Ads
ఆ పరమేశ్వరుడు భక్త సులభుడన్న సంగతి తెలిసిందే. చెంబుడు నీళ్లు పోసి.. నోరారా ఆయన్ను పిలుస్తూ నమస్కారం పెడితే మురిసిపోతాడు.. భక్తులు ఏ ఆపదలో ఉన్నా వచ్చి కాపాడతాడు. ఇది ఓ బ్రిటిష్ వ్యక్తికీ కూడా అనుభవమైంది. ఆ పరమశివుడు పై ఉన్న అపార భక్తి తోనే ఆయన బైజ్ నాధ్ మహాదేవ్ ఆలయాన్ని నిర్మించాడు. ప్రపంచం లో బ్రిటిష్ వారు నిర్మించిన ఏకైక దేవాలయం బైజ్ నాధ్ మహాదేవ్ ఆలయం. దీని వెనుక చరిత్రలో వివరం గా చెప్పబడి ఉంది.
Video Advertisement
1879 వ సంవత్సరం లో బ్రిటిష్ వారు భారత్ ను పాలిస్తున్న కాలం లో బ్రిటిష్ లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ ఆఫ్ అగర మాల్వా ఆఫ్ఘన్ పఠాన్లతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ సమయం లో ఆయన ఇండియా లో ఉన్న తన భార్య కు ఉత్తరాలు రాస్తూ ఉండేవారట. అయితే.. యుద్ధ సమయం కావడంతో.. మార్టిన్ కు తన భర్త గురించి ఆందోళన గా ఉండేదట. ఒకసారి ఉత్తరం రాకపోతే.. ఆమె బెంబేలెత్తిపోతోంది. ఈ సమయం లో ఆమె ఓ రోజు బైజ్ నాధ్ ఆలయాన్ని సందర్శించడం జరుగుతుంది.
ఆ ఆలయం లో పండితులు ఆ మహా శివునికి పూజలు చేస్తూ ఉండడాన్ని గమనిస్తుంది. ఆమె విచార వదనం తో ఉండడం తో ఆమె దగ్గరకు వచ్చిన ఓ పండితుడు ఏమి జరిగిందని ప్రశ్నిస్తాడు. ఆమె జరిగిన సంగతి చెప్పడం తో… ఆయన ఆ శివుడ్ని పూజించమని.. అంతా మంచే జరుగుతుందని హితవు చెప్తాడు. ఆమెకు “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని ఉపదేశించి 11 రోజుల పాటు పఠించమని చెబుతాడు.
ఆమె ఆ మంత్రాన్నే స్మరించుకుంటూ ఆ పరమేశ్వరుడిని కొలుస్తూ ఉంటుంది. 11 వ రోజు నాటికి ఆమెకు ఓ ఉత్తరం వస్తుంది. యుద్ధం పూర్తి అయిందని, ఈ యుద్ధం లో గెలిచామని చెబుతాడు. అసలు తాను చనిపోయేవాడినని.. అంతలా తన చుట్టూ పఠాన్లు చుట్టుముట్టారని.. ఆ సమయం లో జటాజూటాలు కలిగిన ఓ యోగి వచ్చి వారితో పోరాడి తనను కాపాడి గెలిపించినట్లు ఉత్తరం లో రాస్తాడు. ఆ తరువాత మార్టిన్ కూడా ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చాక జరిగినదంతా తెలుసుకుని ఆ యోగి పరమేశ్వరుడే అని గ్రహిస్తాడు.
తన భార్య శివుడికి పూజ చేసుకోవడం, తన భర్త ఇంటికి క్షేమం గా వస్తే.. గుడిని పునర్నిమిస్తామని మొక్కుకోవడం గురించి కూడా మార్టిన్ తెలుసుకుంటాడు. ఆ తరువాత ఇద్దరు కలిసి బైజనాధ్ మహాదేవ్ ఆలయానికి వెళ్లి పూజ చేసుకుని.. పునర్నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తారు. ఇప్పటికీ ఆ దేవాలయ గోడలపై కల్నల్ దంపతుల పేర్లు చెక్కబడి ఉండడం మనం గమనించవచ్చు.
End of Article