అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆర్య’ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకి కొనసాగింపుగా వచ్చిన ఆర్య 2 మూవీ మిశ్రమ స్పందన పొందింది. కానీ ఈ మూవీ బాక్సాఫీసు దగ్గర లాభాలు సాధించి, హిట్ అయ్యింది. కానీ ‘ఆర్య’ సాధించినంత సక్సెస్ ను పొందలేక పొయింది.
ఈ చిత్రానికి కూడా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ చిత్రంలోని ఒక సన్నివేశాన్ని హాలీవుడ్ మూవీ నుండి కాపీ కొట్టారని సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ‘ఆర్య 2’. ఈ మూవీని ఆదిత్య బాబు ఆదిత్య ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. శ్రద్ధా దాస్, బ్రహ్మానందం, ముఖేష్ రుషి కీలక పాత్రలలో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 2009లో నవంబరు 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.
ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ నిర్మాతలకు లాభాలను తెచ్చింది. ఈ మూవీ మలయాళంలో సేమ్ టైటిల్ తో అనువదించబడి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా ఈ మూవీలోని ఒక సన్నివేశాన్ని హాలీవుడ్ మూవీ అయిన ఇండియానా జోన్స్ 4 నుండి కాపీ కొట్టారని నెట్టింట్లో ఒక వార్త హల్చల్ చేస్తోంది. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు సుక్కు మావా నువ్వు కూడా కాపీ కోడతావా అని కామెంట్ చేస్తే, మరొకరు ఇండియానా జోన్స్ టాలీవుడ్ డైరెక్టర్లకి బాగా ఉపయోగపడిందని అని కామెంట్ చేశారు. ఇంకొకరు సుకుమార్ కూడా వాడేస్తాడా అంటూ కామెంట్ చేస్తున్నారు.
Duvvena Anna duvvena pic.twitter.com/RzoLh5sLxY
— ʌınɐʎ (@CoolestVinaay) June 28, 2023
Also Read: అవును.. నేనూ ఆ డిప్రెషన్ ఎదుర్కొన్నా.. “కాజల్ అగర్వాల్” కామెంట్స్..!