ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న ఒకే ఒక టాపిక్ బడ్జెట్. ఇప్పుడే కాదు. ఎప్పుడైనా సరే బడ్జెట్ గురించే చర్చలు అవుతూనే ఉంటాయి. అది దేశానికి, ఇంకా దేశంలో ఉన్న ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి అందరూ బడ్జెట్ గురించి ఆసక్తిగానే తెలుసుకుంటారు. కేవలం ప్రభుత్వం విషయంలోనే కాదు సాధారణంగా కూడా రోజువారీ జీవితంలో బడ్జెట్ అనేది చాలా ముఖ్యమైనది.

ఏదైనా పని చేయాలి అన్నా, ఇల్లు నడపాలి అన్నా కూడా తీసుకునే ప్రతి నిర్ణయం బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటారు. దాని ప్రకారమే ప్లాన్ చేసుకుంటారు. బడ్జెట్ అనేది ఒక మనిషి పొదుపు, ఖర్చులకి సంబంధించినవి అయి ఉండొచ్చు, ఒక గ్రూప్ కి సంబంధించినది, ప్రభుత్వానికి సంబంధించినది, బిజినెస్ కి సంబంధించినది కూడా అయి ఉండొచ్చు.
ఈ పదాన్ని మనం ఎక్కువగానే వాడతాము. అయితే, అసలు బడ్జెట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో మీకు తెలుసా? బడ్జెట్ అనే పదం ఫ్రెంచ్ భాషలోని బుజెట్ అనే పదం నుంచి వచ్చింది. బుజెట్ అంటే లెదర్ తో తయారుచేసిన బ్యాగ్ అని అర్థం. 1733 లో సర్ రాబర్ట్ వాల్పోల్ అనే బ్రిటన్ కి చెందిన మంత్రి ఆదాయానికి, ఖర్చులకి సంబంధించి తయారుచేసిన ఫైనాన్షియల్ రిపోర్ట్ ని ఒక బుజెట్ లో పెట్టుకొని తీసుకెళ్లారు.

దాన్ని సమావేశంలో ప్రెజెంట్ చేశారు. అయితే, రాబర్ట్ వాల్పోల్ బుజెట్ ప్రజెంట్ చేశారు అనే వార్త మెల్లగా పాకడం మొదలైంది. తర్వాత అది వార్త బ్రిటన్ దేశమంతటా తెలిసింది. దాంతో మెల్లగా బడ్జెట్ అన్న పదం అర్థమే మారిపోయింది. అంతేకాకుండా “ద బడ్జెట్ ఓపెన్డ్” అని రాబర్ట్ వాల్పోల్ కార్టూన్ కూడా ప్రచురించబడింది. భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్ 1860 జేమ్స్ విల్సన్ అనే వ్యక్తి జారీచేశారు. తర్వాత 1947 లో ఆర్కె షణ్ముఖం చెట్టి బడ్జెట్ ని ప్రెజెంట్ చేశారు








ప్రస్తుతం కరడు గట్టిన నేరస్థులు, గూండాలు మరియు షార్ప్‌షూటర్లతో కలిసి గోయల్ జైలు జీవితం గడుపుతున్నారు. మనీలాండరింగ్ కేసులో గత ఏడాది సెప్టెంబర్ 1న అరెస్ట్ అయిన, 4 నెలల నుండి ముంబై ఆర్థర్ రోడ్ ప్రిజన్ లో శిక్షను అనుభవిస్తున్నారు. గోయల్ స్పెషల్ కోర్టుకు హాజరవడం కోసం జైలు నుండి బయటకు రాగా, ఆ టైమ్ లో నేషనల్ మీడియా తీసిన ఫోటో ఇది. జనవరి 26న ప్రైవేట్ హాస్పటల్ వైద్యుల సూచనల మేరకు, తనని ప్రైవేట్ హాస్పటల్ లో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి అనుమతించాలాని పిటిషన్లో కోరారు.
జెట్ ఎయిర్వేస్ కంపెనీ కెనరా బ్యాంకు నుండి 848.86 కోట్ల రూపాయల లోన్ తీసుకుంది. అందులో కొంత చెల్లించిన ఆ సంస్థ మిగిలిన 538.62 కోట్ల రూపాయలను చెల్లించడంలో విఫలమైంది. ఈ క్రమంలో సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి జెట్ ఎయిర్వేస్ కెనరా బ్యాంకును మోసం చేసినట్టు గా తేల్చింది. అయితే ఈ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించిన అంశాలు సైతం ఉన్నాయని తేలడంతో ఈడీ రంగంలోకి దిగి, 2023 సెప్టెంబరు 1న గోయల్‌ను అరెస్ట్ చేసింది.


హాయ్ నాన్న మూవీ ఓ తండ్రి, కూతుర్ల మధ్య జరిగే ఎమోషనల్ స్టోరి అని తెలుస్తోంది. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ చూస్తుంటే హీరో వైఫ్ చనిపోవడం, అతనికి ఒక పాప ఉండడం, ఆ పాపకి హీరోయిన్ ఫ్రెండ్ కావడం వంటి సీన్స్ కనిపించాయి. ఇక ఈ గ్లింప్స్ లో నాని కూతురిగా నటించిన పాప పేరు కియారా ఖన్నా.
ఆమె పలు వాణిజ్య ప్రకటనలలో నటించింది. థాంక్ గాడ్, బందాసింగ్, బారాముల్లా, సాంబహదూర్ వంటి బాలీవుడ్ సినిమాలలో నటించింది. కియారాకు ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. తన అక్క మైరాతో కలిసి ఉన్న వీడియోలను షేర్ చేస్తుంది.
కియారా ఖన్నా తల్లి పేరు శివాని జె ఖన్నా. ఆమె తన పిల్లల పేర్లతో నిర్వహిస్తున్న ఇన్స్టాగ్రామ్ ఖాతాకు దాదాపు 328 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తన పిల్లలు మైరా మరియు కియారా ఖన్నా నటించిన వీడియోలను క్రమం తప్పకుండా షేర్ చేస్తుంది. కియారా ఖన్నా మాక్స్ స్ప్రింగ్ యాడ్, క్లబ్ మహీంద్రా మరియు కెన్‌స్టార్ వంటి పలు యాడ్స్ లో నటించింది. ఆమె యూట్యూబ్ ఛానెల్ లో ఈ యాడ్స్ ను చూడవచ్చు.
స్మితా సబర్వాల్ నిన్న సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ లో ఫొటోలను షేర్ చేశారు. జనవరి 10న ఆమె తల్లి ‘పురబి దాస్’ 79వ బర్త్ డే జరుపుకుంటున్న సందర్భంగా స్మితా సబర్వాల్ ‘ఎక్స్’ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియచేసారు. ఆ పోస్ట్ లో తల్లి ఫోటో మరియు తల్లితో ఉన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేశారు.
ఆ పోస్ట్ లో ” నాకు తెలిసిన ఒకే ఒక మహిళ, నా కంటే ఎక్కువ దృఢ నిశ్చయం ఉన్న మహిళ” అంటూ తన తల్లి గురించి రాసుకొచ్చారు. అంతేకాకుండా “79వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలని, మీరు ‘ఎక్స్’ లో ఉన్నారని నాకు తెలుసు. రహస్యంగా నన్ను ఫాలో అవుతున్నావని తెలుసు” అంటూ స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు.
ఈ పోస్ట్ చూసిన నెటిజెన్లు పురబి దాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజెన్ “ఈ స్థాయికి వచ్చిన మీ వెనుక వెన్నుదన్నుగా అండగా నిలిచిన అమ్మకు వందనం…!!” అంటూ కామెంట్ చేశారు. “మీలాంటి లీడర్ ను పెంచి పోషించిన నిజమైన లీడర్ కు జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు ఆమెకు మరింత బలాన్ని మరియు సంకల్ప శక్తిని ప్రసాదించాలని” మరొకరు కామెంట్ చేశారు. కొందరు నెటిజెన్లు చిన్నారి స్మితా సబర్వాల్ క్యూట్‌గా ఉందని కామెంట్స్ చేశారు.


