సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా అక్కడి పెద్దలు రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆ సమయంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు జోగిని స్వర్ణలతను ఆవహించి ఎవరు చేసుకున్నది వారు అనుభవించక తప్పదు. కరోనాపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.భక్తి భావనతో ఐదు వారాలు శాక పోసి, యజ్ఞాలు చేయించండి.నా ప్రజలందరినీ కాపాడుకుంటాను అలాగే వారిని సుఖసంతోషాలతో చూస్తానని మాటిస్తున్నాను. గంగాదేవికి జలాలతో అభిషేకం, బోనం చేయండి అని భవిష్య వాణి వినిపించారు.
Megha Varna
మొగుడు కార్ లో వేరే అమ్మాయితో వెళ్తున్నాడని భార్య భర్తను రోడ్లో అందరి ముందు ఏం చేసిందో తెలుసా!
కరోనా మొదలైనప్పటి నుండి అక్రమ సంబంధాల చిట్టా రోజుకు ఒకటి బయటకు వస్తుంది.తాజాగా ముంబైలో తన భర్తకు అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భార్య భర్త రేంజ్ రోవర్ కార్ లో వేరే అమ్మాయితో వెళ్తున్నట్టు గమనించి ఆ కార్ వెనకాలే వెళ్ళింది.ముంబైలోని పెద్దార్ రోడ్డు సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడగానే వెంటనే భర్త కార్ దగ్గరకు వచ్చి ఆ కార్ బోనెట్ పై కూర్చొని తన భర్త కార్ లో నుండి బయటకు రావాలని డిమాండ్ చేసింది.

కార్ లో ఉన్న భర్త వెంటనే కార్ దిగి బయటకు వచ్చాడు.అతని భార్య అతడిని కాళ్ళతో కొట్టింది.ఈ టైంలో సిగ్నల్ పడడంతో కార్ లో ఉన్న మహిళ అక్కడి నుండి తప్పించుకోవాలని ప్రయత్నించింది.కాని భార్య ఆమెను ఆపి బయటకు లాగి కొట్టడానికి ప్రయత్నించింది.అప్పటికే అక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ట్రాఫిక్ పోలీసులు ముగ్గురిని కార్ తో సహా స్టేషన్ కు తరలించారు.ట్రాఫిక్కు అంతరాయం కలిగించినందుకు సదరు మహిళకు చలాన జారీ చేశాం…’’ అని ట్రాఫిక్ ఏసీపీ ప్రవీణ్ పద్వాల్ వెల్లడించారు
కరోనా పుణ్యనా జనాలు కలుసుకోవడానికి చేయి చేయి కలపడానికి భయపడిపోతున్నారు. పాపం ఎప్పుడూ చట్టాపట్టాలేసుకోని తిరగేసే లవర్స్ కూడా అటు కలుసుకోలేక ఇటు దూరంగా ఉండలేక కరోనా దెబ్బ సతమతమైపోతున్నారు. ఈ ఎడబాటును తట్టుకోలేని ఓ జంట తాజాగా ఓ వింత పనిని చేశారు.ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇంతకీ దాని కథేంటో ఇప్పుడు చూద్దాం.బ్రెజిల్ కు చెందిన టెర్సియో గల్డినో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఇబ్బంది పడేవాడు.దాని నుండి డాక్టర్ల ట్రీట్మెంట్ ద్వారా కొద్దిరోజుల క్రితం బయటపడ్డాడు.ప్రస్తుతం తనకి దొరికిన ఖాళీ సమయంలో భార్య అలీసియా లీమా తో కలిసి
బీచ్ లో తిరగాలని అనుకున్నాడు.ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న తను ప్రస్తుత పరిస్థితులలో కరోనా సోకకుండా ఉండడానికి బీచ్ కు స్పేస్ సూట్ లో వెళ్ళాడు.అది చూసిన అక్కడ జనులంతా తమ కెమెరా లకు పని చెప్పారు.ఆతర్వాత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు.మీరు కూడా ఆ ఫోటో పై ఓ లుక్ వేయండి.
https://www.instagram.com/p/CCjB95Oh_3e/?igshid=18f44ksvf1vaj
వివాదాలకు కేంద్ర బిందువైన ఆర్జీవీ కరోనా టైంలో కూడా ఫుల్ గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.తాజాగా ఆయన పవర్ స్టార్ అనే చిత్రాన్ని చేస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను స్వయంగా అర్జీవీ తన ట్విట్టర్ ఖాతా లో విడుదల చేశాడు.ఈ చిత్రాన్ని జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలలో ఆర్జీవీ బాగా బిజీగా ఉన్నాడు.

ఇలాంటి టైంలో ఫిల్మ్ సర్కిల్స్ లో త్వరలో ఆర్జీవీ మైక్ వదిలి మేకప్ వేసుకోబోతున్నాడు అనే వార్త చక్కెర్లు కొడుతుంది.అవునండీ మీరు విన్నది నిజమే ఆర్జీవీ తను చేస్తున్న పవర్ స్టార్ చిత్రంలో ఒక పాత్ర చేయబోతున్నారట.ఆ క్యారక్టర్ పవన్ వీరాభిమాని ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ను పోలి ఉంటుందట.

తన దర్శకత్వంలో వచ్చిన సినిమాలతో ఎప్పుడు సంచలనాలు సృష్టించే ఆర్జీవీ తాజాగా తన నటనతో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో వేచి చూడాలి.
మూడువేలు కోసం వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిని ఏమి చేశాడో తెలుసా…?
తూర్పగోదావరిజిల్లా దెందులూరు మండలం నాగులదేవుపాడుకు చెందిన గుజ్జుల సందీప్ ఆటో డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు.అతను అక్కిరెడ్డిగూడెం కు చెందిన అనూష అనే యువతి తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.కొద్దిరోజుల క్రితం అనూష అవసరం కోసం సందీప్ వద్ద మూడు వేల రూపాయిల అప్పు తీసుకుంది.వాటి గురించి సందీప్ ఎన్నిసార్లు అడుగుతున్న అనూష విషయాన్ని దాట వేస్తూ వచ్చింది.

జూలై 1 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అనూష ఫోన్ చేసి సందీప్ ను 7 వ మైలు దగ్గరకు రమన్నది.సందీప్ వెంటనే ఆగమేఘాల మీద అక్కడికి వెళ్ళాడు.అక్కడున్న ఇసుక దిబ్బల వద్ద కొంత సమయం గడిపాక ఆ 3 వేల రూపాయల పై ఇద్దరు మధ్య మాటల యుద్ధం జరిగింది.దానికి కోపంతో ఊగిపోయిన సందీప్ ఆమెను చున్నితో బలంగా ముడి వేసి చంపేసాడు. ఆమె వద్ద ఫోన్ మరియు ఆమె వస్తువులు తీసుకొని అక్కడి నుండి పారిపోయాడు.స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలిస్తున్నారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా అక్కడి పెద్దలు రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆ సమయంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు జోగిని స్వర్ణలతను ఆవహించి ఎవరు చేసుకున్నది వారు అనుభవించక తప్పదు. కరోనాపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.భక్తి భావనతో ఐదు వారాలు శాక పోసి, యజ్ఞాలు చేయించండి.నా ప్రజలందరినీ కాపాడుకుంటాను అలాగే వారిని సుఖసంతోషాలతో చూస్తానని మాటిస్తున్నాను. గంగాదేవికి జలాలతో అభిషేకం, బోనం చేయండి అని భవిష్య వాణి వినిపించారు.
సెహ్వాగ్ పెట్టిన మంచు కేక్ కటింగ్ వీడియో ….తెగ వైరల్ అవుతుంది..
దేశ సంరక్షణ కోసం కుటుంబాలకు దూరంగా ఉంటూ బోర్డర్ లో పగులు రాత్రి తేడా లేకుండ నిరంతరం శ్రమిస్తూ జిత్తుల మారి నక్కలాంటి శత్రువులతో పోరాడుతున్న భారత సైనికులకు సంబంధించిన ఒక సంచలనాత్మక వీడియోను తాజాగా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

వివరాలలోకి వెళ్తే ఈ వీడియోలో ఒక సైనికుడు తన పుట్టినరోజు సందర్భంగా తన సహచరులు తయారు చేసిన మంచు కేక్ ను కట్ చేశాడు. ఆ వీడియోను ఒక చక్కటి క్యాప్షన్ తో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్ లో ఇలా పోస్ట్ చేశాడు.
A soldier celebrating his birthday.
Forget cheese cake, the beauty of a Snow cake, which only a soldier knows.
No word are enough to describe their sacrifices and resilience. pic.twitter.com/sr5xGSdUNU— Virender Sehwag (@virendersehwag) July 12, 2020
నాగబాబు గత కొద్దిరోజుల నుండి అతి సెన్సిటివ్ విషయాలు మీద మాట్లాడుతూ వివాదాలలో చిక్కుకుంటున్నారు.గతంలో గాంధీని ప్రేమించి అభిమానించిన గాడ్ సే ఆయనే స్వయంగా ఎందుకు చంపారు అన్న అంశంపై చర్చ జరగాలని మాట్లాడిన నాగబాబు తాజాగా రజినీకాంత్ దేవుడి పై చేసిన కామెంట్స్ పై స్పందించారు.

ప్రస్తుతం నాగబాబు దేవుడి పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.నాగబాబు దేవుడి పై చేసిన కామెంట్స్ పై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.అసలు నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు చూద్దాం.

ట్వీట్ 1: ఒకప్పుడు superstar రజనీకాంత్ గారు చెప్పారు,,అది ఏంటంటే మన కంటికి కనబడే ఏదయినా ఎవరో ఒకరు create చేసిందే అయివుంటది. లేకపోతే ఆ వస్తువు కి ఉనికి ఉండదు.అలాగే ఇంత విశాల విశ్వం కూడా ఉనికి లో ఉందంటే ఎవరోఒక క్రియేటర్ వుండే ఉండాలి.అతడే భగవంతుడు అని చాలా గంభీరంగా చెప్పారు…

ట్వీట్ 2:ఉనికి లో ఉందంటే దానికి ఒక క్రియేటింగ్ రీసన్ వేరే ఉండాలి.ఆ రీసన్ దేవుడిని create చేసి ఉండాలి.అలాగే ఆ దేవుడిని create చేసిన రీసన్ కి ఇంకో రీసన్ ఉండాలి.సో అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే అంతు పొంతూ ఉండదు

ట్వీట్ 3:సో గాడ్ అనే కాన్సెప్ట్ కి మీనింగ్ ఏది లేదు.సో లెట్స్ లివ్ our lives వితౌట్ the ఇన్వొల్వెమెంట్ of గాడ్ కాన్సెప్ట్..nietzsche చెప్పినట్లు దేవుడు చనిపోయాడు.దానికి వర్రీ చెందాల్సిన అవసరం లేదు, దేవుడిపై ఆధారపడకుండా కేవలం చట్టాలకు న్యాయలకు అనుగుణంగా బ్రతకాలి” అంటూ నాగబాబు సరికొత్తగా ట్వీట్ చేశారు.
ప్రియుడితో కలిసి ఎంత ప్లాన్ వేసింది? భర్తను చంపేసి కరోనా అని భార్య డ్రామా
కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది అక్రమ సంబంధాల గుట్టు రట్టు అవుతుంది.వీటి ఫలితంగా ఎంతోమంది సంసారాలు నాశనం అవుతున్నాయి.తాజాగా ఒడిశాలో ఇలాంటి ఓ అక్రమ సంబంధం గుట్టు రట్టయింది.

వివరాలలోకి వెళ్తే ఒడిశాలో నివాసముంటున్న శరత్ దాస్ (45),అనిత దాస్(35) దంపతులు జీవనోపాధి కోసం నోయాడలో స్థిరపడ్డారు.వీరిద్దరికీ పెళ్ళయ్యి దాదాపు 15 ఏళ్లు అవుతుంది.వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు.అనిత దాస్ గత కొంతకాలంగా అదే ప్రాంతంలో ఉంటున్న సంజయ్(32)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

విషయం తెలుసుకున్న భర్త శరత్ దాస్ ఈ విషయం పై తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు.అయినప్పటికీ అనిత ప్రవర్తన లో మార్పు రాలేదు పైగా తనని అస్తమానం నిలదీస్తున్న తన భర్త ను అంతం చేయాలని నిర్ణయించుకుంది.అందులో భాగంగా మే 1వ తేదీ రాత్రి అనిత, సంజయ్ కలిసి శరత్ గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతని ముఖం పై దుప్పటి పెట్టీ అతనికి ఊపిరాడకుండా చేసి చంపేశారు.

పొద్దునే లేచి తనకేం తెలియనట్టు కరోనా వచ్చి భర్త చనిపోయాడని దొంగ ఏడుపులు ఏడ్చింది.ఆమె గురించి పూర్తిగా తెలిసిన శరత్ బంధువులు,చుట్టుపక్కల వాళ్ళు రాత్రికి రాత్రి ఆరోగ్యంగా ఉన్న శరత్ ఎలా చనిపోయాడు అనే అనుమానంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు.కంప్లైంట్ తీసుకున్న పోలీసులు వెంటనే శరత్ మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించారు.దానితో అసలు కథ బయటపడింది.నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు.
” రాధే శ్యామ్” తో ప్రభాస్ సిస్టర్ సినిమాల్లోకి గ్రాండ్ ఎంట్రీ?
రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారుసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ బాహుబలి చిత్రంతో ప్రస్తుతం ఇండియా టాప్ స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు.ప్రస్తుతం ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ‘రాధే శ్యామ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్రం టీమ్ తాజాగా విడుదల చేసింది.ఆ లుక్ పై మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర టీం అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.


ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ మరియు ‘గోపికృష్ణ మూవీస్’ బ్యానర్ పై కృష్ణంరాజు గారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రంతో కృష్ణంరాజు గారు తన పెద్ద కుమార్తె ప్రసీదను ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో అరంగేట్రం చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కేవలం ఈ సినిమాకి మాత్రమే కాకుండా ప్రసీద ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కోసం సినిమాలను, వెబ్ సిరీస్లను కూడా నిర్మించడానికి సిద్దమౌతుందట.ఈ విషయంలో ప్రసీద కు పూర్తి సహకారం అందించడానికి ప్రభాస్ సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
