ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా జరుగుతున్న వన్డే సిరీస్ కి తాత్కాలిక కెప్టెన్ గా కొనసాగుతున్న వికెట్ కీపర్ కం బ్యాటర్ కె.ఎల్ రాహుల్ 14 ఏళ్ల తర్వాత అరుదైన ఘనత సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో వన్డేల్లో 1000 పరుగులు సాధించిన వికెట్ కీపర్ గా ఘనత సృష్టించాడు.
14 ఏళ్ల క్రితం ఇదే ఫీట్ ను అప్పటి వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ ఎంఎస్ ధోని సాధించాడు. మళ్ళీ ఇన్నాళ్లకు కేఎల్ రాహుల్ తిరిగి చేసి చూపించాడు.
కాగా సౌత్ ఆఫ్రికా తో మూడో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన భారత్ ఆచి తూచి ఇన్నింగ్స్ ఆడింది. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఇండియా 296 పరుగులు చేసింది సంజు సాంసన్ సెంచరీ తో చెలరేగాడు. తర్వాత బ్యాటింగ్ కి దిగిన సౌత్ ఆఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో 2-1 తేడాతో సీరీస్ ను భారత్ కైవసం చేసుకుంది.
అయితే ఈ వన్డే మ్యాచ్లో సిరీస్ అనంతరం సౌత్ ఆఫ్రికా భారత మధ్య రెండు మ్యాచల టెస్టు సిరీస్ జరగనున్నాయి. డిసెంబర్ 26వ తారీఖున తొలి టెస్ట్ జరగనుండగా 2024 జనవరి 3వ తారీఖున రెండో టెస్టు జరగనుంది. సౌత్ ఆఫ్రికా పైన టి20 సిరీస్ ను, వండే సిరీస్ ను చేసుకున్న భారత సేన ఈ టెస్ట్ సిరీస్ కూడా సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతుంది. మరోవైపు సౌత్ ఆఫ్రికా కనీసం టెస్ట్ సిరీస్ అయిన నెగ్గి పరువు దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంది