మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో 7 మంది ఉంటారా..? ఇందులో ఉన్న నిజమెంత..?

మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో 7 మంది ఉంటారా..? ఇందులో ఉన్న నిజమెంత..?

by Mounika Singaluri

Ads

మనిషిన పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. సినిమాల్లో కూడా ఇది మీరు వినే ఉండచ్చు. అయితే నిజంగా మనిషిని పోలిన మనుషులు ఉంటారా..? దీని వెనుక అసలు ఏముంది అనే ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

ఈ మధ్యకాలంలో మనకి సోషల్ మీడియాలో మనిషిని పోలిన మనుషులు కనపడుతున్నారు ఉదాహరణకి ఇటాలియన్ రేసర్ ఎంజో ఫెరారీ, జర్మనీ ఫుట్‌బాలర్ మేసర్ ఓజిల్‌లు ఇద్దరు కూడా ఒకేలా ఉన్నారు ఇలా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం.

 

దీని వెనుక కారణం ఏంటంటే..?

‘‘కాల్ రిపోర్ట్స్’’ జర్నల్‌లో 2016లో మొదలైన ఈ రీసెర్చ్ యొక్క రిజల్ట్ ని ప్రచురించారు. దీని ప్రకారం తెలిసింది ఏంటంటే ఒకేలా వుండే వ్యక్తులని అన్‌నోన్ ట్విన్స్ అని అంటారు. ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఒకేలా కనపడే వాళ్ళ ఫొటోస్ తీసుకుని స్టడీ చేసారు. ఓ ముఖం ఇంకో ముఖానికి ఎంత చెరువుగా వున్నది అనేది ఈ ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ ద్వారా కనుగొన్నారు. అయితే ఫలితం ఒకేలా ఉండదు. కొందరి ఫేసెస్ 90 శాతం నుండి వంద వరకు కూడా మ్యాచ్ అయ్యాయట.

ఎందుకు ఇంతలా మ్యాచ్ అయ్యాయి అని మీరు కూడా ఆలోచిస్తున్నారా..? నిజానికి దీని వెనుక పెద్ద కారణమే వుంది. ఒకేలా వుండే వ్యక్తుల నమూనాల మీద వర్క్ చేసారు. వ్యక్తుల తాలూకా డీఎన్ఏ, లాలాజల నమూనాలను కూడా తీసుకుని పరీక్షించారు. ఇలా బయోలాజికల్ నమూనాలను కూడా స్టడీ చేసారు. ఎపీజీనోమ్ మీద కూడా నిపుణులు వర్క్ చేశారట. డీఎన్‌ఏను నియంత్రించడం కోసం ఇది హెల్ప్ అవుతుంది. మైక్రోబయోమ్‌ను కూడా స్టడీ చేసారు. గమ్మత్తు ఏమిటంటే ఎవరు గెస్ చేయలేని రిజల్ట్ వచ్చింది.

ఒకేలా కనపడే వ్యక్తుల మీద చేసిన పరిశోధన ప్రకారం ఒకేలా కనపడే వ్యక్తుల యొక్క జీనోమ్‌లు ఒకేలా వున్నాయట. ఎపీజెనెటిక్స్, మైక్రోబయోమ్‌లు మాత్రం వేరేగా వున్నాయట. డీఎన్ఏ సీక్వెన్స్‌లు, జెనెటిక్స్ ఒకలానే ఉండడం తో పోలికలు కూడా సేమ్ వున్నాయి. కానీ ఇద్దరి పూర్వికులకి ఏ కనెక్షన్ లేదు. కేవలం ఒకేలాంటి ఫీచర్స్ కి కారణమయ్యే జెనెటిక్ వేరియంట్స్ వలన మాత్రమే అలా కనపడతారు. ఎక్కువ వేరియంట్స్ సేమ్ గా ఉంటే ఫీచర్స్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే భావోద్వేగ పరమైన అంశాలు కూడా ఒకేలా వుండచ్చట.


End of Article

You may also like