చాణక్యుడు ఎంతటి మహా జ్ఞానో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు.
చాణక్య నీతి ప్రతి అంశాన్ని కూడా ఎంతో అద్భుతంగా వివరించింది. చాణక్యుడు స్నేహితుల గురించి కూడా ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. వాటిని కనుక అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం లో ముందుకు వెళ్ళిపోవచ్చు. చాణక్య జీవితాంతం ఆనందంగా ఉండేందుకు కొన్ని విషయాలను చెప్పారు. ఇవి ఆచరించేందుకు కష్టంగా వుంటాయని… కానీ ఆచరిస్తే జీవితాంతం ఆనందంగా ఉండేందుకు అవుతుంది అని అన్నారు. మరి అవేమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
#1. మీ బలహీనత గురించి ఎవరికీ చెప్పకండి:
ఎప్పుడు కూడా మీ బలహీనత గురించి ఎవరికీ చెప్పకండి. చెప్పారంటే మీ బలహీనతను ఎవరైనా అవకాశంగా తీసుకోవచ్చు.
#2. మూర్ఖులకు దూరం పాటించండి:
మూర్ఖులకు దూరంగా వుండండి. మూర్ఖులు ఇతరుల పనులకు ఆటకం కల్పిస్తారు. కాబట్టి ఆ తప్పు చెయ్యద్దు.
#3. ఇతరుల మాటలని నమ్మకండి:
ప్రతీ సారి ఇతరులని నమ్మకండి. ఇతరులని నమ్మితే చిక్కులో పడచ్చు. కనుక నమ్మద్దు.
#4. ఏమీ ఇతరుల నుంచి ఆశించకూడదు:
ఎప్పుడు కూడా దేనిని ఆశించవద్దు అని ఆచార్య చాణక్య. చాణక్య నీతి ద్వారా చెప్పారు. కనుక వీటిని ఫాలో అయితే చాణక్య చెప్పినట్టు ఇబ్బందులు లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళిపోవచ్చు.