బిర్యానీ ఆకుతో కలిగే ఈ లాభాలు ఏంటో తెలుసా..? తెలిస్తే ఇంకెప్పుడు వదిలిపెట్టరు..!

బిర్యానీ ఆకుతో కలిగే ఈ లాభాలు ఏంటో తెలుసా..? తెలిస్తే ఇంకెప్పుడు వదిలిపెట్టరు..!

by Anudeep

Ads

తెలుగు వాళ్ళు భోజన ప్రియులు. ఎన్ని సమస్యలు ఉన్నా కడుపు నిండా రుచికరమైన భోజనం తింటే చాలు వాటిని పరిష్కరించుకోవడానికి ఎక్కడలేని సత్తువని తెచ్చేసుకుంటారు. రకరకాల రుచుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక బిర్యానీ సంగతి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా హైదరాబాద్ వారికి బిర్యానీ అమితమైన ఇష్టం.

Video Advertisement

ఇక్కడ జరిగే ఫంక్షన్స్ లో కూడా బిర్యానీ లేని విందు భోజనమే ఉండదు. మరి బిర్యానీ కి అంత సువాసనని, అంత టేస్ట్ ను తీసుకొచ్చేది ఏంటో అందరికి తెలిసిందే. బిర్యానీ ఆకే. ఈ బిర్యానీ ఆకులను వాసన, టేస్ట్ కోసం వేసి.. తినేటప్పుడు మాత్రం పక్కన పడేస్తూ ఉంటారు.

bay leaf 1

ఈ ఆకుని కాసేపు వేయడం వల్లే బిర్యానీకి బోలెడు రుచి వస్తూ ఉంటుంది. అయితే చాలా మంది బిర్యానీ అనగానే అదేదో మసాలా ఫుడ్, హెల్త్ కి మంచిది కాదు అన్నట్లు చూస్తారు కానీ, బిర్యాని ఆకు వలన చాలానే లాభాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం. వాత‌, క‌ఫ‌, పిత్త‌ సంబంధమైన అనారోగ్య సమస్యలను అరికట్టడంలో బిర్యానీ ఆకు కీలక పాత్ర పోషిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి నరాలకు కొత్త శక్తిని ఇస్తుందట. అలాగే పురుషుల్లో సంతాన లేమి సమస్యని కూడా తగ్గిస్తుంది.

bay leaf 2

అలాగే నత్తిని తగ్గించడంలో  కూడా బిర్యానీ ఆకు కీలక పాత్ర పోషిస్తుంది. బిర్యానీ ఆకుని శుభ్రం చేసుకుని నోటిలో వేసుకుని నమిలి, ఆ రసాన్ని మింగడం వలన మంచి ఫలితాలున్నాయట. నోటి దుర్వాసన తగ్గడమే కాకుండా.. స్త్రీలలో వచ్చే గర్భాశయ సమస్యలను కూడా నయం చేస్తుందట. బిర్యానీ ఆకుని చూర్ణం చేసి తేనే తో కలిపి తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అయ్యి చర్మం నిగారిస్తుందట. అలాగే.. శరీరం నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది.


End of Article

You may also like