ఒకప్పుడు ఆడవాళ్ళలో హాస్యనటులు చాలా తక్కువగా ఉండేవారు. ఉన్నవాళ్లలో తిరుగులేని హాస్య నటిగా పేరు తెచ్చుకుంది నటి గిరిజ. బ్లాక్ అండ్ వైట్ కాలంలో స్టార్ కమెడియన్గా, సెకండ్ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించింది. కృష్ణాజిల్లాలో కంకిపాడు లో పుట్టిన ఈమె తల్లి, నటి దాసరి రామ తిలకం ప్రోద్బలం తో సినిమాల్లోకి అడుగు పెట్టింది.
పాతాళ భైరవి సినిమాలో నరుడా ఏమి నీ కోరిక అన్న ఒకే ఒక డైలాగ్ తో జనాలకు కలెక్ట్ అయిపోయింది. కాశీకి పోయాను రామాహరి అనే పాటతో ఆమెకి మరింత గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత తిరుగులేని లేడీ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న ఈమెకు రేలంగి సినిమా ఆఫర్లు ఇప్పించేవాడని, ఆమె కోసం ఒక ఇల్లు కూడా కొనిచ్చాడని, వాళ్ళ ఇద్దరి రిలేషన్ చాలా క్లోజ్ గా ఉండేదని అప్పట్లో అనుకునేవారు. నాలుగైదు మేడలు సంపాదించి, దర్జాగా కార్లలో తిరిగే గిరిజ జీవితం పెళ్లి తర్వాత అత్యంత దుర్భరంగా మారింది. సన్యాసిరావు అనే వ్యక్తిని తిరుపతిలో పెళ్లి చేసుకుంది.

అయితే అతను ఖాళీగా ఉండటంతో అతని కోసం ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించింది. భర్తతో కలిసి భలే మాస్టారు పవిత్ర హృదయాలు తీసి తీవ్రంగా నష్టపోయింది. కానీ భర్త మాత్రం తన దగ్గర ఉన్న ఆస్తిని నీళ్ళలా ఖర్చు పెట్టేవాడు. జల్సాలు చేస్తూ ఆస్తిని హారతి కర్పూరం చేసేసాడు. తాగిన మైకంలో గిరిజ మీద చేయి చేసుకుంటే ఆమెకి 14 కుట్లు పడ్డాయి. అలాగే కూతుర్ని కూడా ఏ రోజు చేరదీసిన పాపాన పోలేదు. నాన్న అని పిలిస్తే కాలితో తన్నేవాడు. ఆఖరికి ఒకరోజు చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. తరువాత నటి గిరిజ జీవితం కష్టాల పాలయింది.

చివరి రోజులలో కనీస అవసరాలకి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. డాన్స్ మాస్టర్ సురేష్ దాస మాటలలో గిరిజని ఒకరోజు దీనస్థితిలో చూశాను, ఆ తర్వాత కొద్ది రోజులకి బస్టాండ్ లో విగత జీవిగా చూశాను అని చెప్పుకొచ్చాడు. అయితే కూతురు శ్రీ గంగ మాత్రం తల్లి తన ఇంట్లోనే చనిపోయిందని ఇండస్ట్రీ నుంచి వచ్చి పలకరించిన ఒకే ఒక్క నటుడు అల్లు రామలింగయ్య అని, శోభన్ బాబు గారు ఫోన్లో పరామర్శించారని చెప్పడం విశేషం.

చట్ట ప్రకారం వివాహం జరిగిన తరువాత భార్య లేదా భర్త నుండి విడాకులు రాకుండా రెండవ వివాహం చేసుకోవడం అనేది చట్ట విరుద్ధం అవుతుంది. ఒకవేళ అలా చేసుకుంటే కనుక IPC సెక్షన్ 494 ప్రకారం బైగమీ కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. దీని ఫలితంగా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది మరియు రెండవ వివాహం చెల్లదు. అంటే చట్ట ప్రకారం పెళ్లి జరిగిన తరువాత ఆ వ్యక్తి ఇంకొక పెళ్లి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా విడాకులు రావాల్సిందే.
ఈ విషయం తెలియక చాలా మంది, లేదా ఏం చేస్తారులే అనుకుని రెండవ పెళ్లి చేసుకుంటుంటారు. ఒకవేళ భార్య లేదా భర్త రెండవ పెళ్లి చేసుకున్న భర్త లేదా భర్త మీద కేసు నమోదు చేసే హక్కు ఉంటుందని వెల్లడించారు. అలాంటి సమయంలో రెండవ పెళ్లి చేసుకున్న వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. వారికి ఏడు సంవత్సరాల జైలు శిక్షపడుతుంది.
హిందూ వివాహచట్టం ప్రకారంగా డైవర్స్ కోరుతూ దాఖలైన పిటిషన్ను ఒప్పుకుంటూ భర్త లేదా భార్య ప్రమాణ పత్రాన్ని ఇచ్చినట్లు అయితే వారి పెళ్లి రద్దువుతుంది. కానీ, విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉన్నా రెండవ వివాహం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి

రామాయణంలో కీలకమైన ఘట్టాలలో సీతాదేవి అపహరణ కూడా ఒకటి. అదే రావణాసురుడి చావుకు కారణం అయ్యింది. వనవాసంలో ఉన్న సమయంలో రావణాడు సీతాదేవిని ఎత్తుకెళ్లడం, ఆ తరువాత అశోకవనంలో బంధించిన విషయం తెలిసిందే. అయితే ఆదిపురుష్ లో రావణాడు సీతను పట్టుకోకుండా గాల్లో తీసుకెళ్తాడు. వాల్మీకి రామాయణంలో సీతాదేవి ఉన్న భూమిని పెకిలించి తీసుకెళ్లినట్టుగా ఉంటుంది. మరి రావణాడు సీతమ్మను తాకకుండా తీసుకెళ్లాడానికి కారణం కుబేరుడి కుమారుని శాపం.
రావణాసురుడు తనకి కోడలితో సమానం అయిన రంభను ఒకసారి బలవంతం చేస్తే, రంభ ప్రియుడు అయిన కుబేరుడి కుమారుడు నలకుబేరుడు రావణాసురుడు పరాయి స్త్రీని బలవంతంగా ముట్టుకుంటే రావణాసురుడి పది తలలు పగిలిపోయేలా శాపం పెడుతాడు. రావణాసురుడు సీతాదేవి అనుమతి లేకుండా ముట్టుకుంటే తన పది తలలు పగిలిపోతాయి. అందుకే రావణాడు సీతను గాల్లో తీసుకెళ్తాడు.
ఆ తరువాత రావణాసురుడు సీతాదేవి తాకకుండా అశోకవనంలో ఉంచుతాడు. శ్రీ రాముడు ఆంజనేయుడి సహాయంతో లంకలో ఉన్న సీతాదేవి జాడను కనుగొని, వారధి కట్టి, రావణాసురుడితో యుద్ధం చేసి రావణుడిని సంహరించి సీతాదేవి తీసుకుని అయోధ్యకు చేరుకుంటాడు. నల కుబేరుడు శాపం వల్ల రావణాసురుడు సీతాదేవిని తాకడానికి భయపడతాడు.


























