వైభవం గా ‘బాలయ్య అభిమాని’ వివాహం..!! ‘బాలయ్య’ రాలేదు కానీ ..!!

వైభవం గా ‘బాలయ్య అభిమాని’ వివాహం..!! ‘బాలయ్య’ రాలేదు కానీ ..!!

by Anudeep

Ads

టాలీవుడ్ హీరో బాలయ్య అంటే ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్. అలాగే బాలకృష్ణ కూడా తన అభిమానులతో ఎంతో ఆప్యాయంగా ఉంటారు. అయితే తాజాగా ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఒక పెళ్లి కొడుకు తన పెళ్లికి బాలయ్య కచ్చితంగా రావాలని బాలయ్య వస్తే మాత్రమే తాళిబొట్టు కడతానని మొండి పట్టు పట్టిన ఘటన తెలిసిందే. నందమూరి తారకరత్న మరణంతో బాలయ్య ఆ పెళ్ళికి హాజరవుతాడా.. లేదా అని అందరు సందిగ్ధం లో పడ్డారు.

Video Advertisement

 

 

అయితే బాలయ్య అభిమాని కోమలీ పెద్దినాయుడు బాలయ్య కోసం.. 1 కాదు.. 2 కాదు ఏకంగా 3 ఏళ్లు పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. పెళ్లి కూతురు గౌతమీ ప్రియ కూడా బాలయ్య ఫ్యాన్ అవ్వడంతో.. బాబు వస్తేనే పెళ్లి చేసుకుంటాం అని కండీషన్ పెట్టారు. ఈ విషయం వైజాగ్ ఫ్యాన్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ ద్వారా.. బాలయ్య అల్లుడు భరత్‌ వద్దకు.. ఆయన ద్వారా బాలయ్య దృష్టికి వెళ్లింది. నటసింహం కూడా వివాహానికి వచ్చేందుకు అంగీకరించారు.

balayya son-in-law attended his fan's wedding..

దీంతో పెద్దినాయుడు బాలయ్య కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మూడెకరాలు స్థలంతో భారీ సెట్ వేయించారు. బాలయ్య బాబు గారి రేంజ్‌కి ఎక్కడా తగ్గకుండా ఏర్పాట్లు చేశారు. దాదాపు 15 రోజుల ముందు నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టారు. ప్రయివేటు సెక్యురిటీ కూడా ఏర్పాటు చేశారు. ఊరంతా ప్లెక్సీలు, స్వాగత బోర్డులు, కటౌట్లు పెట్టారు. ముహూర్తం మార్చి 11 రాత్రి 2.12 నిమిషాలకు. కానీ బాలయ్య ఆ పెళ్లికి అటెండ్ అవ్వలేకపోయారు.

balayya son-in-law attended his fan's wedding..

అయితే నవ దంపతులను ఆశీర్వదించేందుకు బాలయ్య చిన్న అల్లుడు భరత్ వివాహానికి హాజరయ్యారు. వివాహానికి హాజరైన బాలయ్య అభిమానులు అందరితో ఆయన సెల్ఫీలు దిగారు. త్వరలోనే నాయుడు దంపతులను బాలయ్య బాబు వద్దకు తీసుళ్లడమో లేక బాలయ్యే జిల్లాకు వచ్చినప్పుడు కల్పించడమో చేస్తామని అల్లుడు భరత్ హామీ ఇచ్చారు. అంతే కాకుండా బాలయ్య కి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని.. అలా ఆయన ప్రతి పెళ్లికి వెళ్లడం వీలు కాదన్నారు. బాలయ్య బాబు వస్తేనే ఇకపై వివాహం చేసుకుంటామని అభిమానులు ఎవరూ కోరుకోవద్దని ఆయన సూచించారు.


End of Article

You may also like