ఈ వారం బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ రజిని కాంత్, మెగాస్టార్ చిరంజీవి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఒక్క రోజు తేడాతో ఆగస్ట్ 10న జైలర్, ఆగస్ట్ 11న భోళా శంకర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.
ఇదిలా ఉండగా ప్రతివారం లాగే ఈ వారం కూడా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లలో ప్రేక్షకులని అలరించడానికి కొత్త చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఏ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎందులో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం..
#1 జీ 5
- అభర్ ప్రళయ్ఈ బెంగాలీ వెబ్ సిరీస్ ఆగస్ట్ 11 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
- ది కశ్మీరీ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ఈ తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ ఆగస్ట్ 11 స్ట్రీమింగ్ అవుతోంది.

#2 అమెజాన్ ప్రైమ్ వీడియో
- రెడ్, వైట్ అండ్ రాయల్ బ్లూఈ ఇంగ్లీష్ సినిమా ఆగస్టు 11 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
- మహావీరుడుకో లీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన మహావీరుడు తెలుగు డబ్బింగ్ మూవీ ఆగస్టు 10 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

- మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2ఈ హిందీ వెబ్ సిరీస్ ఆగస్టు 10 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
- సత్యప్రేమ్ కీ కథఈ హిందీ మూవీ ఆగస్టు 10 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
- ఆదిపురుష్ మూవీ ఆగస్టు 10 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
#3 డిస్నీ+హాట్‌స్టార్
- నెయిమార్ఈ తెలుగు డబ్బింగ్ మూవీ ఆగస్టు 10 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

- కమాండోఈ హిందీ వెబ్ సిరీస్ ఆగస్టు 11 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
#4 నెట్‌ఫ్లిక్స్
- హార్ట్ ఆఫ్ స్టోన్ఈ మూవీ తెలుగు/ఇంగ్లీష్ మూవీ ఆగస్టు 11 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
- పద్మినిఈ మలయాళ మూవీ ఆగస్టు 11 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

- పెండింగ్ ట్రైన్ఈ జపనీస్ వెబ్ సిరీస్ ఆగస్టు 11 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
- బిహైండ్ యువర్ టచ్ఈ కొరియన్ సిరీస్ -ఆగస్టు 12 నుండి స్ట్రీమింగ్ కానుంది.
- మెక్ క్యాడెట్స్ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఆగస్టు 10 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
- పెయిన్ కిల్లర్ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఆగస్టు 10 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
- జగున్ జగున్ఈ ఇంగ్లీష్ మూవీ ఆగస్టు 10 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
- మ్యారీ మై డెడ్ బాడీఈ ఇంగ్లీష్ మూవీ ఆగస్టు 10 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
- ఆదిపురుష్ మూవీ ఆగస్టు 10 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
#5 సోనీ లివ్
- పోర్ తోడిల్ఈ మలయాళ తెలుగు డబ్బింగ్ మూవీ ఆగస్టు 11 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

- ది ఫేబుల్మన్స్ఈ ఇంగ్లీష్ మూవీ ఆగస్టు 11 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
- బ్రోకర్ఈ కొరియన్ మూవీ ఆగస్టు 11 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
- పారాసైట్ఈ ఇంగ్లీష్ మూవీ ఆగస్టు 11 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
#6 ఆహా
- వాన్ మూండ్రుఈ తమిళ మూవీ ఆగస్టు 11 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
- హిడింబఅశ్విన్ బాబు, నందిత శ్వేత జంటగా తెరకెక్కిన ఇన్వెస్టిగేషన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ హిడింబ మూవీ
ఆగస్టు 10 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

- వేరే మారి ఆఫీస్ఈ తమిళ వెబ్ సిరీస్ ఆగస్టు 10 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read: “ఏదో పాతకాలం సినిమా చూస్తున్నట్టు ఉంది..!” అంటూ… చిరంజీవి “భోళా శంకర్” రిలీజ్‌పై 15 మీమ్స్..!

భోళా శంకర్ మూవీ సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్. 2015లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన వేదాళం అనే సూపర్ హిట్ చిత్రానికి భోళా శంకర్ రీమేక్ గా తెరకెక్కింది. ఒరిజినల్ మూవీకి కి డైరెక్టర్ శివ దర్శకత్వం వహించారు. తెలుగులో మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు. దాదాపు 10 సంవత్సరాల తరువాత దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు.
గతంలో మెహర్ రమేష్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్ లాంటి అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను తీసినప్పటికీ, అవి హిట్ అందుకోలేకపోయాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తో మంచి కమ్ బ్యాక్ కావాలని భావిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే షోలు పడడంతో మూవీ చూసిన ఆడియెన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
భోళా శంకర్ సినిమాను చూసినవారు కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు ఈ మూవీ లోని సీన్స్ కు సంబంధించిన ఫోటోలతో కూడిన మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్ సామాజిక మధ్యమాలలో ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన జైలర్ మూవీకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో రజనీకాంత్ భార్య పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటించింది. ఈ మూవీలో కీలకమైన రజిని కాంత్ కొడుకు అర్జున్ పాత్రలో తమిళ హీరో వసంత్ రవి నటించారు. ఈ చిత్రం వసంత్ నటించిన నాలుగవ చిత్రం. ఇటీవల రిలీజ్ అయిన తమిళ డబ్బింగ్ మూవీ అశ్విన్స్ లో హీరోగా వసంత్ రవి నటించారు.
వసంత్ రవి అసలు పేరు వసంత్ కుమార్ రవి. ఇతను హీరో మాత్రమే కాదు డాక్టర్ కూడా. చెన్నై లో ఫేమస్ రెస్టారెంట్ అయిన ‘నమ్మ వీడు వసంత భవన్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్’ చైర్మన్ రవి ముత్తుకృష్ణన్ కుమారుడు వసంత్ రవి. 2017లో మొదటిసారి అతను ‘తారామణి’ అనే చిత్రంలో నటించాడు.
ఆ మూవీ హిట్ అయ్యింది. ఆ మూవీలోని నటనకు గాను వసంత్ ఉత్తమ నటుడుగా విజయ్ అవార్డ్ మరియు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ను అందుకున్నాడు. అతను నటించిన రెండవ సినిమా ‘రాకీ’ ఈ మూవీకి ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి. ఆ తరువాత హర్రర్ మూవీ ‘అశ్విన్స్’ లో హీరోగా నటించిన వసంత్ ‘జైలర్’ మూవీలో అర్జున్ అనే ఏసీపీ పాత్రలో మెప్పించారు.
మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ మూవీలో మహేష్ నటన, డైలాగ్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించగా, సాంగ్స్ అన్ని హిట్ అయ్యాయి. ముఖ్యంగా ‘కళావతి’ పాట అయితే ఒక ఊపు ఊపిందని చెప్పవచ్చు.
ఈ పాటకు చాలా మంది సెలెబ్రిటీలు కూడా రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ మూవీలో మహేష్ బాబు బ్యాంక్ గురించి చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. అయితే ఈ డైలాగ్ ను గతంలో వచ్చిన ఒక మూవీలో వేరే హీరో చెప్పడం విశేషం. ఆ హీరో చెప్పిన డైలాగ్ కు సంబంధించిన వీడియోను ట్రోల్ ప్లాజా అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు.
ఆ డైలాగ్ చెప్పిన హీరో శ్రీకాంత్, నిన్నే ప్రేమిస్తా మూవీలో బ్యాంక్ మేనేజర్ పాత్రలో శ్రీకాంత్ నటించారు. అక్కడి ప్రజలకి “డబ్బు అంటే లక్ష్మీ, ఆ లక్ష్మీ కొలువై ఉండేది బ్యాంక్ లో కదా! ఆ బ్యాంక్ గుడి లాంటిది. అంటే ఎంత పవిత్రంగా చూసుకోవాలి” అని చెప్తారు. ఈ వీడియో చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
“అండమాన్ జైలు’ చిరంజీవి గారి ‘వేట’ సినిమాలో చూపించినంత భయంకరంగా ఉంటుందా?” అని కోరాలో అడిగిన ప్రశ్నకు
అప్పట్లో అక్కడికి వెళ్ళడానికి సముద్ర మార్గం ఒక్కటే. అక్కడ జైలు నిర్మాణం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. మొత్తం జైలులో ఉన్న ఖైదీలు ఒకరికి ఒకరు కనపడని విధంగా ఉంటుంది. ఇకపోతే అక్కడ శిక్షలు చాలా చాలా భయానకంగా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని గోనె సంచితో తయారు చేసిన చొక్కా ప్యాంట్ ను వేసి ఎండలో నిలబెట్టి శిక్షించడం. సరైన పనిముట్లు ఇవ్వకుండా చేతులతో ఎండిన కొబ్బరికాయల పీచు ఒలువడం, కొబ్బరి పీచుతో తాడు తయారుచేయటం.
మిగిలిన కొబ్బరి నుంచి గానుగ ద్వారా ఒక ఎద్దు లేదా ఆవు ఒక రోజులో తియ్యగలిగే నూనె కంటే 3 రెట్లు తీపించటం, ఎదిరిస్తే కొట్టడం, మరీ తిరగబడితే గోనె సంచి చొక్కా వేసి ఇనుప కడ్డీలతో కట్టేసి ఎండలో నిలబెట్టడం. పారిపోవాలని ప్రయత్నించి పట్టుబడిన వారిని ముగ్గుర్ని కలిపి ఒకేసారి ఉరి తీయడానికి అవసరమైన ఉరి కంబం. జైలు నిర్మాణానికి ముందు తయారుచేసిన నమూనా. ఖైదీలు తప్పించుకునే అవకాశం లేకుండా తలుపులను ఇనుముతో గట్టిగా తయారు చేశారు. ఖైదీలను ఇనుప తాళ్లతో కట్టివేసే వాళ్లు ఇక్కడ.
ఈ జైల్లో ఉన్న కిటీకీల గురించి వివరంగా చెప్పాలి. ఖైదీలను ఉంచే ప్రతి గదికి ఒక చిన్న కిటికీ ఉంటుంది. అయితే అవి అందరికీ తెలిసిన కిటికీల లాంటివి కాదు. చాలా ప్రత్యేకంగా కట్టినవి. ఎలా అంటే, గది లోపలున్న ఖైదీలు కిటికీ నుంచి బయటకు చూస్తే వాళ్లకు కేవలం కిటికీకి ఎదురుగా ఉన్న కొద్ది ప్రదేశం మాత్రమే కనిపిస్తుంది. బయట ఏం జరుగుతుందో తెలియదు. కానీ, బయటి నుంచి కిటికీ గుండా లోపలికి చూస్తేమాత్రం, గదిలోని ప్రతి భాగం పూర్తిగా కనిపిస్తుంది. ఖైదీలు లోపల ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అన్నీ చూడొచు.
ఇప్పటికీ ఈ కిటికీల నిర్మాణం అంతు చిక్కని రహస్యమే. ఆ కిటికీ నా వెనక మీరు గమనించవచ్చు. జైలుకి వేయబడే తాళం, ఇది ఎంత పెద్దది అంటే కనీసం 10*10 అంగుళాల సైజులో ఉంది. శిక్ష అనుభవించిన ఖైదీలు రాసుకున్న కొన్ని విషయాలు. అక్కడి బాధలు, జైలు జీవితం గురించి చివరిగా అన్ని పోరాటాల తర్వాత, 1943 డిసెంబర్ 30న పోర్ట్ బ్లెయిర్ లోని జింఖానా గ్రౌండ్ లో నేతాజీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొందిన తొలి భారత భూభాగం అండామాన్ దీవులే అని ఆ రోజు నేతాజీ ప్రకటించారు” అని చెప్పుకొచ్చారు .
గత కొంతకాలం నుండి ‘గుంటూరు కారం’ సినిమా గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. హీరోయిన్ పూజా హెగ్డే ఈ మూవీ నుండి తప్పుకుందని, ఆమె స్థానంలో శ్రీలీలను, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షీ చౌదరిని తీసుకున్నట్టు టాక్. ఆ తరువాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తొలగించారని, ఆ తరువాత సినిమాటోగ్రాఫర్ తప్పుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై చిత్ర యూనిట్ స్పందిస్తే తప్ప ఈ వార్తలు నిజమో, కాదో తెలియదు.
మరో వైపు త్రివిక్రమ్ పై విమర్శలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం మూవీని పక్కన పెట్టి, పవన్ కళ్యాణ్ సినిమాల కోసం పని చేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ బ్రో మూవీకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ ఇలా చేయడం వెనుక ఉన్న అసలు నిజం ఇదే అంటూ ఒక ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు.
ఆ పోస్ట్ లో “మహేష్ ఫ్యామిలీ ఫ్రెండ్ నా క్లాస్ మేట్. తను చెపుతుంది, పవన్ మీద ఉన్న అభిమానంతో, పవన్ కి పరోక్షంగా సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో త్రివిక్రంకి బ్రో మీద టైం స్పెండ్ చెయ్యడానికి మహేష్ అనుమతి ఇచ్చాడంట. మహేష్-పవన్ మధ్య ఉన్న బంధం ఎప్పటికీ బలంగానే ఉంది” అంటూ రాసుకొచ్చారు.
భారత దిగ్గజ పారిశ్రామిక వేత్త అయిన ముకేశ్ అంబానీ ఆసియాలోనే అపర కుబేరుడుగా పేరుగాంచాడు. ముకేశ్ అంబానీకి సంబంధించిన వార్తలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. అంబానీ ఆంటిలియా భవనం ప్రపంచంలోనే రెండవ అత్యంత రిచెస్ట్ హౌస్ గా నిలిచింది. ఈ ఇంటి ఖరీదు 15 వేల కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని సమాచారం. ఈ భవనం మాత్రమే కాకుండా అంబానీకి ఇతర దేశాలలో కూడా ఎన్నో భవంతులు ఉన్నాయి. తాజాగా వాటిలో ఒక లగ్జరీ ప్రాపర్టీని అమ్మేసినట్లుగా ఒక న్యూస్ నెట్టింట్లో షికారు చేస్తోంది.
అమెరికాలోని మ్యాన్‌హట్టన్ వెస్ట్ విలేజ్‌లో ఉండే ఒక లగ్జరీ హౌజ్ ను విక్రయించినట్లుగా న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. 2406 చదరపు అడుగులు ఉన్న ఇంటిని 9 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ.74.5 కోట్లకు అమ్మినట్లుగా పేర్కొంది. ఇక ఈ లగ్జరీ హౌజ్ హడ్సన్ నదీ తీరంలో ఉందట. రెండు బెడ్రూంల నుండి హడ్సన్ నది ప్రకృతి అందాలను చూసే విధంగా ఈ ఇంటిని నిర్మించారని తెలుస్తోంది.
ఈ ఇంటి లోపల భాగాన్ని అత్యాధునిక వసతులతో నిర్మించారు. జిమ్మీ జాన్సన్, హిల్లరీ స్వాంక్, మార్క్ జాకబ్స్ లాంటి ప్రముఖులు ఈ హౌజ్ ఇంటీరియర్ డిజైన్‌ను అద్భుతంగా రూపొందించారు. గతేడాది అంబానీ అరబ్ సిటీ దుబాయ్‌లో కూడా 640 కోట్ల రూపాయలు పెట్టి ఒక లగ్జరీ విల్లా కొనుగోలు చేశారు.
జెంట్ మూవీకి విశాఖపట్నం జిల్లా వరకే డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇచ్చి, అగ్రిమెంట్ ను బ్రేక్ చేశారు. మే 1న ఇదే విషయం గురించి గరికపాటి కృష్ణ కిశోర్‌ని కలవగా, అతను నిర్మాత అనిల్ సుంకరతో మాట్లాడారని, ఏజెంట్ డిజాస్టర్ గా నిలిచిందని, అండర్ టేకింగ్ లెటర్ కూడా ఇస్తామని అన్నారు. ఆ తరువాత ‘సామజవరగమన’ విశాఖపట్నం హక్కులు తనకే ఇచ్చినా, నష్టపోయిన డబ్బులో కొంచెం మాత్రమే వచ్చిందని అన్నారు.
నలబై ఐదు రోజుల్లో లేదా నెక్స్ట్ రిలీజ్ కు 15 రోజుల ముందు మిగతా డబ్బును చెల్లిస్తామని అగ్రిమెంట్ ఇచ్చారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నెక్స్ట్ సినిమా ‘భోళా శంకర్’ గురించి మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే వారు తనకు జవాబు చెప్పట్లేదు. ఫిలిం ఛాంబర్ కు చెప్పిన ఎలాంటి ప్రయోజనం కలుగలేదని, తప్పని పరిస్థితుల్లోనే కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని బత్తుల సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ చిత్రంలో కీలక పాత్రలలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు నటించారు. మలయాళ ఇండస్ట్రీ నుండి మోహన్ లాల్, కన్నడ ఇండస్ట్రీ నుండి శివరాజ్ కుమార్, బలివుడ్ నుండి జాకీష్రాఫ్ నటించారు. రజిని కాంత్ భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించగా, హీరోయిన్ తమన్నా, టాలీవుడ్ నటుడు సునీల్ కూడా ఈ మూవీలో నటించారు. విలన్ గా మలయాళ నటుడు వినాయకన్ నటించారు.
మొదట ఈ మూవీ పై అంతగా అంచనాలు లేనప్పటికీ, టీజర్, సాంగ్స్, రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో ‘కావాలయ్యా’ సాంగ్ 100 మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే షోలు ప్రారంభం కావడంతో జైలర్ మూవీ చూసిన వారు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు. కొందరు నెటిజెన్లు ఫస్ట్ హాఫ్ బాగుందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇంటర్వల్ సన్నివేశంలో వింటేజ్ రజినీకాంత్ కనిపిస్తాడని, స్క్రీన్ ను షేక్ చేశాడని అంటున్నారు. మరికొందరు ఈ మూవీ రజినీకాంత్ అభిమానులకి ఫుల్ ఫీస్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే జైలర్ మూవీ రిలీజ్ పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆ మీమ్స్ ఏమిటో మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
దాదాపు రెండు నిముషాల 45 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ లో విజయ్ దేవరకొండ, సమంత అందంగా కనిపించారు. ఆద్యంతం ఖుషి ట్రైలర్ ఆకట్టుకుంది. సమంత ముస్లింగా, బ్రాహ్మణ యువతిగా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించింది. విప్లవ్, ఆరాధ్యలు వారి పెద్దలను ఎదిరించి మతాంతర వివాహం చేసుకుని, ఆ తరువాత ఎదుర్కొనే సమస్యలను చూపించారు. అలాగే విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘భర్త ఎలా ఉండాలో చూపిస్తా’, ‘నేను స్త్రీ పక్షపాతిని’, ‘నా పిల్ల’ అనే డైలాగ్స్ బాగున్నాయి.
అయితే ట్రైలర్ లో విజయ్ దేవరకొండ అక్కడక్కడ అర్జున్ రెడ్డి మూవీలోని తన మార్క్ పెర్ఫార్మెన్స్ ను చూపించాడు. ఇక ట్రైలర్ లో చివర్లో విజయ్ దేవరకొండ ఒక మహిళతో ‘ఎందుకు బయపడుతున్నావమ్మా, మార్కెట్లో నా గురించి అట్లా అనుకుంటున్నారు కానీ, నేను స్త్రీ పక్షపాతిని’ అనే డైలాగ్ చెప్పే సీన్ లో ఉన్న నటి అర్జున్ రెడ్డి మూవీలో కూడా ఉంటుంది. అలాగే ‘నా పిల్ల’ అనే డైలాగ్ కూడా అర్జున్ రెడ్డిలో చెప్పిన డైలాగ్. ఈ ట్రైలర్ ను చూసిన నెటిజెన్లు ఈ రెండు విషయాల పై కామెంట్స్ చేస్తున్నారు.