మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. స్టార్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రచన అందించగా విజయభాస్కర్ డైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించినప్పటికీ అబౌట్ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఈ సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్ కి పెద్ద ఫాన్స్ ఉంటారు.
పల్లెటూరు నుండి వచ్చిన అమాయకుడులా చిరంజీవి నటన అందరికీ గుర్తుండిపోయింది. చిరంజీవికి తోడు సునీల్, బ్రహ్మానందం, వేణుమాధవ్ చేసే కామెడీ అయితే అసలు పొట్ట పగిలిపోతుంది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్లు సమీరారెడ్డి, భూమిక నటించారు. 
మణిశర్మ అందించిన పాటలైతే ఆల్బమ్ మొత్తం హిట్టే. జై జై గణేష పాట అయితే ఇప్పటికి వినాయక మండపాల దగ్గర మారుమోగుతూ ఉంటుంది. టీవీలో జై చిరంజీవి సినిమా ఎప్పుడు వచ్చిన కుటుంబం మొత్తం టీవీకి అతుక్కుపోయి మరి చూస్తూ ఉంటారు.అయితే మీరు ఎన్నిసార్లు జై చిరంజీవ సినిమా చూసిన కూడా మీరు ఎప్పటికీ గమనించని ఒక విషయాన్ని మేము కనిపెట్టాం… అది చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు. అది ఏ సీన్లో అంటే…

సినిమాలో చిరంజీవి అమెరికా వెళ్లడం కోసం భూమికానీ పెళ్లి చేసుకోవడానికి ఒక చర్చికి వెళ్తారు. ఒకపక్క చిరంజీవిని ప్రేమించిన సమీరా రెడ్డి పెళ్లిని చూడలేక ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క చిరంజీవి సమీరా రెడ్డిని ఓదారుస్తూ ఉంటాడు. ఈ ఇదంతా జరుగుతూ ఉంటే ప్రేక్షకులు దృష్టంతా చిరంజీవి సమీరారెడ్డి భూమిక పైనే ఉంది. సరిగ్గా అదే టైంలో చిరంజీవి వెనకాల బ్యాక్ గ్రౌండ్ లో వేణుమాధవ్ చర్చి ఫాదర్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటాడు. అది ఎవరు గమనించరు.

సరిగ్గా ఆ సీను చూస్తే చర్చి ఫాదర్ వేణుమాధవ్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత వేణుమాధవ్ కామెడీగా తిరిగి చర్చి ఫాదర్ కి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాడు. ఈ సీన్ చూసిన ఎవరికైనా సరే నవ్వు ఆగదు అంటే ఒట్టు. మీరు కూడా ఓ లుక్ వేసేయండి ఆ సీన్ పైన…
watch video:



ఈ క్రమంలో ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి రావాల్సి ఉంది. కానీ అతను టైం కి రాకపోవడంతో బంగ్లాదేశ్ టీం అంపైర్‌కు అప్పీల్ చేసింది. అంపైర్ అవుట్ గా ప్రకటించారు. అతను అసలు టైం అవుట్ ఎలా అయ్యాడు అంటే. క్రీజ్ లోకి సమయానికే వచ్చాడు… హెల్మెట్‌ను ధరించే సమయంలో ఓ పట్టీ విరిగిపోయింది. మరొక హెల్మెట్ రావడానికి ఆలస్యం జరిగింది.



ఓవరాల్ గా టీజర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా పెంచేసింది. సంక్రాంతికి భారీ పోటీ నడుమ రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉండగా ఆ టైంలో ఈ కాన్సెప్ట్ మూవీని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి. ఒకవేళ బాగా రిసీవ్ చేసుకుంటే మాత్రం బాక్సాఫీస్ దగ్గర రవితేజ స్టామినా ఏంటో చూపించే అవకాశం లభిస్తుంది. కానీ ఈ టీజర్ చూసిన మాస్ మహారాజా అభిమానులైతే ఫుల్ మీల్స్ అంటూ సంబరపడుతున్నారు. రవితేజ మీసం తిప్పిన లుక్ అయితే అద్భుతంగా ఉంది.






డ్రెస్సింగ్ రూమ్ లో “యువర్ ది బెస్ట్ క్రికెట్ ఇస్ మై ఫస్ట్ లవ్” అన్న కొటేషన్లతో ఆటగాళ్లను మోటివేట్ చేస్తున్నారు. రాహుల్ ద్రావిడ్ లాంటి అనుభవం ఉన్న కోచ్ టీమిండియా కి ఎంతగానో కలిసి వస్తుంది. ఆయన వ్యూహాలు రచించడం ఆయన అనుభవం టీం కి ఉపయోగపడుతుంది. అలాగే ఆటగాళ్లకి మానసిక, శరీరక విశ్రాంతి అవసరం అంటూ టీం మేనేజ్మెంట్ తో కలిసి పూర్తి స్వేచ్చ ఇస్తున్నారు.దాని ప్రతిఫలం ఆటగాళ్ల ఆటతీరులో కనిపిస్తుంది.
