మే 3 వ తేదీన, అంటే సోమవారం రోజు అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి మధ్య జరగాల్సిన ఐపీఎల్ 2020 మ్యాచ్ వాయిదా పడింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేయర్స్ వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ ఇద్దరికీ పాజిటివ్ రావడంతో యాజమాన్యం ఈ డిసిషన్ తీసుకున్నారు. దాంతో బీసీసీఐ ప్లాన్ బి అమలు చేయడానికి సిద్ధం అయ్యింది.

bcci plan b to continue ipl 2021

ఇంక మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ లు అన్ని ముంబైలో నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించినట్టు సమాచారం. ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్ లో జరగాల్సిన మ్యాచ్ లని రద్దు చేసి మిగిలిన మ్యాచ్ లు అన్ని ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించబోతున్నారట. అంతే కాకుండా ఫైనల్ మ్యాచ్ మే 31 తేదీన కాకుండా జూన్ మొదటి వారంలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని క్రిక్ ఇన్ఫో తెలిపింది.

ముంబై లో పెద్ద బయో బబుల్ క్రియేట్ చేసి అన్ని మ్యాచ్ లను అక్కడ నిర్వహించబోతున్నారు. అంతే కాకుండా ఎనిమిది జట్ల కోసం హోటల్ రూమ్స్ వెతికే పనిలో ఉన్నారు. ఈ సీజన్ లో జరిగిన మొదటి విడత మ్యాచ్ లను ముంబైలో నిర్వహించారు. అప్పుడు జట్ల ప్రాక్టీస్ కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ తో పాటు బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ని ఉపయోగించారు. గతంలో ముంబైలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నా కూడా ఆంక్షల కారణంగా కరోనా కేసులు తగ్గాయి.

bcci plan b to continue ipl 2021

దాంతో మ్యాచ్ నిర్వహించడానికి ముంబై బెస్ట్ ఛాయిస్ అని బోర్డ్ భావిస్తున్నట్లు సమాచారం. ముంబై లోని పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ అందుబాటులో ఉండడంతో అక్కడ బయో బబుల్ ఏర్పాటు చేయడానికి బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ఫ్రాంచైజీ లు కూడా ఈ సమయంలో వెనక్కి తగ్గడానికి ఒప్పుకోవడం లేదు. దాంతో ఎలాగైనా సరే ఐపీఎల్ 2021 సీజన్ కొనసాగించాలని కోరుతున్నారు.

bcci plan b to continue ipl 2021

కరోనా కారణంగా మ్యాచ్ వాయిదా పడడంతో షెడ్యూల్ లో కూడా మార్పులు జరగబోతున్నాయి. ప్రస్తుతం అన్ని టీమ్స్ సెల్ఫ్ ఐసొలషన్ లో ఉన్నాయి. ఈ వారాంతానికి ఐసొలషన్ ముగియనుండడంతో మిగిలిన  లీగ్ మొత్తం ముంబైలో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.