హీరోయిన్, గ్లామర్ ఇవి రెండు పర్యాయపదాలు.. గ్లామర్ గా ఉంటేనే హీరోయిన్ గా అవకాశాలు అనేది జగమెరిగిన సత్యం..కానీ ఇటీవల కొంతమంది హీరోయిన్లు అలాంటి స్టీరియో టైపిక్ విషయాల్ని కొట్టిపారేస్తున్నారు..తమకి నచ్చినట్టుగా ఉండడం మాత్రమే కాదు, డీగ్లామర్ పాత్రల్లో నటించడానికి సై అంటున్నరు..అలా హీరోయిన్స్ పోషించిన కొన్ని డీగ్లామర్ రోల్స్..
#1. ఐశ్వర్య రాజేష్
దివంగత నటుడు రాజేశ్ కుమార్తే ఈ ఐశ్వర్య..నటి శ్రీలక్ష్మికి స్వయానా మేనకోడలు..చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడంతో కుటుంబబారాన్ని తన భుజాలపై వేస్కుంది.అందుకే తను పోషించే పాత్రల్లో జీవం ఉంటుంది..తన కళ్లల్లో ఏదో సాధించాలన్ని కసి ఉంటుంది.తమిళంలో ఎక్కువగా నటించిన ఐశ్వర్య..ఇటీవల వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ సరసన నటించి మంచి మార్కులే కొట్టేసింది.. కౌసల్యా క్రిష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ రెండింటిలో కూడా ఐశ్వర్య డీగ్లామర్ రోల్స్ లో నటించి మెప్పించింది..
#2. సమంత
రంగస్థలం సినిమాలో ప్రతి పాత్రా అందరికి గుర్తుండిపోతుంది..అందులో రామలక్ష్మిగా నటించిన సమంతా తన ఫ్యాన్స్ కి మాత్రమే కాదు సినిమా ప్రేక్షకులందరికి నచ్చేసింది..పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అన్నట్టుగా సాగుతున్న సమంతా సినిమా కెరీర్లో రంగస్థలం రామలక్ష్మి పాత్ర ఒక ప్రత్యేక స్థానం.. అలాగే తాజాగా విడుదలైన ది ఫామిలీ మాన్ సిరీస్ లో కూడా సమంత డీ గ్లామర్ పాత్రలో నటించారు.
#3. తమన్నా
మిల్కీ బ్యూటి తమన్నా..అభినేత్రి,బాహుబలి రెండు సినిమాల్లో డీ గ్లామర్ రోల్స్ లో నటించింది.అభినేత్రి సినిమాలో గ్లామర్ డాల్ గా, పల్లెటూరి భార్యగా ద్విపాత్రాభినయం చేసిన తమన్నా..రెండు పాత్రల్లోనూ ప్రేక్షకులను మెప్పించింది బాహుబలిలో కూడా రెండు పాటల్లో మినహా సినిమా అంతా తమన్నా డిఫరెంట్ మేకప్ తో తన మిల్కీవైట్ స్కిన్ దాచిపెట్టేసి డీగ్లామర్ రోల్ పోషించింది. ఎందుకంటే ప్రేమంట చిత్రంలో కూడా తమన్నా ద్విపాత్రాభినయం చేసింది..ఒకటి గ్లామర్ డాల్..మరోకటి పల్లెటూరి అమ్మాయి పాత్ర..
#4. అనుష్క
ప్రయోగాలకు పెట్టింది పేరు అనుష్క..ఎలాంటి పాత్రనైనా సునాయసంగా చేయడమే కాదు..పాత్రకోసం తగిన విధంగా తన శరీరాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటుంది..పాత్ర డిమాండ్ చేస్తే అందవిహీనంగా కనపడడానికి కూడా వెనకాడదు అనుష్క.బాహుబలి సినిమాలో అమ్మ క్యారెక్టర్లో డీ గ్లామర్ గా చూసిన అనుష్కని మొదట్లో ఎవరూ యాక్సెప్ట్ చేయనప్పటికి,తన నటనతో అందరిని కట్టిపడేసింది దేవసేన..
#5. అమలాపాల్
ప్రేమఖైది చిత్రం ద్వారా పరిచయం అయిన అమలాపాల్ ..తన తొలిచిత్రంలోనే డీ గ్లామర్ రోల్ పోషించింది. ఆ సినిమాలో జిడ్డు ముఖంలా కనిపించడంకోసం అమలాకి మేకప్ బదులుగా ఆయిల్ వాడారని సమాచారం..
#6. సంజనా
తెలుగులో అడపా దడపా సినిమాలు చేసిన సంజనా డీ గ్లామర్ రోల్ పోషించిన చిత్రం దండుపాళ్యం 2.ఈ సినిమాలో ఎలాంటి మేకప్ లేకుండా నటించింది సంజనా.ఇదే సినిమాలో సంజన న్యూడ్ గా నటించిందనే వార్తలు గుప్పుమన్నాయి..
#7. రాధికా ఆప్టే
లేట్ గా కెరీర్ స్టార్ట్ చేసినా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే.. రక్త చరిత్ర సినిమాలో రాధికా ఆప్టే సాధారణ గృహిణిగా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో హెవీ మేకప్ లేకుండా కేవలం తన నటనతోనే కట్టిపడేసింది రాధికా.
#8. రితిక
గురు సినిమాలో బాక్సర్ గా పరిచయం అయిన నటి రితిక..ఈ సినిమాలో రాముడుగా చేపలు అమ్మే అమ్మాయిలాగా, బాక్సర్ లాగా డీగ్లామర్ రోల్లో కనిపించి అందరిని ఆకట్టుకుంది.
#9. అమ్రితా అయ్యర్
నీలి నీలి ఆకాశం పాట ఎంత ఫేమస్ అయ్యిందో అందరికి తెలిసిందే. బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా నటిస్తున్న చిత్రం “30 రోజుల్లో ప్రేమ”. ఆ సినిమాలో నీలి నీలి ఆకాశం సాంగ్ లో పల్లెటూరి అమ్మాయిగా కన్పించింది అమ్రితా.
#10. కీర్తి సురేష్ – saanikaayidham
#11. పాయల్ రాజపుట్ – అనగనగ ఓ అతిధి
#12. హెబా పటేల్ – ఓదెల రైల్వే స్టేషన్
#13. రష్మిక మందాన – పుష్ప