ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎక్కువ పాపులారిటీ పొందిన ఫ్రాంచైజీ లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒకటి. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు. కానీ మూడు సార్లు రన్నరప్ గా నిలిచారు. ఐపీఎల్ 2023 లో విరాట్ కోహ్లీ,  మాక్స్ వెల్ కి తోడుగా డుప్లెసిస్, దినేష్ కార్తీక్ కూడా యాడ్ అయ్యారు . మరి ఈసారి అయినా కప్ కొడతారో లేదో చూడాలి.

Video Advertisement

ఇది ఇలా ఉంటె…2008 లో విజయ్ మాల్యా ఆర్‌సిబి ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, కొన్ని సమస్యల కారణంగా, విజయ్ మాల్యా జట్టు ఓనర్ గా తన స్థానాన్ని వదులుకోవలసి వచ్చింది. తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం మారింది. ద క్రికెట్ లాంజ్ కథనం ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓనర్లు యునైటెడ్ స్పిరిట్స్. యునైటెడ్ స్పిరిట్స్ ఒక ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీ.

vijay mallya

యునైటెడ్ స్పిరిట్స్ లండన్ కు చెందిన డియాజియోకు సబ్సిడరీ సంస్థ. యునైటెడ్ స్పిరిట్స్ ప్రధాన కార్యాలయం బెంగళూరులోని యు బి టవర్ దగ్గర ఉంది. యుఎస్ఎల్ (యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్) స్టాక్ ఎక్స్చేంజ్ లో, డియాజియో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మరియు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్ట్ అయ్యాయి.

anand kripalu

సంజీవ్ చురివాలా ఈ ఫ్రాంచైజీ కి ఛైర్మన్ ‌గా ఉండేవారు. కానీ డియాజియో ఇండియా సీఈఓ ఆనంద్ కృపాలు ఇప్పుడు ఆయన స్థానంలో ఉన్నారు. 2019 లో డియాజియో నెట్ ఇన్కమ్ 3.337 బిలియన్ పౌండ్లు.

డియాజియో సంస్థ 2019 సంవత్సరంలో లాభాలను పొందింది. అయితే, 2018-19 ఆర్థిక సంవత్సరంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్ ద్వారా యునైటెడ్ స్పిరిట్స్ INR 143 కోట్లు సంపాదించింది. తర్వాత సంవత్సరం ఈ సంఖ్య 313 కోట్లకు పెరిగింది.