పెళ్లితో చాలా మార్పులు వస్తాయి. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది పెళ్లితో రెండు మనసులు దగ్గరవుతాయి. రెండు కుటుంబాలు ఒకటి అవుతాయి.
అయితే చాలా మంది వైవాహిక జీవితానికి సంబంధించి తప్పులు చేస్తూ ఉంటారు కానీ పెద్దవాళ్లు చెప్పిన ఈ విషయాలని గుర్తుపెట్టుకుంటే కచ్చితంగా వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవు. మరి మీ వైవాహిక జీవితానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి చూసుకోండి.

#1. ఏం చెప్పామన్నది కాదు ఎలా చెప్పామన్నది ముఖ్యం:
వైవాహిక జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. అయితే ఏం చెప్పామన్నదానికంటే ఎలా చెప్పాము అనేది చాలా ముఖ్యం. గొడవలు కి దారి తీయకుండా మంచిగా కూడా చెప్పొచ్చు.
#2. ఇతరులను గెలవనివ్వండి:
ఆస్తమాను నేనే గెలవాలి అనుకునే బదులు ఒక్కొక్కసారి కాంప్రమైజ్ అవ్వడం కూడా మంచిది దీని వలన ఇతరులకు అవకాశం వస్తుంది పైగా ప్రేమ పెరుగుతుంది.
#3. వారికి ఇష్టమైనది వండండి:
ఇది చాలా పాత పద్ధతి అయినప్పటికీ కూడా ప్రేమను పెంచుతుంది పైగా మంచి కమ్యూనికేషన్ కూడా. ప్రేమ మరియు కేరింగ్ ని చూపించినట్లు కూడా ఇది తెలుపుతుంది. నచ్చినది వండి పెట్టడం వలన కూడా ప్రేమ పెరుగుతుంది.

#4. వారి సహాయం తీసుకోండి:
కొన్ని కొన్ని సార్లు మనకి అవసరం లేకపోయినా సరే పార్టనర్ సహాయం తీసుకోవడం మంచిది. పచ్చడి డబ్బా మూత తీయమని అవసరం లేకపోయినా అడిగితే ఎదుట వ్యక్తులు వాళ్ళు అవసరం అని గుర్తిస్తారు.
#5. గౌరవించడం మానకండి:
ఒకరికొకరు గౌరవించుకుంటేనే బంధం బాగుంటుంది ఎప్పుడూ కూడా మీ పార్ట్నర్ ని అగౌరవపరచద్దు. ఇది నిజంగా వాళ్లని బాధపెడుతుంది.

#6. మీరు చేసే పనులని మొదటి చూడండి:
ఎప్పుడైనా సరే ఇతరులను మీరు అనే ముందు మీరు చేసే పనుల మీద ఒకసారి దృష్టి పెట్టండి అప్పుడు మీ తప్పు మీకే తెలుస్తుంది.






















స్త్రీలను అంత్యక్రియల్లో పాల్గొనడానికి, శ్మశాన వాటికకు వెళ్ళకుండా నిషేధించడం చాలామంది పురాణాల ఆధారంగా అధ్యయనం చేశారు. మహాభారత కాలంలో స్త్రీలు అంత్యక్రియల్లో పాల్గొనేవారని తెలుస్తోంది. భీష్ముడి దహన సంస్కారాల సమయంలో కౌరవులు, పాండవులు మాత్రమే కాకుండా మహిళలు సైతం పాల్గొన్నట్లు కనుగొన్నారు. పూర్వ కాలంలో మరణానికి, స్వర్గానికి కుమారుడు వారధి అని భావించేవారు. మరణించినవారికి అంత్యక్రియలు మరియు చితికి నిప్పు పెట్టడం వంటి ప్రక్రియ కుమారుడు చేస్తే ఆ వ్యక్తులకు స్వర్గప్రాప్తి కలుగుతుందని విశ్వాసించేవారు.
అందువల్ల కుమారుడు లేదంటే కుమారుడితో సమానమైనవారితో దహన సంస్కారాలు చేయించేవారు. పూర్వ కాలంలో స్త్రీలు చాలా సున్నితమైన వారు అని, త్వరగా భావోద్వేగానికి లోనవుతారని అనుకునేవాళ్ళు. అందువల్ల దహన సంస్కారాలను స్త్రీలు చూసి తట్టుకోలేరని, వాళ్లను అంత్యక్రియలకు దూరంగా ఉంచేవారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. స్త్రీలను స్మశాన వాటికకి రాకూడదు అనడం వెనుక ఉన్న కారణం ఏమిటి అంటే,
పూర్వకాలంలో అంత్యక్రియలు చేసేటపుడు, ఇంట్లో ఉండే వృద్దులను, పిల్లలను చూడడం కోసం. వచ్చినవారందరికి భోజన ఏర్పాట్లు చేయడం కోసం స్త్రీలు ఇంట్లోనే ఉండేవాళ్ళు. పురుషులు మాత్రమే స్మశానంకు వెళ్ళి అంత్యక్రియలు పూర్తి చేసేవారు. ఇక అంత్యక్రియలు చేసేటపుడు స్మశానంలో దుష్టశక్తులు కూడా ఉంటాయట. స్త్రీలు సున్నితంగా ఉండడం వల్ల వాళ్లను ఎక్కువ ఆకర్షించే అవకాశం ఉందని, మహిళలను స్మశాన వాటికలోకి నిషేధించారట. దహన సంస్కారాలకు వెళ్ళిన స్త్రీలు తమ వెంట్రుకలను తీసివేయాలట. ఆ కారణంగా కూడా స్త్రీలను నిషేధించారని తెలుస్తోంది.

