Ads
యువచిత్ర ఆర్ట్స్ యూనిట్స్ బ్యానర్ లో 1990లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ, శోభన, నిరోషా హీరో, హీరోయిన్స్ గా నటించిన చిత్రం నారీ నారీ నడుమ మురారి.
Video Advertisement
ఊర్వశి శారద, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, రమాప్రభ, తనికెళ్ల భరణి ప్రధాన తారాగణంగా అల్లరించి మెప్పించారు. అప్పటిలో ఈ చిత్రానికి గాను కీరవాణి తండ్రి శివశక్తిదత్తలు మరియు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచయితగా పనిచేశారు.
యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణకు ఈ చిత్రం ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేయగలరని గుర్తింపు వచ్చింది. అత్త గా నటించిన శారద, బాలయ్య మధ్య సన్నివేశాలు చాలా హాస్యాస్పదంగా అప్పట్లో ప్రేక్షకులను అలరించాయి. ఇద్దరి భామల మధ్య నలుగుతున్న ముద్దులు బావగా ప్రేక్షకులను అలరించాడు బాలకృష్ణ.
ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ గారు సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రం లోని ఇరువురి భామల కౌగిలిలో స్వామి అనే పాట ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంటుంది.
ఈ చిత్రం ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీగా మంచి హిట్ ను అందుకుంది. అసలు విషయానికొస్తే, అప్పటిలో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు మెగాస్టార్ చిరంజీవిగారి ఇంట్లో చిత్రీకరించినవే.
తమిళనాడులోని వెలచ్చేరి ప్రార్థనలో చిరంజీవికి హనీ హౌస్ అనే గెస్ట్ హౌస్ ఉంది. దీని పక్కన రెండు ఎకరాల స్థలం కూడా చిరంజీవిదే.
ఈ చిత్రంలో బాలకృష్ణ ఒక పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు. ఆ పూరి గుడిసె కూడా చిరంజీవి చెందిన స్థలంలోనే నిర్మించారు. ఈ చిత్రంలోని చాలా మటుకు సన్నివేశాలు చిరంజీవి గెస్ట్ హౌస్ లోనే చిత్రీకరించారట.
Also Read :
- ఆ తప్పు వల్లే చిరంజీవి తమిళనాట స్టార్ హీరో అవ్వలేదు.. అసలు విషయం చెప్పిన కమల్ హాసన్..!
- “సర్కారు వారి పాట” క్లైమాక్స్‌లో ఇది గమనించారా..? ఇంత పెద్ద పొరపాటు ఎలా చేశారు..?
End of Article