టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘ఒక లైలా కోసం’ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది.
మొదటి చిత్రంతోనే తనదైన నటన, అందంతో మెప్పించిన పూజా హెగ్డే కుర్రాళ్లకు కలల రాజకుమారిగా మారిపోయింది. ఆమె తెలుగులోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. అయితే సోషల్ మీడియాలో ఒక అమ్మాయి పూజా హెగ్డే లాగే ఉంది. మరి ఆ అమ్మాయి ఎవరో ఇప్పుడు చూద్దాం..
పూజా హెగ్డే గ్లామర్ పాత్రలు చేస్తూనే, మరోవైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ లో వరుస అవకాశాలు పొందుతూ, తక్కువ కాలంలోనే తెలుగులో అగ్ర హీరోయిన్ల లిస్ట్ లో చేరింది. పూజా హెగ్డే దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించింది. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. కోలీవుడ్ లో విజయ్ దళపతి బీస్ట్ సినిమాలో నటించింది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్. హృతిక్ రోషన్ వంటి హీరోలతో నటించింది.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న గుంటూరుకారం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమాలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే, అచ్చం పూజా హెగ్డేల కనిపిస్తున్న ఒక అమ్మాయి ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.పూజా హెగ్డేలా కనిపిస్తున్న ఆ అమ్మయి పేరు సవియా గోన్సాల్వేస్. ఆమె ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. సవియా గోన్సాల్వేస్ ట్రావెల్, టూరిజం మారియు ఏవియేషన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా పనిచేస్తున్నారు. ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో 80 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సవియా గోన్సాల్వేస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ, నిత్యం తన ఫోటోలను షేర్ చేస్తుంటుంది.
https://www.instagram.com/p/B-hYmysndR8/
Also Read: RRR లోని “నాటు నాటు” స్టెప్స్ ని ఆ హీరో మూవీ నుంచి కాపీ చేశారా…?