యువి క్రియేషన్స్ కి ఇదే మొదటి సారి కాదు చాలా సార్లు ఇలానే జరిగింది. ఈరోజు అనుష్క పుట్టిన రోజు అయినప్పటికీ ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. యువి క్రియేషన్స్ లో అనుష్క నెక్స్ట్ మూవీ చేస్తోంది. మామూలుగా అందరూ ఏదైనా అప్డేట్ ఇస్తూ ఉంటారు కానీ యువి క్రియేషన్ మాత్రం మళ్లీ అదే తప్పు చేస్తోంది.
ఒక్కొక్క సారి అప్డేట్ ఇస్తామని చెప్పినా కూడా టైం కి వాటిని పెట్టరు. అయితే ఇదే మొదటి సారి కాదు. రాధే శ్యామ్ సినిమా విషయంలో కూడా చాలా సార్లు ఇలాగే జరిగింది. ఇలా చాలా ఉన్నాయి.
ఇందు కోసమే సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యువి క్రియేషన్స్ ని ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అనుష్క సినిమాకి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. కనీసం ఆమె పోస్టర్ ని కూడా రిలీజ్ చేయలేదు. కనీసం ఒక విషెస్ ని కూడా చెప్పలేదు.
మామూలుగా ఏదో ఒకటి రెండు సార్లు టెక్నికల్ సమస్యలు ఉంటే ఊరుకుంటూ ఉంటారు కానీ ప్రతిసారి ఇలాగే ఉంటే ఫాన్స్ కి తప్పక బాధ కలుగుతుంది. సినిమాల కి సంబంధించి అప్డేట్స్ ఇవ్వక పోతే ఫ్యాన్స్ కి బాధ రావడం సహజం. అందులో సందేహం లేదు. అదే విషయాన్ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు సాయంత్రం అనుష్క సినిమా అప్డేట్ ఉంది అని అన్నారు. అప్పుడైనా సరే విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి.