సంగీత ప్రపంచంలో ప్రస్తుతం తమన్ పేరు మార్మోగుతోంది. ఈయన 1983 నెల్లూరులో జన్మించారు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంత పేరు సంపాదించడం వెనుక చాలా కష్టం ఉందని ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారట. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా మంచి మనసు, దయా గుణం ఉన్న వ్యక్తి అని చెప్పవచ్చు.
ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేసి చాలా పేరు సంపాదించారు. 13 ఏళ్ళ వయసులోనే నాన్నను పోగొట్టుకున్న తమన్ చదువుకు స్వస్తి చెప్పి సంగీతాన్ని తన కెరీర్ గా ఎంచుకున్నాడు.

అలా అంచెలంచలుగా కష్టపడుతూ ఎదిగాడు. ఆయన ఎదగడమే కాకుండా పది మందికి ఎప్పుడు ఆసరాగా ఉంటాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన ప్రస్తుతం తెలుగు ఇండియన్ ఐడల్ అనే ప్రోగ్రాం లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆ ప్రోగ్రాంలో రేణు కుమార్ అనే కంటెస్టెంట్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబ నేపథ్యం గురించి ఆవేదన చెందుతూ చెప్పారు. కంటెస్టెంట్ రేణు కుమార్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అని, కనీసం అతని కొడుకుకు స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో స్కూల్ మన్పించానని ఆవేదనతో చెప్పాడు.

ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చాలా బాధ పడుతూ నేను కూడా ఆర్థిక పరిస్థితుల వల్ల ఐదో తరగతిలో చదువు మానేశానని, ఆ సమయంలో మా నాన్న చనిపోవడంతో కుటుంబ పరిస్థితులు నాపై పడ్డాయని అందువల్ల నేను చదువుకు దూరం అయ్యానని బాధపడుతూ చెప్పాడు. అలా డబ్బు లేకుండా చదువుకు దూరం అయ్యే వారికి భరోసా ఇస్తానని అన్నాడు. అనంతరం రేణు కుమార్ కొడుకు చదువు కొరకు మూడు సంవత్సరాలు భరోసాగా ఉంటానని నువ్వు ఏం బాధపడవద్దు అని ధైర్యాన్ని కల్పించారు తమన్. దీంతో ఆ స్టేజ్ అంత ఆనందభాష్పాలతో, విజిల్స్ తో నిండిపోయింది.














































కోయంబత్తూరు సోమయం పాల్యంకు చెందినటువంటి ప్రశాంత్.. రఘునాథ పురానికి చెందినటువంటి హెచ్.తేజస్విని ఒక ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. వీరు గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని చాలా దగ్గర అయిపోయారు. అది ఎంతలా అంటే ఒకరికొకరు ఏదైనా చేసే అంత.
ఈ క్రమంలో ప్రశాంత్ ఆన్లైన్ బెట్టింగ్స్ కు చాలా అలవాటు పడ్డాడు. వాటి కోసం పదిహేను లక్షల రూపాయల వరకు అప్పు చేసి బెట్టింగ్ లో పోగొట్టుకున్నాడు. దీంతో అప్పిచ్చిన వాళ్లంతా ప్రశాంత్ పై ఒత్తిడి చేయడంతో ఆ విషయాన్ని తన లవర్ తేజస్వికి చెప్పుకున్నాడు. దీంతో ఇద్దరూ ఎలాగైనా మనీ సంపాదించాలని ఈజి మని కోసం దొంగతనాల బాటపట్టారు. తేజస్వినికి స్కూటీ కూడా ఉంది. ఆ బండి పై తొండమూత్తూరు వైపు వెళ్లారు.
అక్కడ ఫైర్ స్టేషన్ సమీపంలో మేకలు కాస్తున్న వృద్ధురాలి దగ్గరికి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వెళ్లారు. ఆ ముసలావిడను అడ్రస్ అడిగినట్టే అడిగి మెడ నుంచి గోల్డ్ చైన్ లాక్కొని స్కూటీపై ఇద్దరు పరారయ్యారు. దీంతో ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి సీసీ ఫుటేజ్ పరిశీలించి తమదైన శైలిలో విచారణ చేపట్టి తేజస్విని బైక్ నెంబర్ ను గుర్తించారు. దాని ఆధారంగా అడ్రస్ పట్టుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
పోలీస్ స్టైల్ లో విచారించగా జరిగిన విషయం అంతా ఒప్పుకున్నది. కొన్ని నెలల కిందట ప్రశాంత్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారం కూడా కనిపించడం లేదని ప్రశాంత్ తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విచారణలో ప్రశాంత్ ఆ బంగారాన్ని దొంగిలించినట్లు కూడా తేలింది. ఈ డబ్బంతా ఆన్లైన్ బెట్టింగ్ లో పెట్టి పోగొట్టుకున్నామని ప్రశాంత్ తెలియజేశాడు. దీంతో ఇద్దరిని కోర్టులో హాజరు పరిచారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ప్రశాంత్ మరియు తేజస్విని తల్లిదండ్రులు ఇద్దరు బడా వ్యాపారస్తులే..
3 వికెట్లు తీసి ఆర్సిబి విజయంలో కీలక పాత్ర పోషించిన హర్షల్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టుకు శుభారంభం దక్కింది.కోహ్లీ (30),డుప్లేసిస్ (38) దూకుడుగా ఆడటంతో ఆర్సిబి పవర్ ప్లే లో వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. అనంతరం మొయిన్ అలీ వరుస ఓవర్లలో డుప్లేసిస్, కోహ్లీ లను అవుట్ చేశాడు. ఫస్టాఫ్ లో బ్యాటింగ్ కు వచ్చిన మ్యాక్స్ వెల్ (3)రనౌట్ గా వెనుతిరిగి నిరాశపర్చగా.. లామ్రోర్ బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్ ఆడాడు.



















మొదటి నుంచి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న కొరటాల శివ చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ఆచార్య డిజాస్టర్ గా నిలిచింది. ఇందులో ముఖ్యమైన పాత్ర రామ్ చరణ్ కాబట్టి కొరటాల శివ కూడా బోయపాటి తరహాలోనే రామ్ చరణ్ తో చేసి బోల్తా పడ్డారని గుసగుసలు మొదలయ్యాయి.