“బాహుబలి” మూవీలో ఇంటర్వెల్ ఇలా పెట్టి ఉంటే..?

“బాహుబలి” మూవీలో ఇంటర్వెల్ ఇలా పెట్టి ఉంటే..?

by kavitha

Ads

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ మూవీ తెలుగు సినిమా స్టామినా ఏమిటో ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసింది. ఈ మూవీ పాన్ ఇండియా పదాన్ని పరిచయం చేసింది. హీరో ప్రభాస్‌ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చింది. భారతీయ దర్శకులలో జక్కన్నకు ప్రత్యేకతను సృష్టించింది. హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డులు సృష్టించింది.

Video Advertisement

‘బాహుబలి: ది బిగినింగ్‌’ రిలీజ్ అయ్యి సరిగ్గా ఎనిమిది సంవత్సరాలు అవుతోంది. 2015 లో జులై 10న రిలీజ్ అయిన ఈ మూవీ అప్పటి దాకా సాగిన టాలీవుడ్ సినీ గమనాన్ని మర్చేసింది. ఇది ఇలా ఉంటే బాహుబలి: ది బిగినింగ్‌ మూవీలో ఇంటర్వెల్‌ సన్నివేశం గుర్తుండే ఉంటుంది. అయితే ముందుగా అనుకున్న సీన్ అది కాదంట. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
bahubali-movieబాహుబలి మూవీ గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతియోశక్తి లేదు. జక్కన్న దర్శకత్వ ప్రతిభ, రెబల్ స్టార్ ప్రభాస్‌, రానా, రమ్యకృష్ణ, తమన్నా, అనుష్క, సత్యరాజ్ ల అద్భుతమైన నటన బాహుబలి సినిమాని బ్లాక్ బస్టర్ గా చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఉన్న ఇండస్ట్రీల రికార్డులన్నిటిని ఈ మూవీ తిరగరాసి, ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలను క్రియేట్ చేసింది. బాహుబలి మూవీలో విగ్రహం పైకి లేపిన అనంతరం ఇంటర్వెల్‌ వస్తుంది. అయితే దర్శకుడు రాజమౌళి ముందుగా వేరే సీన్ దగ్గర ఇంటర్వెల్‌ వేయాలని అనుకున్నారంట.
అది ఏమిటంటే, దేవసేన ‘‘మాహిష్మతి ఊపిరి పీల్చుకో, నా కొడుకు వచ్చాడు. బాహుబలి తిరిగి వచ్చాడు’ అని చెప్పినప్పుడు శివుడు నడుస్తూ ఉంటే అతడిలో నుండి అమరేంద్ర బాహుబలి రూపం వస్తుంటే ఇంటర్వెల్‌ రావాలి. ఈ సీన్ కన్నా ముందు శివుడు నిప్పు, గాలి, భూమి, నీరు, ఆకాశం అయిన పంచభూతాలను దాటుకుని మాహిష్మతి రాజ్యంలో అడుగుపెడతాడు. అయితే ఈ సీన్ ను జక్కన్న ఇలా తీయాలని అనుకోలేదట.
మాహిష్మతి రాజ్యంలోకి వచ్చే ముందు శివుడు మంచు కొండల్లో సైనికులతో ఫైట్ చేస్తాడు. ఆ సమయంలో అక్కడున్న ఒక సైనికుడు శివుడిని చూసి అమరేంద్ర బాహుబలి అనుకుని, ‘ప్రభూ నన్ను ఏమీ చేయొద్దు’ అంటూ వేడుకుంటాడు. ఆ తరువాత తప్పించుకుని వెళ్ళి, బిజ్జలదేవుడికి బాహుబలి గురించి చెబుతాడు. కానీ, బిజ్జలదేవుడు నమ్మకుండా  ‘బాహుబలి చనిపోయాడు. వాడి ప్రాణాలను నలిపి మట్టిలో కలిపాం’ అని చెప్పగానే శివుడు మట్టి గోడను పగుల కొట్టుకుని ఇటువైపు రావాలి.
ఆ తరువాత ‘బాహుబలి శరీరాన్ని మంటల్లో కలిపాం’ అని చెప్పగానే శివుడు మంటలను దాటి రావాలి. ఈ విధంగా బిజ్జలదేవుడు ఒక్కో డైలాగ్‌ చెప్తుంటే ఒక్కో స్టేజ్ ను శివుడు దాటుకుని వచ్చేలా తీయాలని, అక్కడ ఇంటర్వెల్‌ వేయాలని భావించారంట. అయితే విగ్రహం పైకి ఎత్తిన తరువాత ఇంటర్వెల్‌ వస్తే బాగుంటుందని, బిజ్జలదేవుడి డైలాగ్స్‌ తొలగించారు. ఇక శివుడి మాహిష్మతికి వచ్చే సీన్స్ ను ‘నిప్పులే శ్వాసగా’ అనే పాటలా తీశాం’’ అని జక్కన్న ఒక సందర్భంలో వెల్లడించారు.

Also Read: “నిహారిక కొణిదెల-చైతన్య” విడాకుల తర్వాత మొదటి సారిగా స్పందించిన చైతన్య తండ్రి..! ఏం అన్నారంటే..?


End of Article

You may also like