ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల పాటలలో వారి పక్కన స్టెప్స్ వేసే సైడ్ డాన్సర్లకు కూడా ఎక్కువగా గుర్తింపు లభిస్తోంది. అలా వారికి మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి. కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారుతున్నారు. ఇదంతా సోషల్ మీడియా ద్వారానే అని చెప్పవచ్చు.
ఆ మధ్యన వచ్చిన వారసుడు సినిమాలోని రంజితమే సాంగ్ లో విజయ్, రష్మికలతో పాటు సైడ్ డాన్సర్ హైలైట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సాంగ్స్ లో ఎక్కువగా కనిపించే డాన్సర్ విఘ్నేష్ రాజేంద్రన్ గురించి ఇప్పుడు చూద్దాం..
డాన్సర్ విఘ్నేష్ రాజేంద్రన్ అంటే చాలా మందికి తెలియక పోవచ్చు. కానీ చూస్తే గుర్తుపడతారు. అతను తెలుగులో అనేక పాటలలో సైడ్ డాన్సర్ గా చేశాడు. అలా విఘ్నేష్ టాలీవుడ్ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాని , విజయ్ దేవరకొండ వంటి వారితో పని చేశాడు.
అయితే అతను తమిళ ఇండస్ట్రీకి చెందిన డాన్సర్. ఎక్కువగా కోలీవుడ్ సినిమాలకి డాన్సర్ గా చేస్తాడు. విఘ్నేష్ రాజేంద్రన్ కోలీవుడ్ కొరియోగ్రాఫర్ దినేష్ టీమ్ మెంబర్. దినేష్ మాస్టర్ దళపతి విజయ్, అజిత్, శివ కార్తికేయన్ లాంటి స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రఫర్ గా పనిచేశాడు. ఈ క్రమంలో ఆయన టీమ్ మెంబర్ గా ఉన్న విఘ్నేష్ ఆ హీరోల సాంగ్స్ లో గ్రూప్ డాన్సర్ గా పనిచేశాడు.
విఘ్నేష్ కొరియోగ్రాఫర్ నేర్పించే డ్యాన్స్ స్టెప్పులను తేలికగా నేర్చుకుంటాడు. అంతే కాకుండా సోషల్ మీడియాలో విఘ్నేష్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అతని ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపు 50 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంతే కాకుండా అతనికో ఫ్యాన్ పేజ్ కూడా ఉంది. ఆ పేజ్ కి 1536 ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం అతను డాన్సర్ గా కొనసాగుతూనే, యాక్టర్ గా కూడా మారినట్టు తెలుస్తోంది.
Also Read: “క్షణం కూడా నిన్ను మర్చిపోలేను..!” అంటూ… “తారకరత్న” భార్య అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్..!


ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో రాహుల్ గాంధీ ఒకరు. ఆయన వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు. ఇంత వయసు వచ్చినా రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోకపోవడంతో ఆయన పెళ్లి చాలా సార్లు చర్చలు జరిగాయి. ఎందుకు చేసుకోలేదు అంటూ అడుగుతూనే ఉన్నారు. దేశంలోని పలువురు ప్రముఖులు, హీరోయిన్లు సైతం రాహుల్ గాంధీని వివాహం చేసుకుంటాం అని ముందుకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇంతగా చర్చకు దారితీసిన పెళ్లి గురించి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా సమాధానం చెప్పారు. 2022లో సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో  పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 137 రోజుల సుదీర్ఘ పాదయాత్రను శ్రీనగర్‌లోని చారిత్రాత్మక లాల్ చౌక్‌లో ముగించారు. ఈ యాత్ర 12 రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు ఐదు నెలల్లో 4,080 కిలోమీటర్లు సాగింది.
ఆ సమయంలో రాహుల్ గాంధీ పూర్తిగా ప్రజల్లో ఉంటూ సామాన్యులను కలిసి మంచి చెడ్డలు తెలుసుకున్నారు. ఆ క్రమంలో కాలేజ్ స్టూడెంట్స్‌తో కూడా ముచ్చటించారు. అయితే వారిలో ఒక స్టూడెంట్ పెళ్లి గురించి రాహుల్ గాంధీని అడిగారు. ఆ ప్రశ్నకు ‘తన పనులు మరియు పార్టీ పనుల్లో పూర్తిగా నిమగ్నం అయినందువల్ల  వివాహం గురించి ఆలోచించలేదని రాహుల్ గాంధీ వెల్లడించారు.













