కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు ఇవే..! ఇవి కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!

కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు ఇవే..! ఇవి కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!

by Mounika Singaluri

Ads

కరోనా వైరస్ ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. యావత్తు ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది కరోనా. రెండు సంవత్సరాలపాటు కరోనా వల్ల అన్ని దేశాలు, ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం కరోనా నుండి తేరుకుని అందరూ యధావిధి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కరోనా కి వ్యాక్సిన్ కనుగొన్న తర్వాత అందరూ వ్యాక్సిన్ వేయించుకోవడంతో కొంతమేర ఊపిరి పీల్చుకున్నారు.

Video Advertisement

అయితే అక్కడక్కడ కరోనా కేసులు నమోదు అవుతున్న కూడా దాన్ని ప్రభావం పెద్దగా లేదు. అయితే ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ వేరియంట్ కి జే.ఎన్.1 అని పేరు పెట్టారు. ఈ వైరస్ తో ప్రస్తుతం కేరళాలో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి.

ఈ వేరియంట్ పై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ప్రజలందరూ మాస్కులు పెట్టుకోవాలని, అలాగే టెస్టింగ్ కిట్లు అన్ని సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఇది కొత్త వేరియంట్ ఉన్నవారికి కనిపించే లక్షణాలను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

covid-19-cases-in-ap

covid-19-cases-in-ap

# జ్వరం, ఒళ్లు నొప్పులు

# జలుబు.. ముక్కు కారడం

# గొంతు నొప్పి

# వాసన-రుచి శక్తిని కోల్పోవడం

# తలనొప్పి

# కొందరిలో కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్య

# వాంతులు, విరేచనాలు

# మరికొందరిలో శ్వాసకోశ సమస్యలు

covid symptoms 1

పై లక్షణాలు పూర్తి స్థాయిలో కనిపించడానికి నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పడుతుంది. ఈ లక్షణాల ఉన్నవారు వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరమని చెబుతున్నారు.


End of Article

You may also like