సాధారణంగా తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిలో వారి పిల్లలు హక్కును కలిగి ఉంటారు. కుటుంబ యజమాని తన కుటుంబంలోని పిల్లలందరికి ఆస్తిని సమానంగా పంచుతూ వీలునామ కూడా రాస్తారు. వీలునామా రాయడానికి కారణం తమ తదనంతరం వారి పిల్లల మధ్య ఎలాంటి ఆస్తితగాదాలు ఉండకూడదని ఇలా చేస్తారు. ఈ విషయంపై ఇప్పటికి కూడా ఎన్నో రకమైన చర్చలు జరుగుతూనే ఉంటాయి.
ఆస్తికి యజమాని తల్లి అయితే, ఆమె పేరు మీద ఉన్న ఆస్తి ఎవరికి చెందుతుంది. చట్టం దాని గురించి ఏం చెబుతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
తల్లి ఆస్తికి పూర్తిగా యజమాని అయితే, ఆమె ఎలాంటి వీలునామా రాయకుండా మరణించినపుడు ఆ ఆస్తి ఆమె కొడుకు మరియు కుమార్తెలకు సమానంగా చెందుతుంది. కుమారులు మరియు కూతుర్లకు సమాన హక్కులు ఉన్నాయి. ఫ్యామిలీలోని వివాహిత లేదా అవివాహిత కుమార్తెకు తల్లి ఆస్తి లేదా పూర్వీకుల ఆస్తి మీద సమాన హక్కు ఉంటుంది.
హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 6, 2005లో సవరణ చేసిన ప్రకారం, తల్లి ఆస్తి పై కుటుంబంలోని కూతుర్లకు సమాన హక్కులను కల్పించింది. కుమార్తెలు హిందూ అవిభాజ్య కుటుంబం(HUF )లో కుమారుడితో పాటుగా సమానమైన హక్కులు మరియు బాధ్యతలు కలిగి ఉంటుంది. 2005 అనంతరం పూర్వీకుల యొక్క ఫ్యామిలీ ఆస్తిని విభజించాలని అడిగే హక్కు, కుమారుడితో సమానంగా ఆస్తిలో తమ వాటాను పొందడానికి డిమాండ్ చేసే హక్కు కూతుర్లకు ఉంది.
అయితే తల్లి తన ఆస్తి గురించి వీలునామా రాసినపుడు, ఆ వీలునామాలో తన కుమార్తెను చేర్చకపోతే, ఆ ఆస్తిపై కుమార్తెకు హక్కు ఉండదు. తల్లికి ఆస్తి ఎవరైనా ఇచ్చినా, ఆమె ఆస్తి కొన్నా, ఆస్తి ఎలా సంపాదించినా ఆమె వీలునామా రాసినట్లయితే అది వారికే చెందుతుంది. దీని గురించి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి..
watch video :
Also Read: నాడు బ్రిటిషర్లకే డబ్బులు అప్పు ఇచ్చిన భారతీయుడి కుటుంబం..! ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది..?




















రజనీకాంత్ 1950లో డిసెంబరు 12న మైసూరురాష్ట్రంలోని బెంగళూరులో మరాఠీ ఫ్యామిలిలో జన్మించాడు. రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఆయన తల్లి గృహిణి, తండ్రి పేరు రామోజీరావు గైక్వాడ్. పోలీస్ కానిస్టేబుల్ గా పని చేసేవారు. వీరి ఫ్యామిలీ మహారాష్ట్ర నుంచి బెంగళూరుకు వచ్చి, స్థిరపడ్డారు. నలుగురు పిల్లల్లో రజినీకాంత్ చిన్నవాడు. రజినీకాంత్ 9 ఏళ్లు ఉన్నప్పుడు తల్లిని కోల్పోయాడు.
రజినీకాంత్ గవర్నమెంట్ కన్నడ ప్రైమరీ స్కూల్ లో చదువుకున్నాడు. ఆ తరువాత రజినీకాంత్ ను రామకృష్ణ మఠంలో చేర్చారు. అక్కడ ఆధ్యాత్మిక పాఠాలతో పాటుగా నాటకాలలో పాల్గొనేవాడు. మఠంలో ఒకసారి జరిగిన పౌరాణిక నాటకంలో రజినీకాంత్ ఏకలవ్యుడి స్నేహితుడి పాత్రలో నటించారు. రజిని నటనకు ప్రముఖ కన్నడ కవి డిఆర్.బెంద్రే ప్రశంసించారు. అప్పటి నుండి ఆయనకు నటన పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చింది. చదువు పూర్తి అయిన తరువాత రజనీకాంత్ కూలీపనితో సహా ఎన్నో పనులు చేశాడు.
ఆ తర్వాత బెంగుళూరు ట్రాన్స్పోర్ట్ లో బస్ కండక్టర్గా జాబ్ వచ్చింది. ఆ ఉద్యోగం చేస్తున్న కొత్తగా ఏర్పాటు చేసిన మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రకటన కనిపించింది. దానిలో చేరి నటనలో శిక్షణ తీసుకోవాలనుకున్నాడు. అతని ఫ్రెండ్, సహోద్యోగీ రాజ్ బహదూర్ ఇన్స్టిట్యూట్ లో చేరేలా ప్రోత్సహించడమే కాకుండా, ఆర్థికంగా కూడా సహాయం చేశాడు. అక్కడే తమిళ దర్శకుడు కె.బాలచందర్ రజినికాంత్ ను గుర్తించాడు. అయితే కోలీవుడ్ లో శివాజీ గణేశన్ స్టార్ హీరోగా ఉన్నారు. ఇద్దరి పేర్లు ఒకేలా ఉండడంతో బాలచందర్ శివాజీ పేరును రజినీకాంత్ గా మార్చారు.
అలాగే తమిళంలో మాట్లాడటం కూడా నేర్చుకోమని సలహా ఇచ్చాడు. రజనీకాంత్ ఆ సలహాను పాటించి తమిళం నేర్చుకున్నారు. 1975 లో బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అపూర్వ రాగంగళ్;సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసిన రజినికాంత్, 1977 లో తెలుగులో తొలిసారిగా ‘చిలకమ్మ చెప్పింది’ అనే సినిమాలో హీరోగా నటించారు. ఆ తరువాత పలు తెలుగు సినిమాలలో నటించిన రజినికాంత్ సౌత్ సూపర్ స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
ఇప్పుడు ఈ షాట్ గమనించండి. ఇది పైన మెన్షన్ చేసిన దానికి కంటిన్యూషన్ షాట్. కానీ రెండిట్లో తేడా ఏంటో ఈ పాటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది. ఒక షాట్ లో బ్లాక్ కలర్ లో ఉన్న కార్స్, నెక్స్ట్ షాట్ లో వైట్ కలర్ లో ఉంటాయి.
మనం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఈ ఒక్క సినిమా ఏంటి? ఎన్నో సినిమాల్లో ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు కనిపిస్తాయి. ఇలా సినిమాల్లో పొరపాట్లు జరగడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే ఒక దానికి సంబంధించిన సన్నివేశాలను ఒకటే రోజు చిత్రీకరించరు.
వాళ్ల సమయాన్ని బట్టి, షెడ్యూల్ ని బట్టి సీన్స్ షూట్ చేస్తారు. కాబట్టి ఒకవేళ ఒక సీన్ ఎక్కువ రోజులు షూట్ చేస్తే, యాక్టర్స్ ఒకటే గెటప్ లో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే అప్పుడు బహుశా ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి.