగిస్తుంది.
మరో విషయం ఏమిటి అంటే పసుపు సైన్ బోర్డు పై నలుపు రంగు అక్షరాలు మాత్రమే ఉండటానికి కారణం ఇతర రంగులు పసుపు రంగు పై హైలైట్ కావు. అందుకే నలుపు రంగుతో ఊరి పేర్లు రాస్తారు. ఇలా రాయడం వల్ల దూరం నుండి కూడా ఆ బోర్డు పై ఉన్నదానిని చదవవచ్చు. ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరగడంతో తరువాత ఏ స్టేషన్ రాబోతోంది అనేది రైలులో స్టేషన్ రాకముందే తెలుసుకోవచ్చు. లోకోపైలట్లకు జీపీఎస్ ద్వారా తరువాతి స్టేషన్ ఎంత దూరం ఉందనేది తెలుస్తుంది. అయితే గతంలో దూరం నుండే కనిపించే పసుపు బోర్డును చూడగానే లోకోపైలట్ రైలు వేగాన్ని తగ్గించేవారని అంటున్నారు.
Also Read: