విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమా విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియన్ సినిమా. అంతకు ముందు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్, అలాగే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదలయ్యాయి. కానీ లైగర్ సినిమా మాత్రం పూర్తి స్థాయి పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది.
పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, చార్మి, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. తాజాగా లైగర్ సినిమా టీం ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షో కి వచ్చారు. పూరి తో పాటు విజయ్ దేవరకొండ చార్మి కూడా సందడి చేశారు.

ఈ షో లో బాలకృష్ణ విజయ్ దేవరకొండకి సంబంధించిన ఒక వీడియోని ప్లే చేయించారు. అందులో విజయ్ దేవరకొండ బాల నటుడిగా నటించాడు. ఈ వీడియో ప్లే చేసే సరికి పూరి జగన్నాథ్ ఆశ్చర్యపోయారు. విజయ్ ఇలా నటించడం తనకు తెలియదని పూరి చెప్పారు.

అప్పుడు విజయ్ దేవరకొండ ఆ వీడియో పుట్టపర్తి సాయిబాబా పై తీసిన సీరియల్ లోనిది అని చెప్పారు. అయితే అందులో నటించింది నేనే కానీ వాయిస్ నాది కాదు అని ఆ వీడియో వెనుక ఉన్న కధని మొత్తం చెప్పారు విజయ్. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
































