ఐకాన్ స్టార్ రీయల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు. ఓ మెరిట్ స్టూడెంట్‌కు అండగా నిలిచాడు బన్నీ. వివరాలను చూస్తే.. ఆమె కేరళ అమ్మాయి. నర్సింగ్ చదవాలని అనుకుంది. కానీ డబ్బులు లేకపోవడంతో చదవలేనేమో అనుకుంది.
కానీ కలెక్టర్ వి.ఆర్.కృష్ణ తేజ ఫేస్ బుక్ ద్వారా అల్లు అర్జున్‌కి ఈ విషయాన్ని చెప్పగా.. నాలుగేళ్ల పాటు ఈ అమ్మాయి చదువు ఖర్చు, హాస్టల్ ఫీజులకు కావాల్సిన సాయాన్ని ఇస్తానని చెప్పారు.
కలెక్టర్ అల్లు అర్జున్‌కి ధన్యవాదాలను చెప్పారు. ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.ఈ అమ్మాయికి ఇంటర్ మీడియట్లో 92 శాతం మార్కులు వచ్చాయట. అయితే ఈమె తండ్రి కరోనా కారణంగా గత ఏడాదే చనిపోయారు. ఈ విషయాలని కూడా ఐకాన్ స్టార్ తో కలెక్టర్ చెప్పారు. బన్నీ ఆమె పరిస్థితి చూసి సహాయం అందిస్తానని చెప్పారు.
ఇదిలా ఉంటే “పుష్ప: ది రైజ్” సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా రెండవ భాగమైన “పుష్ప: ది రూల్” పైన అంచనాలు రోజు రోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ వర్క్ చేస్తోంది. షూటింగ్ ని బ్యాంకాక్ లో చేస్తారట. వచ్చే వారం నుండి బ్యాంకాక్ లో పుష్ప రెండవ భాగం షూట్ చెయ్యనున్నారు.