గత కొంత కాలం నుండి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నారు శ్రీ విష్ణు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉన్న సినిమాలు చేస్తారు. ఇప్పుడు శ్రీ విష్ణు సామజవరగమన సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : సామజవరగమన
- నటీనటులు : శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్.
- నిర్మాత : రాజేష్ దండా
- దర్శకత్వం : రామ్ అబ్బరాజు
- సంగీతం : గోపీ సుందర్
- విడుదల తేదీ : జూన్ 29, 2023
స్టోరీ :
బాలసుబ్రమణ్యం అలియాస్ బాలు (శ్రీ విష్ణు) థియేటర్ లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతని తండ్రి అయిన ఉమామహేశ్వర రావు (నరేష్) కి కోట్ల ఆస్తి ఉన్నా కానీ, తన కొడుకు డిగ్రీ పాస్ అయితేనే అది అతనికి చెందుతుంది అని బాలు తాత వీలునామా రాసి మరణిస్తారు. కానీ ఉమామహేశ్వరరావు డిగ్రీ కూడా పాస్ అవ్వకపోవడంతో వారికి ఆస్తి రాదు. తన తండ్రిని ఎలాగైనా సరే డిగ్రీ పాస్ చేయించాలి అని అనుకుంటాడు బాలు.
తాను ఇబ్బందులు పడుతూనే తండ్రిని చదివిస్తూ ఉంటాడు. బాలుకి ప్రేమ అంటే పడదు. తన తండ్రికి ఎగ్జామ్స్ సమయంలో పరిచయం అయిన సరయు (రెబా మోనికా జాన్) వారి ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా దిగుతుంది. బాలు సరయుతో ప్రేమలో పడ్డాడా? తర్వాత ఏం జరిగింది? తన తండ్రి డిగ్రీ పాస్ అయ్యాడా? బాలు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఈ సినిమా ట్రైలర్ చూశాక ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థం అయిపోతుంది. సినిమాలో కథపరంగా ట్విస్ట్ లు ఉన్న స్టోరీ ఏమీ కాదు. కానీ చూస్తున్నంత సేపు మాత్రం ప్రేక్షకులకి బోర్ కొట్టించకుండా ఎంటర్టైనింగ్ గా నడుస్తుంది. ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఒక చిన్న కుటుంబం, మధ్యతరగతి సమస్యలు అవన్నీ చాలా బాగా చూపించారు.
సినిమా కామెడీ మీద నడుస్తున్నా కూడా చాలా ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో ఉన్న నటీనటులు అందరూ తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. సీనియర్ నటుడు నరేష్ కి ఇలాంటి పాత్రలు పోషించడం కొత్తేమీ కాదు. ఎన్నో రకమైన పాత్రలని ఈజీగా పోషించగల నటుడు నరేష్. ఈ సినిమాలో కూడా ఉమామహేశ్వరరావు పాత్రలో చాలా బాగా నటించారు.
ఒకరకంగా చెప్పాలి అంటే ఈ సినిమాకి పెద్ద హైలైట్ అయ్యారు. ఇంక హీరో శ్రీ విష్ణు కొంచెం వెటకారంతో ఉన్న పాత్రలో సహజంగా నటించారు. హీరోయిన్ రేబాకి తెలుగులో ఇది మొదటి సినిమా అయినా కూడా తన పాత్ర పరిధి మేరకు నటించారు. ఇంక సహాయ పాత్రల్లో నటించిన వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల వీరు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు.
గోపి సుందర్ అందించిన సంగీతం కూడా సినిమాకి తగ్గట్టుగా ఉంది. పాటలు అలా వెళ్ళిపోతాయి అంతే. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్ని సీన్స్ సాగదీసినట్టుగా అనిపిస్తాయి. కామెడీ పరంగా సెకండ్ హాఫ్ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా కొన్ని సీన్స్ మాత్రం నిడివి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటుల పర్ఫార్మెన్స్
- కామెడీ
మైనస్ పాయింట్స్:
- తెలిసిన కథ
- సెకండ్ హాఫ్ లో సాగదీసినట్టుగా ఉండే కొన్ని సీన్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
కథ నుండి పెద్దగా ఆశించకుండా, ఒక కామెడీ సినిమా చూడాలి, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూద్దాం అనుకునే వారికి సామజవరగమన సినిమా ఒక్కసారి చూడగలిగే ఫీల్ గుడ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : “ఈ నగరానికి ఏమైంది” తో పాటు… రిలీజ్ అయ్యి “సంవత్సరాలు” అయినా TV లో టెలికాస్ట్ చేయని 10 సినిమాలు..!