రేవంత్ రెడ్డికి 5వ తరగతి అమ్మాయి లెటర్ ఎందుకు రాసింది..? అసలు ఆ లెటర్ లో ఏం ఉంది..?

రేవంత్ రెడ్డికి 5వ తరగతి అమ్మాయి లెటర్ ఎందుకు రాసింది..? అసలు ఆ లెటర్ లో ఏం ఉంది..?

by Mounika Singaluri

Ads

తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తనదైన విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో వరుసగా ఒక్కొక్క గ్యారంటీని అమలు చేసుకుంటూ వస్తూ మాట నిలబెట్టుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ ని ప్రజా భవన్ గా మార్చిన సంగతి తెలిసిందే.

Video Advertisement

ప్రభుత్వం ఏర్పడిన తర్వాతి రోజు నుంచి ప్రజాభవన్‌లో ప్రజావాణి నిర్వహిస్తూ ప్రజా సమస్యలు,అభ్యర్థలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటోంది. ఈ ప్రజావాణికి విశేష స్పందన లభిస్తోంది. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను తీర్చాలంటూ రేవంత్ సర్కారుకు దరఖాస్తు చేసుకుంటున్నారు.

అలాగే గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రతి కార్యక్రమం గురించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకుని వాటిపైన సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఐదో తరగతి విద్యార్థిని ఒక లేఖ రాసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి గుర్తుచేస్తూ ఆ లేఖలు ప్రస్తావించింది.ఐదో తరగతి విద్యార్థిని తన పుట్టిన రోజున గిఫ్ట్‌గా ఓ కోరిక కోరింది.

గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి వ్రాయునది.. సీఎంగా మీరు ఎన్నికైనందుకు శుభాకాంక్షలు. దయచేసి మా ప్రభుత్వ స్కూలుకు ఉచిత విద్యుత్ అందించాలని మనవి.” అని కోరుతూ అంటూ లేఖ రాసింది.రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన 5వ తరగతి విద్యార్థిని అంజలి తన పుట్టిన రోజు సందర్భంగా ఈ లేఖ రాసి సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ చిన్నారి లేఖపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎంతో ధైర్యంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి తన కోరికను తెలియజేసినందుకు చిన్నారిని పలువురు అభినందిస్తున్నారు.


End of Article

You may also like