కాన్వే ముందు నుండి ఉండుంటే చెన్నై ప్లే ఆప్స్ కి వెళ్ళేది అనుకుంటా.? మరి అతన్ని టీం లో ఎందుకు తీసుకోలేదు.?

కాన్వే ముందు నుండి ఉండుంటే చెన్నై ప్లే ఆప్స్ కి వెళ్ళేది అనుకుంటా.? మరి అతన్ని టీం లో ఎందుకు తీసుకోలేదు.?

by Sunku Sravan

చెన్నై దాదాపుగా ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్నట్లు అయిపోయింది. అయితే ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో మూడు మాత్రమే విజయం సాధించి మిగతా అన్ని పరాజయం పాలయింది. రాయల్ చాలెంజ్ బెంగుళూరు జరిగిన కీలక మ్యాచ్ లో చెన్నై పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో చెన్నైకి అన్ని దారులూ మూసుకు పోయాయి. ఏడు ఓటములను చవిచూసిన చెన్నై ప్లే ఆప్స్ ఆశలు గల్లంతయ్యాయి. చెన్నై అంతగా వెనకబడి పోవడానికి కారణం జట్టులో కోఆర్డినేషన్ లేకపోవడమే.

Video Advertisement

ముఖ్యంగా అందులో స్టార్టింగ్ మ్యాచ్ ల్లో కాన్వే లేకపోవడం కూడా ఒక మైనస్ అని చెప్పవచ్చు. అయితే రుతురాజు మరియు కాన్వే కలిసి ఓపెనింగ్స్ లో అదరగొట్టారు. వీరు పర్ఫామెన్స్ మొదటినుంచి ఉండి ఉంటే ప్లే ఆప్ కి సిఎస్ కే వెళ్లగలిగేది అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్లు రూతురాజ్ మరియు కాన్వే పోటీపడి ఒక ఓవర్ కి రెండు ఫోర్ల చొప్పున బాదారు. ఆరవ ఓవర్లో తల ఒక సిక్సర్ బాదడంతో పవర్ ప్లే లో సిఎస్ కె 51/0 తో దూసుకెళ్లింది.

కానీ ఏడవ ఓవర్లో ఒక ఫ్లాట్ బాల్ ను ఆడ బోయి రుతురాజ్ అవుట్ అవ్వడంతో తొలి వికెట్ 54 రన్స్ వారి పార్ట్నర్ షిప్ బ్రేక్ అయింది. ఇదే ఓవర్లో కాన్వే ఫోర్ కొట్టిన తర్వాతి ఓవర్లో చెన్నై కి ఊహించని ఝలక్ తగిలింది. 33 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేసిన కాన్వే 15వ ఓవర్లో అవుట్ అవడంతో ఆర్సిబి రేసులోకి వచ్చింది. ఈ ఓవర్ లో ఆలీ సిక్స్ కొట్టి చెన్నై పై ఒత్తిడి తగ్గించారు. అయితే 16వ ఓవర్లో జడేజా (3) కొట్టి అవడంతో మళ్లీ చెన్నై పై ఒత్తిడి పెరిగింది .

చివరి 24 బాల్స్ లో యాభై రెండు చేయాల్సిన దశలో ఆలీ ఔట్ చేసి చెన్నైని దెబ్బ కొట్టారు. ఈ విధంగా ఫస్టాఫ్ మ్యాచుల్లో కాన్వే గనుక ఉన్నట్లయితే చెన్నై ఈ విధంగా ఉండేది కాదు. రుతురాజు మరియు కాన్వే రెండు మ్యాచుల్లో ఓపెనింగ్స్ ఇచ్చి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మొదటినుంచి కాన్వే ఉంటే మాత్రం సిఎస్ కే పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే కాన్వే అతని మ్యారేజ్ అని చెప్పి సౌత్ ఆఫ్రికా లోనే ఉన్నాడు . అందుకే అతను ఫస్టాఫ్ సీజన్లో అందుబాటులో లేడు.

 


You may also like