ఆ సినిమాకి బండ్ల గణేష్ ఒక్క రోజుకి అడిగిన రెమ్యూనరేషన్ విని షాక్ అయిన డైరెక్టర్..!

టాలీవుడ్ లో కమెడియన్ గా, నిర్మాతగా మాత్రమే కాకుండా వక్తగా కూడా బండ్ల గణేష్ కి మంచి గుర్తింపు ఉంది. పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో బండ్ల గణేష్ చేసే హడావుడి అందరికీ తెలిసిందే. బండ్ల గణేష్ స్పీచ్ లకి సైతం అభిమానులున్నారు.

ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ పలు సందర్భాల్లో వివాదాస్పద ట్వీట్లు చేయడం ద్వారా వార్తల్లో నిలిస్తుంటాడు. మరికొన్ని రోజుల్లో రవితేజ నటించిన రామారావ్ ఆన్ డ్యూటీ థియేటర్లలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తొట్టెంపూడి వేణు కీలక పాత్రలో నటించారు.

ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పాలని దర్శకుడు శరత్ మండవ బండ్లను సంప్రదించినట్టు సమాచారం. శరత్ మండవ ఒక్కరోజు వర్క్ అని చెప్పగా బండ్ల గణేష్ డబ్బింగ్ చెప్పాలంటే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. బండ్ల చెప్పిన అమౌంట్ విని షాకవ్వడం దర్శకుడి వంతైందట. అయితే ఈ విషయం తెలిసి వేణుకి బండ్ల గణేష్ వాయిస్ సూట్ అయ్యే ఛాన్స్ లేదని డైరెక్టర్ ఎందుకు ఆ విధంగా ఆలోచించాడో అని నెటిజన్ల నుంచి కామెంట్ చేస్తున్నారు.

మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్లలో వేగం పెంచింది. రవితేజ సినిమా ఖిలాడీ ఫ్లాప్ అయినా రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా హక్కులు రికార్డ్ రేటుకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచింది. ప్రస్తుతం రవితేజ ధమాకా, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే చిరంజీవి నటించే సినిమాలో కూడా రవితేజ నటించనున్నాడు.

ఇవి కూడా చదవండి: “రంగ రంగ వైభవంగా” సినిమా నెగిటివ్ టాక్‌కి… కారణం అయిన 5 విషయాలు ఇవేనా..?